S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/07/2019 - 22:02

దత్తిరాజేరు, జనవరి 7: మండలంలో ఎస్. బూర్జివలస గ్రామ సమీపాన జాతీయ రహదారిపై ముందు వెళుతున్న మోటారుసైకిల్‌ను వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టడంతో మోటారు సైకిల్ బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని మరడాం గ్రామానికి చెందిన కాసా శ్రీనివాసరావుఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు.

01/07/2019 - 03:59

జగ్గయ్యపేట రూరల్, జనవరి 6: విజయవాడ- హైదరాబాద్ జాతీయరహదారిపై బలుసుపాడు వై జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలైయ్యాయి.

01/07/2019 - 03:43

వనస్థలిపురం, జనవరి 6: ఐటీ కంపెనీలో క్యాటరింగ్ ఈవెంట్ ప్రోగ్రాం పేరుతో భారీగా లాభాలు వస్తాయని చెప్పి 40 మంది దగ్గర సూమారు రూ.4 కోట్లు మోసానికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఏ.వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు.. సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో నివాసం ఉంటున్న కొమ్ము సురేష్, బియ్యం వ్యాపారి. అతని భార్య అన్నపూర్ణ బీపీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

01/07/2019 - 02:58

బనగానపల్లె, జనవరి 6 : ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందిన సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రం సమీపంలో చోటుచేసుకుంది. కర్నూలు ఒమేగా వైద్యశాలలో పనిచేస్తున్న తాండ్రపాడుకు చెందిన సుమన్(23), కర్నూలుకు చెందిన కుమారి(20), శిరీష(21) పల్సర్ బైక్‌పై యాగంటికి వచ్చారు.

01/07/2019 - 02:20

కాకినాడ రూరల్, జనవరి 6: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ 36వ డివిజన్ కార్పొరేటర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి పార్టీ నాయకులతో కలిసి పోలీసు స్టేషనుకు వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.

01/07/2019 - 00:44

చెన్నై/నర్సాపూర్, జనవరి 6: తమిళనాడు రాష్ట్రంలోని పుదుకొటై సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన 11మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. నర్సాపూర్ మండలంలోని ఖాజీపేట గ్రామానికి చెందిన నాగరాజుగౌడ్ (35) గురుస్వామి ఆధ్వర్యంలో 14మంది భక్తులు శబరిమలకు వెళ్లారు.

01/06/2019 - 04:07

నల్లగొండ రూరల్, జనవరి 5: అప్పాజిపేట గ్రామానికి చెం దిన కుమారుడు, అతని తల్లి మృతి చెందడంతో గ్రామంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మర్రి ప్రకాష్ (32) అవివాహితుడు శనివారం ఉదయం నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం వద్ద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ సమీపంలో 62వ మైలు రాయివద్ద రైలు కింద పడి మరణించాడు. ఇతని మృత్యు వార్త తెలియగానే తల్లి భానుమతి(60) మృతి చెందింది.

01/06/2019 - 02:21

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్ చెక్కేసిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను ‘పరారైన ఆర్థిక నేరస్తుడి’గా ఢిల్లీ కోర్టు శనివారం ప్రకటించింది. మనీ లాండరింగ్ సహా అనేక కేసుల్లో ఉన్న మాల్యా ఆస్తులను కోర్టు ఇంతకు ముందే జప్తు చేసింది. ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలన్న మాల్యా అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

01/06/2019 - 02:12

న్యూఢిల్లీ, జనవరి 5: అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోళ్ల కేసులో నిందితుడైన మిచిల్ క్రిస్టియన్ ఇతర రక్షణ కొనుగోళ్ల కేసులో కూడా ముడుపులు స్వీకరించాడని, ఈ అభియోగాలపై దర్యాప్తు చేయాల్సి ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులోనిందితుడు మిచిల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

01/05/2019 - 00:30

న్యూఢిల్లీ, జనవరి 4: గత ఐదు సంవత్సరాలుగా 27 మంది పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నేరగాళ్లు దేశాన్ని వదలి పారిపోయారని శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర సహాయమంత్రి వెల్లడించారు. వీరిలో 20మందికి రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు తమ ప్రభుత్వం ఇంటర్ పోల్‌ను ఆశ్రయించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా రాతపూర్వకంగా సభకు తెలియజేశారు.

Pages