విజయనగరం

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూలై 21: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొ త్స అప్పలనర్సయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు అ న్నారు. గురువారం మండలంలోని ములకల గుమడాం గ్రామంలో గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సాధ్యంకాని హామీలను గుప్పించి అమలు చే యలేదన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా కాలయాపన చే స్తుందని, రైతులు, పొదుపు సంఘాల మహిళలకు రుణమాఫీ తూతూ మంత్రంగా చేపట్టిందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో బడుగు, బలహీనవర్గాల స ంక్షేమానికి పలు పథకాలు అమలుచేయగా వాటిలో కొన్ని పథకాలను ప్రస్తు త ప్రభుత్వం పేర్లు మార్పుచేసి అమలు చేస్తుందన్నారు. మళ్లీ స్వర్ణయుగం రా వాలంటే వైకాపా అధినేత జగన్‌ను ము ఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ సందర్భంగా లబ్దిదారులు పింఛన్లు అందడంలేదని వీరి దృష్టికి తీసుకువచ్చారు. సా యంత్రం రామన్నపేటలో గడపగడపకూ వైకాపా నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బూ డి వెంకటరావు, నాయకులు దొగ్గ దేవుడునాయుడు, సురేష్ పాల్గొన్నారు.