విజయనగరం

చంద్రబాబు చిత్తశుద్ధి లేకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విషయంలో దోబూచులాట ఆడేది కాదని, ప్రత్యేకహోదా విషయంలో మొండిచేయి చూపేది కాదని మాజీ ఎమ్మెల్యే, వైకాపా జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఓటుకు నోటు కేసుకు, పార్టీలో కుమ్ములాటలకు భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో నోరు మెదపటం లేదని, చంద్రబాబు బలహీనతలను గమనించే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేతులు ఎత్తివేసే వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కృష్ణదాసు, కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించటం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదన్న కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీయకపోగా, హోదా సాధించటం వైకాపా, కాంగ్రెస్ పార్టీల బాధ్యతగా వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో ఆస్థులు సంపాదించటం వదులుకోలేక చంద్రబాబు హోదా విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదా విషయంలో తమ పార్టీ మొదటినుంచి చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఆందోళనలు చేపట్టిందని, గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో మహాధర్నా, రాష్ట్రంలో బంద్ నిర్వహించిందని, అప్పటినుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలనే విధంగా వ్యవహరించిన కారణంగానే కేంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదన్నారు. చంద్రబాబు లోసుగులను గమనించే ప్రధానమంత్రి మోదీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలులో విఫలమైన చంద్రబాబు ఇప్పుడు మాటలు చెప్పి మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్రంలో తమకు, రాష్ట్రంలో టిడిపికి అధికారం కట్టబెడితే ఢిల్లీ నగరానికి మించి అందమైన రాజధానిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ఇప్పుడు హామీలను విస్మరిస్తే చంద్రబాబు ఎందుకు నిలదీయటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, ప్రత్యేకహోది విషయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తే టిడిపి, బిజెపిలకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో వచ్చేనెల 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర బంద్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. విలేఖరులు అడిగిన ప్రశ్నకు ధర్మాన కృష్ణదాసు సమాధానం ఇస్తూ పర్యావరణానికి ముప్పుగా, పేదప్రజల పొట్టకొట్టే విధంగా ఉన్న అణువిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు పాల్గొన్నారు.