విజయనగరం

పోలీసులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 19: కేసుల పరిశోధన, పరిష్కారంతో నిత్యం సతమతమవుతున్న పోలీసు సిబ్బందికి ఊరట కలిగించే నిర్ణయాన్ని జిల్లా ఎస్పీ కాళిదాసు తీసుకున్నారు. ఇకనుంచి జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి 15రోజులకు ఒకరోజు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించటంతోపాటు వెంటనే ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఎఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు ప్రతి 15రోజులకు ఒకరోజు చొప్పున సెలవులు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. అత్యవసర పరిస్థితులలో మాత్రం ఈ సిబ్బంది సెలవు ఉపయోగించుకోకుండా విధులు నిర్వహించవలసి ఉంటుంది. పోలీసుశాఖలో ఉద్యోగం అంటేనే ప్రతినిత్యం సమస్యలు, ఒత్తిడితో కూడుకున్న వ్యవహారంగా భావిస్తున్న తరుణంలో ఎస్పీ కాళిదాసు తీసుకున్న తాజా నిర్ణయంతో కిందిస్థాయి పోలీసులకు 15రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులతో ఒకరోజు పూర్తిగా గడిపేందుకు, వ్యక్తిగత పనులు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. 15రోజులకు ఒకరోజు చొప్పున సెలవు ఇవ్వడం వలన పోలీసు సిబ్బందిలో మానసిక ఒత్తిడి తగ్గి మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు అవకాశం కలుగుతుందని ఎస్పీ కాళిదాసు తెలిపారు.