S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/09/2019 - 01:12

యాచారం, జనవరి 8: విద్యుదాఘాతానికి గురై దినసరి గృహనిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి పోలీసులు, మృతుని కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన నారాయణ (59) మండల కేంద్రానికి వెళ్ళి గృహనిర్మాణంలో దినసరి కార్మికునిగా పనిచేస్తున్నాడు.

01/09/2019 - 01:11

కేశంపేట, జనవరి 8: గొడ్డలితో యువకుడిపై వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని వ్యవసాయ పొలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేశంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... కాకునూరు గ్రామానికి చెందిన టేకుల కృష్ణ అనే యువకుడి వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన కరికే నర్సింలు అనే వ్యక్తి గొర్రెలు మెపుతున్నాడు. విషయాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

01/09/2019 - 01:05

వనస్థలిపురం, జనవరి 8: గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు వేసిఉన్న రెండు ఇళ్లల్లో పట్టపగలే తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడి పోలీసులకు మరోసారి సవాల్ విసిరారు. ఇంటి తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు లక్షల రూపాయలు చోరీ చేసిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

01/09/2019 - 01:04

యాచారం, జనవరి 8: మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా, కఠిన చట్టాలను రూపొందిస్తున్నా మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నాయి. అభంశుభం తెలియని ఓ బాలికపై ఇద్దరు యువకులు అతిపాశవికంగా అత్యాచారానికి పాల్పడిన అమానుషమైన సంఘటన మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడకొండలో తీవ్ర కలకలం రేపింది.

01/09/2019 - 01:02

ఆమనగల్లు, జనవరి 8: కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామ శివారులో గల కాంటినెంటల్ మైన్స్ అండ్ మినరల్స్ కంపెనీలో మంగళవారం కడ్తాల ఎస్‌ఐ సుందరయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పరిమితికి మించి నిల్వచేసిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు.

01/09/2019 - 00:43

న్యూఢిల్లీ, జనవరి 8: అయోధ్య రామజన్మభూమి వివాదం కేసును ఈ నెల 10వ తేదీ నుంచి విచారిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ప్రకటించారు.

01/08/2019 - 23:55

కొమరాడ, జనవరి 8: మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొన్న సంఘటనలో వృద్ధుడు మృతిచెందాడని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. ఈమేరకు ఆయన అందించిన వివరాల ప్రకారం కల్లికోట గ్రామానికి చెందిన ఎం వ్యాపారనాయుడు(66)ను స్కూల్ పిల్లలను తీసుకువెళ్లేందుకు వచ్చిన బస్సు బ్యాక్ చేస్తుండగా ఢీకొనడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

01/08/2019 - 23:46

బుట్టాయగూడెం, జనవరి 8: స్థానిక శ్రీదేవి రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి బి.అచ్యుతరావు అదేశాల మేరకు మంగళవారం జరిగిన ఈ దాడుల్లో మిల్లులో రిజిస్టర్‌లకు, నిల్వలకు తేడాలున్నట్టు కనుగొన్నట్లు విజిలెన్స్ సీఐ ఎన్‌వి భాస్కరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

01/08/2019 - 22:34

నెల్లూరు, జనవరి 8: గత కొంత కాలంగా పోలీసులకు కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న 10 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను నెల్లూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1.70కోట్ల విలువ చేసే 1.66టన్నుల ఎర్రచందనం దుంగలను, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

01/08/2019 - 22:28

కొణిజర్ల, జనవరి 8: టాటా ఏస్ ట్రాలీ వాహనం లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మండల పరిధిలోని తనికెళ్ళ సమీపంలో రాష్టయ్ర ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఎల్లయ్య, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ప్రమాద సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Pages