విజయనగరం

కాలువలను పరిశుభ్రం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి (రూరల్), జూలై 21: రెండు రోజులుగా వర్షాలు కురవడంతో కాలువల్లో చెత్తాచెదారాలు ఉండకుండా తక్షణమే పరిశుభ్రం చేయాలని అధికారులను మున్సిపల్ చైర్‌పర్సన్ టి.అచ్యుతవల్లి ఆదేశించారు. ఈ మేరకు తారకరామా కాలనీలో కాలువలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారకరామా కాలనీలో ఉన్న కాలువల్లో చెత్త నిల్వ ఉండిపోవడంతో వర్షపునీరు వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. దీంతో రోడ్లపై నీరు పారుతోందని, అటువంటి వాటిపై అధికారులు దృష్టిసారించాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులతో ప్రతీరోజూ చెత్తను ఆరుబయట వేసే విధంగా కృషి చేయాలన్నారు. సక్రమంగా పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాలు కురవడంతో ప్రజలకు వ్యాధులు సోకే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాయుడుకాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈమెతోపాటు వైస్ చైర్మన్ సిహెచ్.రమేష్‌నాయుడు, కమిషనర్ శంకరరావు ఉన్నారు.