S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/05/2019 - 00:29

రాంచి, జనవరి 4: కోట్ల రూపాయల దాణా కుంభకోణానికి సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన తీర్పును ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం రిజర్వ్‌లో పెట్టింది. కేసుకు సంబంధించి సీబీఐ, పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తన తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.

01/05/2019 - 00:23

నల్లగొండ, జనవరి 4: గ్యాంగ్‌స్టర్ నరుూం బతికున్న కాలంలో బెదిరింపులు, హత్యాకాండతో సంపాదించిన ఆస్తుల కేసు విచారణ పూర్తి చేసిన ఆదాయ పన్ను శాఖ వాటి అటాచ్‌మెంట్ దిశగా రంగం సిద్ధం చేస్తోంది. ఐటీ విచారణలో నరుూం ఆస్తులన్నీ బినామీల మీద ఉన్నట్లుగా గుర్తించిన ఐటీ శాఖ బినామీ ప్రాపర్టీస్ ప్రొబిషనరీ యూనిట్ కింద ఆస్తుల అటాచ్‌మెంట్ చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

01/04/2019 - 23:33

విజయవాడ జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

01/04/2019 - 23:28

న్యూఢిల్లీ, జనవరి 4: అయోధ్య రామమందిర భూమి వివాదంపై ఈ నెల 10వ తేదీన ధర్మాసనం ఏర్పాటుపై సముచిత నిర్ణయం వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ధర్మాసనం ఈ వివాదాన్ని విచారిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అన్నారు. ఈ కేసును ఎప్పుడు విచారించే విషయమై కొత్త ధర్మాసనం తేదీలను ఖరారు చేస్తుందన్నారు.

01/04/2019 - 23:03

న్యూఢిల్లీ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో ఎన్‌జీటీ అమరావతి నిర్మాణం, పర్యావరణ అనుమతులపై ఆదేశాలు ఇచ్చింది. దీన్ని మాజీ ఐఏఎస్ అధికారి ఈఎన్‌ఎస్ శర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

01/04/2019 - 23:03

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆస్తులకు సంబంధించిన విచారణ చేస్తున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు.రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశారు.

01/04/2019 - 04:31

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 3: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

01/11/2019 - 03:45

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈనెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ కోర్టుకు సెలవులని రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. సెలవుల సమయంలో హైకోర్టు ముఖ్యమైన కేసులను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్‌లు పని చేస్తాయి. న్యాయమూర్తులు ఎస్ అక్తర్, పీ కేశవరావు విధుల్లో ఉంటారని తెలిపారు.

01/04/2019 - 03:41

సంగారెడ్డి, జనవరి 3: యాజమాన్యం నిర్లక్ష్యం, లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రతల కారణంగా యువకుడి విలువైన ప్రాణం గాల్లో కలిసిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ఫ్లాజా వద్ద గురువారం తెల్లవారు జామున 4 గంటలకు చోటు చేసుకుంది.

01/04/2019 - 03:35

సంగారెడ్డి టౌన్, జనవరి 3: వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సంగారెడ్డి పట్టణ సీఐ వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Pages