విజయనగరం

క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, మే 18: యువకులు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని, యువతే దేశానికి సంపదని జిల్లా ఎస్పీ జి.పాలరాజు అన్నారు. శుక్రవారం స్థానిక సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మైత్రీ క్రికెట్ టోర్నమెంట్‌ను జిల్లా ఎస్పీ పాలరాజు ప్రారంభించారు. ఓఎస్‌డీ విక్రాంత్‌పాటిల్, ఏఎస్పీ దీపికాపాటిల్‌తో కలిసి ఎస్పీ పాలరాజు శాంతికపోతాలను ఎగురవేశారు. ఈమేరకు క్రీడాకారులు 26 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ పాలరాజు బ్యాటింగ్ చేయగా, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ బౌలింగ్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ పోలీసులు ప్రజల్లో భాగమేనని, వారిని చూసి నేరస్థులు భయపడాలే కానీ ప్రజలు కాదన్నారు. యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. గెలుపు ఓటమిలను పట్టించుకోకుండా క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. చదువు యువకుల్లో సంస్కారం, విలువలను పెంచుతుందని, నేటి విద్యా విధానంలో విలువలు పెరగడం లేదన్నారు. ఈమేరకు విలువలతో కూడిన విద్య సమాజానికి అవసరమన్నారు. చదువు‘కొనే’ పరిస్థితులు ఏర్పడటం వలనే విలువలు కనబడటం లేదన్నారు. పోలీసులను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. యూనిఫారంలో ఉన్న ప్రజలే పోలీసులన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యాబోధనలు లభిస్తున్నా ప్రజలు కార్పొరేట్ విద్యాసంస్థలపై మోజు పెట్టుకుంటున్నారన్నారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా యువకులు అడుగులు వేయాలన్నారు. ఈ దేశానికి సహజసంపద యువతేనన్నారు. స్మార్ట్ఫోన్లుతో అధికంగా గడపటం వలన యువత పక్కదారి పడుతున్నారన్నారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలను ఇచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకోరాదన్నారు. హెల్మెట్లు లేకుండా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవద్దన్నారు. అనంతరం ఓఎస్‌డీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ యువత అసాంఘిక కార్యకలాపాలవైపు వెళ్లకుండా క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడా పోటీలను పోలీస్‌శాఖ తరచూ నిర్వహిస్తుందన్నారు. ఏఎస్పీ దీపికాపాటిల్ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉన్నతశిఖరాలను అధిరోహించవచ్చునన్నారు.
వృద్ధమిత్రకు సన్మానం : రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన వృద్ధమిత్ర కె.కృష్ణమూర్తిని జిల్లా ఎస్పీ పాలరాజు, ఏఎస్పీ దీపికాపాటిల్, ఓ ఎస్‌డీ విక్రాంత్ పాటిల్ సన్మానించారు. ఈమేరకు కృష్ణమూర్తి సేవలను అభినందించారు. ఎంతోమంది వృద్ధులకు సొంతడబ్బులతో హెచ్‌సీ కృష్ణమూర్తి సామాజిక సేవలను చేయడాన్ని అభినందించారు. అనంతరం పేద వృద్ధులకు చీరలు, పంచెలను పంపిణీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలను నాటారు. ఈ టోర్నమెంట్‌లో తొలిత పట్టణానికి చెందిన రెండు టీంలు తలపడ్డాయి. 4మండలాల నుంచి 46క్రికెట్ టీంలు పాల్గొంటున్నాయి. ఈ పోటీలను 24వ తేదీ వరకు నిర్వహించనున్నామని, ఇందులో విజేతలైన వారికి సీఐ మహ్మద్ ఇలియాస్ క్రికెట్ కిట్ల్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు గణేశ్వరరావు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి గోవిందరావు, ఎస్‌ఐ ఫకృద్ధీన్, డీడీ నాయుడు, జ్ఞాన ప్రసాద్ పాల్గొన్నారు.

ఏంపి అశోక్‌పై బొత్స విమర్శలు సిగ్గుచేటు’
విజయనగరం(గంట్యాడ), మే 18: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైకాపా నాయకుడు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలు అర్థరహితమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు అన్నారు. శుక్రవారం అశోక్‌బంగ్లాలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అశోక్ గజపతిరాజును విమర్శించే అర్హత బొత్సకు లేదని విమర్శించారు. రాష్ట్ర
విభజన సమయంలో బొత్స సత్యనారాయణ చేసిన అన్యాయాన్ని ప్రజలు మరువలేదని అన్నారు. సమావేశంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్ ఎన్ ఎం రాజు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ వి. ఎస్. ప్రసాద్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వి.నర్సింహరావు, ఎ ఎంసీ చైర్మన్ శైలాడ త్రినాథరావు పాల్గొన్నారు.