S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/12/2019 - 04:23

అచ్చంపేట, మార్చి 11: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ మండల పరిధిలోని శ్రీ ఉమా మహేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. నల్లమలలో ప్రసిద్ధ ఆలయంగా పేరు పొందుతున్న శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు దొంగలు భక్తుల ముసుగులో దైవ దర్శనానికి వచ్చినట్లు నటించి కాసేపు కల్యాణ మండపం దగ్గర పడుకున్నారు.

03/12/2019 - 04:38

వనస్థలిపురం (హైదరాబాద్), మార్చి 11: నకిలీ దస్తావేజలు సృష్టించి బినామీ పేరుతో ఉన్న భూమి అమ్మకానికి బేర సారాలు చేసిన గ్యాంగ్ స్టర్ నరుూం అనుచరులను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద రూ.88.37 లక్షల నగదు, మూడు ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

03/12/2019 - 04:22

సిరిసిల్ల, మార్చి 11: ప్రేమ వ్యవహారంలో వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతో డిగ్రీ విద్యార్థిని శరీరంపై కినోసిన్ పోసుకుని అగ్ని కీలలకు ఆహుతైన ఉదంతం వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో చెప్యాల రేణుక(20) అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. రజక సామాజిక వర్గానికి చెందిన రేణుక సిద్దిపేటలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది.

03/12/2019 - 04:21

నసురుల్లాబాద్, మార్చి 11: తండ్రి చేతిలో తనయుడు హతం అయిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ సందీప్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. దాసరి పోశెట్టి (32)ని అతని తండ్రి దాసరి మానయ్య ఇనుప వస్తువుతో కొట్టి హత్య చేశాడు.

03/12/2019 - 04:20

గజ్వేల్, మార్చి 11: సెల్‌ఫోన్‌కు బానిసైన కొడుకును తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై అతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని ప్రజ్ఞాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

03/12/2019 - 03:55

హైదరాబాద్, మార్చి 11: తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జీ శ్రీనివాస్ యాదవ్, ఆనాటి సంస్థ కార్యదర్శి కేపీ శంకరరావులను ప్రాసిక్యూట్ చేసేందుకు డీజీపీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు జీవో -3, జీవో -4లను జారీ చేసింది. 2006 -2010 మధ్య జిల్లా గ్రంథాలయ సంస్థలో జరిగిన అవినీతికి సంబంధించి వీరిద్దరిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

03/12/2019 - 02:50

న్యూఢిల్లీ, మార్చి 11: వైఎస్సార్ కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసుకోనేందుకు పిటిషనర్‌కు సుప్రీం కోర్టు వెసులుబాటు కల్పించింది. నారాయణరెడ్డి హత్యకేసులో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్‌బాబు పేరును తప్పించడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య శ్రీదేవి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

03/12/2019 - 02:58

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీగ్రిడ్స్ వ్యవహారం ఇటు హైకోర్టు అటు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో దీనిపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఐటీగ్రిడ్స్ సీఈవో డాకవరపు అశోక్‌కు చుక్కెదురు అయ్యింది.

03/12/2019 - 02:58

న్యూఢిల్లీ: సంజయ్ దత్ హీరోగా నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ (తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్) సినిమా గుర్తుందా? అందులో హాస్పిటల్‌లోకి ఏ జబ్బూలేని వ్యక్తులను తీసుకువచ్చి బెడ్‌పై పడుకోబెట్టి పేషంట్లుగా చూపేందుకు హీరో చేసే ప్రయత్నం చూసి మనం కడుపుబ్బా నవ్వుకున్నాం. కాని తమ కాలేజీ గుర్తింపు కోసం అలాంటి ఫీట్‌నే చేయబోయి అడ్డంగా బుక్కయ్యిందో ఒక మెడికల్ కాలేజీ యాజమాన్యం.

03/12/2019 - 02:57

హైదరాబాద్: గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. రేవంత్‌రెడ్డి తరపున వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

Pages