S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/15/2019 - 01:55

న్యూఢిల్లీ, మార్చి 14: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసులో తొలుత కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలపై నిర్ణయం తీసుకుంటానని, ఆ తరువాతే ఈ విమానాల కొనుగోలు ఒప్పందం కేసులోని వాస్తవాల్లోకి వెళ్తానని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.

03/14/2019 - 22:00

ముదిగొండ, మార్చి 14: రైతు నుండి 5వేల లంచం తీసుకుంటూ వీఆర్వో రాజేంద్రం ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం ఖమ్మంలో చోటుచేసుకొంది. ఎసిబి అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగొండ మండలంలోని గంధసిరి ఇంచార్జ్ విఆర్వోగా పనిచేస్తున్న డేగల రాజేంద్రం అదే గ్రామానికి చెందిన రైతు చెమట నాగేశ్వరరావుకు పాస్‌బుక్కు ఇచ్చేందుకు పదివేలు డిమాండ్ చేశాడు.

03/14/2019 - 21:59

చర్ల, మార్చి 14: చర్ల మండలంలో గురువారం ఉదయం మావోయిస్టు మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజువర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన తెలిపారు. చర్ల ఏఎస్సై, స్పెషల్‌పార్టీ, 141సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ సంయుక్తంగా ఆర్.కొత్తగూడెం, కుర్నపల్లి రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడన్నారు.

03/14/2019 - 10:10

సనత్‌నగర్, మార్చి 13: సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్‌బీఐ క్వార్టర్స్ వద్ద బుధవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. బీరు సీసా చేతపట్టుకొని అటుగా వెళుతున్న వారిపై దాడికి యత్నించాడు. నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడి వెంటపడి భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

03/13/2019 - 23:41

మల్దకల్, మార్చి 13: ఏసీబీ అధికారులు మల్దకల్ తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్‌ఏ చెన్నయ్య రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి విదితమే. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో హైదరాబాద్ ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్, నల్గొండ డిఎస్పీ ఆనంద్‌కుమార్, మహబూబ్‌నగర్ డిఎస్పీ కృష్ణగౌడుల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.

03/13/2019 - 23:31

సీలేరు, మార్చి 13: మావోయిస్టులు - పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. సంఘటనా స్థలంలో లభించిన భారీ ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

03/13/2019 - 23:08

డోన్, మార్చి 13: ఓల్వో బస్సులో తరలిస్తున్న బంగారం, నగదును కర్నూలు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపధ్యంలో డోన్ పట్టణ శివారులో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓల్వో బస్‌ను పోలీసులు తనిఖీ చేశారు. బస్సులో ఉన్న రెండు బ్యాగుల్లో తనిఖీ చేయగా అందులో రూ.88.20 లక్షల నగదు, 1.210 కిలోల బంగారు నగలు లభించాయి.

03/13/2019 - 22:56

హైదరాబాద్, మార్చి 13: విద్యాసంస్థలనే టార్గెట్‌గా చేసుకుని మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిందితుల నుంచి కొకైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ దాదాపు కోట్ల రూపాయలు ఉంటుందన్నారు.

03/13/2019 - 21:59

న్యూఢిల్లీ, మార్చి 13: కరడుకట్టిన ఉగ్రవాది, హంతకుడు, దోపిడీదారుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత ఖలిస్థాన్ కమాండో ఫోర్సు ఉగ్రవాది, 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో భారత్ ఆర్మీ దళాల చేతిలో హతమైన జర్నైల్ సింగ్ బింద్రేవాలే అనుచరుడిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

03/13/2019 - 04:41

గాంధారి, మార్చి 12: పశువుల కోసం పచ్చిగడ్డిని కోసుకుని తిరిగి వస్తుండగా పచ్చిగడ్డి మోపు 11 కేవి విద్యుత్ తీగలకు తగలడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో సోమవారం సాయంత్రం జరుగగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఎస్‌ఐ సత్యనారాయణ, తండావాసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.

Pages