విజయనగరం

మొక్కుబడిగా అవగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూలై 21: పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సు మొక్కుబడిగా జరిగింది. ఈ సదస్సుకు కొద్దిమంది కౌన్సిల్ సభ్యులు హాజరుకాగా, మరికొన్ని వార్డుల మహిళా కౌన్సిలర్ల తరపున వారి భర్తలు, వారి తండ్రులు హాజరయ్యారు. దీంతో ఈ సదస్సు మొక్కుబడిగా సాగింది. పట్టణంలో 3260 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించగా, ఇంతవరకు 1620 మరుగు దొడ్ల నిర్మాణం మాత్రమే జరిగిందని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. కొంతమంది కౌన్సిల్ సభ్యుల అశ్రద్ద, అధికారుల నిర్లక్ష్యంవల్ల ఏడాదినుంచి మరుగుదొడ్ల నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఈ నేపధ్యం లో గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశానికి చాలామంది కౌన్సిల్ సభ్యులు హాజరుకాలేదు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో బహిరంగ మలవిసర్జన లేకుండా అన్ని వర్గాల వారు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన బహిరంగ మలవిసర్జన లేకుండా చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహనరావు, డిప్యూటీ ఇంజనీర్లు పిఎస్‌వివి ప్రసాద్, ఎస్.మత్స్యరాజు పాల్గొన్నారు.