విజయనగరం

జిసిసి ప్రక్షాళన దిశగా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మే 18: జిసిసి సంస్థను ప్రక్షాళన చేసి గిరిజనులకు చేరువగా తీసుకువెళ్లడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిసిసి మేనేజింగ్ డైరక్టర్ టి.బాబూరావునాయుడు తెలిపారు. శుక్రవారం పార్వతీపురంలోని ఐటిడి ఎ కలెక్టర్ క్యాంపు హౌస్‌లో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన సహకార సంస్థ గిరిజనులకు మరింత చేరువకావాల్సి ఉందన్నారు. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు మొదలుకొని, దళారీ వ్యవస్థను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు జిసిసి ద్వారా కొనుగోలు చేయడం ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు. గిరిజనులకు ఈ ఏడాది రూ.10కోట్ల వ్యవసాయ రుణం అందించామన్నారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు కల్పించాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని జిసిసి డిపోలకు సరుకులను తరలించడానికి ఇచ్చే ట్రాన్స్ పోర్టు చార్జీలు చాలకపోవడం వల్ల సంస్థకు చెందిన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కాఫీ పండించి మార్కెటింగ్ చేయడమే కాకుండా అన్ని ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచాల్సి ఉందన్నారు. జసిసిలో సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. ఎల్విన్‌పేటలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీని గిరిజనులకు కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిసిసిని గాడిలోపెట్టడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకునే దిశగా ఈనెలాఖరులోగా సి ఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. ఐటిడి ఎ పీవోలతో పాటు ఇతర అధికారుల సమన్వయంతోనే గిరిజనాభివృద్ధికి అవకాశాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఐకెపి ఎపిడి సావిత్రి, జిసిసి డి ఎం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

సౌర విద్యుత్ రంగంలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం (చీపురుపల్లి), మే 18: సౌర విద్యుత్ రంగంలో సాంకేతిక నిపుణులను తయారు చేయుటకుగాను సూర్యమిత్ర పేరున నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ వీరసుభ్రమణ్యం తెలిపారు. శిక్షణ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విజయవాడ ఏర్పాటు చేయనన్నట్టు వెల్లడించారు. 45రోజుల పాటు నిర్వహించే శిక్షణలో భోజనం, వసతి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారని తెలిపారు. అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, ఇంజనీరింగ్ డిప్లమో లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. జిల్లా నుంచి 50 దరఖాస్తులు మాత్రమే స్వీకరించడం జరుగుతుందని ముందుగా దరఖాస్తు చేసుకొనే వారికి మొదటి ప్రాధాన్యత క్ర మంలో ఎంపిక చేస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులో పేరు, తండ్రిపేరు, చిరునామా, ఫోన్‌నెంబర్ వ్రాయాలని, ఆధార్, విద్యార్హత, కుల ధృవీకరణ పత్రాలను నకళ్లను దరఖాస్తుతో జత చేసి ఫోటోను అతికించాలని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 30వతేదీలో గా జిల్లా మేనేజర్, నెడ్‌క్యాప్, ఎంఐజి 70, అలకనందకాలనీ, విజయనగరం వారి కార్యాలయానికి అందజేయాలని కోరారు.

మంత్రిని కలిసిన కలెక్టర్
విజయనగరం (గంట్యాడ), మే 18: రాష్ట్ర భూగర్భ, గనుల శాఖా మంత్రి ఆర్‌విఎస్ కె రంగారావును జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహానికి మంత్రి చేరుకున్న విషయం తెలుసుకున్న కలెక్టర్ మర్యాద పూర్వకంగా వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు కొద్దిసేపు పలు విషయాలపై చర్చించారు.