S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/10/2019 - 00:55

న్యూఢిల్లీ: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గింపుపై బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు ఆర్డినెన్స్‌పై స్టే విధించలేమని హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

01/09/2019 - 04:18

బిట్రగుంట, జనవరి 8: నెల్లూరు జిల్లా బోగోలు మండలం ముంగమూరు క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 21 మంది గాయపడ్డారు.

01/09/2019 - 04:11

నవీపేట, జనవరి 8: తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా, మానసిక వికలాంగుడైన కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని ఓ తల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పదేళ్ల కుమారుడితో పాటు ఆ తల్లి కూడా రైలు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

01/09/2019 - 04:10

సిరిసిల్ల, జనవరి 8: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్‌రావుపల్లె గ్రామంలో అప్పుల బాధతో పంకరి మల్లయ్య (62) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శ్మశానవాటికలోని షెడ్డులో మల్లయ్య ఉరి వేసుకుని మృతి చెందగా, మంగళవారం ఉదయం ఆయన మృతదేహంను కనుగొన్నారు. సోమవారం రాత్రి ఇంటిలో అందరు నిద్రించాక, మల్లయ్య ఇంటి బయట ప్రధాన ద్వారంకు గడియ పెట్టి వెళ్ళిపోయాడు.

01/09/2019 - 03:51

గచ్చిబౌలి, జనవరి 8: ఒక్క రూపాయి సొంత డబ్బు లేకుండా కోట్లు సంపాదించవచ్చు.. నీ దగ్గర డబ్బులేక పోతే బ్యాంకులో అప్పు తీసుకుని మా సంస్థలో పెట్టుబడి పెట్టు .. బ్యాంకు రుణం మేమే ఇప్పిస్తాం.. సంవత్సరంలో కోట్లు సంపాదించవచ్చు అంటూ నిరుద్యోగ యువతకు ఆశలురేపి మోసం చేస్తున్న క్యూ నెట్ గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు.

01/09/2019 - 02:15

న్యూఢిల్లీ, జనవరి 8: కేంద్రం ఆదేశంపై సెలవుపై వెళ్లిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఆ పదవిలో మళ్లీ నియమిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. కాని అలోక్‌వర్మ పరిపాలనాపరంగా ఎటువంటి అధికారాలను చలాయించేందుకు వీలు లేదని షరతును విధించింది.

01/09/2019 - 01:15

హైదరాబాద్, జనవరి 8: బస్టాప్‌లో ఓ వ్యక్తి జేబులోంచి సెల్‌ఫోన్‌ను చోరీ చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు రెంజ్‌కు చెందిన రిటైర్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, అనంతపురం జిల్లా విద్యుత్‌నగర్‌కు చెందిన మహబుబ్ పీరా మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో హమయత్‌సాగర్ వైపు వెళ్లేందుకు లకిడీకపూల్ బస్టాప్‌లో నిలుచున్నాడు.

01/09/2019 - 01:15

మెహిదీపట్నం, జనవరి 8: రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. పశ్చి మ మండల పరిధిలోని జియాగూడలో రెండుచోట్ల దుకాణ సముదాయాల షట్టర్ల తాళాలు పగులగొట్టడం తో స్థానికులు ఆప్రమత్తత అవడంతో దొంగలు పారిపోయారు. ప్రధాన రహదారిలోనే ఈ రకంగా ఉంటే ఇక గల్లీలో, కాలనీల్లో ఎలా ఉంటుందో అని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే...

01/09/2019 - 01:14

ఘట్‌కేసర్, జనవరి 8: గుర్తు తెలియని పురుగుల తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుస్టేషన్ పరిధి అంకుషాపూర్ గ్రామంలోని ఫౌల్ట్రీ ఫామ్‌లో కూలీగా పని చేస్తున్న ఆర్. సామ్యెల్ (22) మంగళవారం గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోగా గమనించిన తోటి కార్మికులు ఘట్‌కేసర్‌లోని ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు.

01/09/2019 - 01:14

గచ్చిబౌలి, జనవరి 8: యూనివర్సిటీలో దళితులకు వ్యతిరేకం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ వైస్ చాన్సిలర్ వ్యవహరిస్తున్నారని వీసీపై విచారణ చేసి చర్య తీసుకోవాలని విద్యార్దులు గచ్చిబౌలి పోలీసులకు ఫీర్యాదు చేశారు. వెలివాడలో ఉన్న జ్యోతిరావు పూలే, అంబేద్కర్ దళిత నేతల చిత్ర పటాలను తీసివేసి దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కోన్నారు.

Pages