S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/12/2019 - 02:36

విజయవాడ (క్రైం), మార్చి 11: మామను కొరికిన కేసులో అల్లుడికి మూడేళ్ల జైలు, రూ. 26వేలు జరిమానా విధిస్తూ నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో బావాజీపేటకు చెందిన నెల్లి అప్పలనాయుడు తన మామ పటమటకు చెందిన లక్ష్మణరావును 2016 నవంబర్ 10న గొడవ పడి చేతి బొటనవ్రేలు కొరికాడు.

03/12/2019 - 02:36

పెనమలూరు, మార్చి 2: నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలను నడిపి రోడ్డు మీద ఇద్దరు డ్రైవర్లు దెబ్బలాటకు దిగి బ్రేక్ ఇన్‌స్పెక్టర్ దృష్టిలో పడిన సంఘటన సోమవారం జరిగింది. పోరంకి సూర్యదేవాలయం వద్ద చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులను ఇంటికి తరలించే ప్రయత్నంలో బస్ డ్రైవర్ రాంగ్ రూట్‌లో నడిపాడు.

03/12/2019 - 02:35

పెనమలూరు, మార్చి 11: కానూరు పరిధిలోని కామయ్యతోపు సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లి సోమవారం మృతి చెందిన సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత సోమవారం బైక్ ఢీకొనడంతో దైవర్సీ (35)కి రోడ్డు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లింది. వారం రోజులుగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ పెద్దిరాజు తెలిపారు.

03/12/2019 - 02:34

విజయవాడ (క్రైం), మార్చి 11: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసు శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన మీదట అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌లో భాగంగా నగర పోలీసు శాఖ ఎన్నికల సంఘం నియమావళిని అమలు చేస్తోంది. నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

03/12/2019 - 02:25

వికారాబాద్, మార్చి 11: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం నవాబుపేట్ మండలం అక్నాపూర్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల నర్సిములు (45) వికారాబాద్ నుంచి అక్నాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్నారు. మండల పరిధిలోని పులుసుమామిడి గేట్ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు.

03/12/2019 - 02:25

జీడిమెట్ల, మార్చి 11: గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎక్సైజ్ సీఐ వెంకటేశం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం, పొత్నూర్ గ్రామానికి చెందిన బొమ్మకంటి ఆనంద్ గౌడ్ (23) సుచిత్ర చౌరస్తా నుంచి కుత్బుల్లాపూర్ గ్రామానికి కాలేజీ బ్యాగులో గంజాయితో వెళ్తున్నాడు.

03/12/2019 - 02:24

ఖైరతాబాద్, మార్చి 11: సోదరిపై వేధింపులు నిలిపివేయాలని హెచ్చరించినందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రహమత్‌నగర్‌లో పృథ్వి (35) కుటుంబం నివాసం ఉంటుంది. ఇతని సోదరిని స్థానికంగా నివాసం ఉండే డేవిడ్ గత కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.

03/12/2019 - 02:24

వనస్థలిపురం, మార్చి 11: కుటుంబ తగాదాల కారణంగా భార్యను కత్తితో పొడిచి తాను కూడా పొడుచుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానింగా సంచలం కలిగించిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నకిరేకల్ ప్రాంతానికి చెందిన మారెడ్డి చెన్న కృష్ణారెడ్డి (58) భార్య పద్మజ (48) బ్రతుకు దెరువుకోసం నగరానికి వచ్చి వనస్థలిపురం, బీడీఎల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

03/12/2019 - 01:54

న్యూఢిల్లీ, మార్చి 11: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ, ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈదశలో తాము ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఈనెల 28కు వాయిదా వేసింది.

03/12/2019 - 01:49

న్యూఢిల్లీ, మార్చి 11: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)కి కోట్లాది రూపాయలు ముంచి, పరారీలో ఉన్న ప్రముఖ వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టం కింద నీరవ్ మోదీతోపాటు మరికొందరిపై కొత్తగా చార్జిషీట్ దాఖలు చేసినట్టు సంబంధిత వర్గాలు సోమవారం పేర్కొన్నాయి.

Pages