S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/28/2018 - 22:15

లేపాక్షి, మార్చి 28 : మండల పరిధిలోని కంచిసముద్రంలో సరస్వతమ్మ (42) తలనొప్పి తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఎస్సై రామూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు సరస్వతమ్మ చాలాకాలంగా తలనొప్పితో బాధ పడుతుండేది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అధిక తలనొప్పి రావడంతో ఇంట్లో ఉన్న కాలం చెల్లిన వివిధ రకాల మాత్రలు మింగి స్పృహ తప్పి పడిపోయింది.

03/28/2018 - 04:37

కరీంనగర్, మార్చి 27: మాజీ ఎఎస్‌ఐ మోహన్ రెడ్డి ఎస్కార్ట్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఎం.కుమార స్వామి, ఎన్.శ్రీనివాసాచారిలను సస్పెండ్ చేస్తూ మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏఆర్ ఎస్‌ఐపై చర్యల కోసం కరీంనగర్ రేంజ్ డీఐజీకి ప్రతిపాదనలు పంపినట్లు సీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.

03/28/2018 - 03:10

తిరుపతి, మార్చి 27: తిరుపతిలో వృద్ధులను, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఎంపిక చేసుకుని వారికి ఆయుర్వేద మందుల పేరుతో నకిలీ మందులు అంటగట్టి, లక్షల్లో మోసం చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

03/28/2018 - 02:45

సికిందరాబాద్, మార్చి 27: అనుమానాస్పద స్థితిలో తుపాకీ పేలడంతో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలైన సంఘటన గాంధీ ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... గాంధీ ఆసుపత్రి ఖైదీల వార్డు వద్ద ఖైరతాబాద్ నివాసి, సీఏఆర్ హెడ్ క్వార్టర్‌కు చెందిన కానిస్టేబుల్ సాయినాథ్ (32) భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్నాడు.

03/28/2018 - 02:38

అనకాపల్లి రూరల్, మార్చి 27: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఎదురుగా వస్తున్న బ్రాండిక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన మండలంలోని తుమ్మపాల ఏలేరు కాలువ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తుమ్మపాలకు చెందిన బుద్ద మోహన్ (20) అక్కడికక్కడే మృతిచెందగా ఇదే సంఘటనలో తీవ్రంగా గాయపడిన దాడి వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

03/28/2018 - 01:56

హైదరాబాద్, మార్చి 27: హైదరాబాద్ నగరంలో రోహింగ్యా ముస్లింలకు ఏర్పాటుచేసిన కనీస వౌలిక సదుపాయాలపై కౌంట ర్ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వా రాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. శరణార్థుల హక్కుల మండలి అధ్యక్షుడు పి. నారాయణ స్వామి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

03/28/2018 - 01:14

న్యూఢిల్లీ, మార్చి 27 : ఆధార్‌తో వివిధ సంక్షేమ పథకాలను అనుసంధానించే గడువును పెంచుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానానికి తుది గడువు మార్చి 31. కాగా ఆధార్‌కు బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్ల అనుసంధానాన్ని నిరవధికంగా పొడిగిస్తూ మార్చి 13న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

03/28/2018 - 00:51

తిరుపతి, మార్చి 27: తిరుపతిలో వృద్ధులను, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఎంపిక చేసుకుని వారికి ఆయుర్వేద మందుల పేరుతో నకిలీ మందులు అంటగట్టి, లక్షల్లో మోసం చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

03/28/2018 - 00:10

మిర్యాలగూడ టౌన్, మార్చి 27: మిర్యాలగూడ టూటౌన్, మాడ్గులపల్లి పోలీసులు దాడులు నిర్వహించి సుమారు రూ.4.46 లక్షల విలువైన గుట్కా పాకెట్లను, కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారని స్థానిక డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు.

03/28/2018 - 00:08

నార్కట్‌పల్లి, మార్చి 27: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్‌పల్లి నుంచి నెమ్మాని గ్రామానికి వెళ్తున్న దొడ్డి రాములు(35), రూపాని అనిదీప్(25)లు వేర్వేరు బైక్‌లపై వెళ్తుండగా నెమ్మాని శివారులో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొనడంతో గాయాల పాలయ్యారు.

Pages