విజయనగరం

ప్రైవేటు స్థలాలను అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జూలై 21: నెల్లిమర్ల నగర పంచాయతీలోని ప్రైవేటు స్థలాలను గుర్తించి అభివృద్ధి చేస్తామని కమిషనర్ వి.అచ్చింనాయుడు తెలిపారు. నగర పంచాయతీలో లే అవుట్లు, ప్రైవేటు స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని చెప్పారు. ఇటువంటి స్థలాలను నగర పంచాయతీ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేసి మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. వారం రోజులలోగా స్థలాల యజమానులు నగర పంచాయతీ టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని కోరారు. స్థలాల డాక్యుమెంట్లు, పత్రాలు తీసుకొచ్చి నమోదు చేసుకోవాలని కోరారు. స్వచ్చ్భారత్‌లో భాగంగా దీన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే రోగాలకు దూరంగా ఉండొచ్చనన్నారు. ఖాళీ స్థలాలకు ఎటువంటి పత్రాలు లేకుంటే అటువంటి వాటిని నగర పంచాయతీ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. ఖాళీ స్థలాల్లో విష జంతువులు సంచారం చేస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్థలాలు అభివృద్ధి చేసుకోవాలని కోరారు.