S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/13/2019 - 06:38

న్యూఢిల్లీ: బాణా సంచా కంటే ఆటోమొబైల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యం తీవ్రంగా ఉందని, ఈ రెండిటి వల్ల వచ్చే కాలుష్యంపై అధ్యయనం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఆటోమొబైల్ పరిశ్రమ వల్ల భారీ ఎత్తున కాలుష్యం వెలువడుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కాలుష్యం వల్ల ప్రమాదకరమైన పరిస్థితి వాతావరణంలో నెలకొని ఉందని కోర్టుపేర్కొంది.

03/13/2019 - 01:28

ఏలూరు, మార్చి 12: పశ్చిమ గోదావరి జిల్లాలో పది కోట్ల రూపాయల విలువైన బంగారం పట్టుబడింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద ఆడి కారులో 300 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

03/12/2019 - 23:18

జలదంకి, మార్చి 12: తల్లిదండ్రులు మందలించారన్న కారణంతో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యా ప్రయత్నం చేయగా ఒకరు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక గ్రామంలో మంగళవారం జరిగింది. బ్రాహ్మణక్రాక గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మండలంలోని హనుమకొండపాలెం, బికె అగ్రహారానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు వసతిగృహంలో ఉంటూ పదవ తరగతి చదువుతున్నారు.

03/12/2019 - 23:05

న్యూఢిల్లీ, మార్చి 12: పాకిస్తానీ మహిళకు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆమెను భారత్ విడిచివెళ్లిపోవాలన్న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఏజే భాంబనీతో కూడిన ధర్మాసనం స్పందించింది. ఈనెల 25 వరకూ ఆమెపై ఎలాంటి బలవంతపుచర్యలూ తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. భద్రతకు సంబంధించి నివేదిక ఆధారంగా ఆమె దేశం విడిచివెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.

03/12/2019 - 22:54

గుంటూరు/మంగళగిరి, మార్చి 12: ఎన్నికల కోడ్ కూసి 48 గంటలు గడవకముందే గుంటూరు జిల్లాలో మంగళవారం పోలీసులు దాదాపు 2 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరంలో కోటీ 16 లక్షల రూపాయలు, మంగళగిరిలో రూ 82. 52 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

03/12/2019 - 22:41

సీతానగరం, మార్చి 12: మండలంలోని మరిపివలస గ్రామం వద్ద రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రైల్వే హెచ్‌సి రత్నాకర్ అందించిన వివరాల ప్రకారం మండలంలోని నీలకంఠాపురం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు మరిపివలస గ్రామం వద్ద మంగళవారం రైలు ఢీకొంది. ఈ సంఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈమేరకు రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

03/12/2019 - 22:24

గార్ల, మార్చి 12: వేగంగా వెళ్ళుతున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళ నుంచి జారిపడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషాద సంఘటనలు మంగళవారం మహబూబాబాద్ జిల్లా గార్ల, గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ల సమీపాల్లో చోటుచేసుకున్నాయి.

03/12/2019 - 22:23

సుజాతనగర్/లక్ష్మీదేవిపల్లి, మార్చి 12: జిల్లా పరిధిలోని సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడిన సంఘటనలు మంగళవారం జరిగాయ. మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో అతివేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టిన సంఘటనలో ఇరువురు వ్యక్తులు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

03/12/2019 - 04:34

భువనగిరి, మార్చి 11: బైక్‌పై వస్తున్న నవదంపతులు ఆగి ఉన్న ట్రాన్స్‌పోర్టు వ్యాన్‌ను ప్రమాదవశాత్తు డీకొని మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

03/12/2019 - 04:32

పాలకుర్తి, మార్చి 11: దేశాన్ని రక్షించే ఆర్మీ జవాన్ వద్ద డబ్బులు డిమాండ్ చేసిన అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ బాలగాని ప్రవీణ్‌కుమార్‌కు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత రెండు ఏళ్లుగా భూమి సర్వే చేయాలని దరఖాస్తు చేసుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవు.

Pages