S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/26/2018 - 23:26

వైరా, మార్చి 26: మండలపరిధిలోని స్టేజి పినపాక గ్రామంలో సోమవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు తుమ్మలపల్లి సత్యనారాయణ శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం చూసేందుకు వెళ్ళిన క్రమంలో దొంగలు ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లో రూ. 40వేల నగదు, 3 తులాల బంగారం అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు. పట్టపగలే దొంగతనం జరగడంతో చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

03/26/2018 - 00:10

హైదరాబాద్, మార్చి 25: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కనీస వేతన చట్టాలను అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో రెండు వేర్వేరు పిల్‌లు దాఖలయ్యాయి. తెలంగాణ రీజనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్యదర్శి పి జీవన్ రావు, ఏపి స్టేట్ మల్టిపుల్ కాంట్రాక్టర్స్ లేబర్ యూనియర్ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు ఈ పిల్స్‌ను దాఖలు చేశారు.

03/26/2018 - 00:09

హైదరాబాద్, మార్చి 25: పీజీ మెడికల్ కోర్సుల్లో సర్వీసు కోటాను ఉపసంహరించుకుని, వెయిటేజి మార్కులను ప్రవేశపెట్టడాన్ని ప్రశ్నిస్తూ డాక్టర్ ఎం వసుచరణ్ రెడ్డి మరో 12మంది అభ్యర్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 21,22 జీవోలను రద్దు చే యాలని వారు కోరారు.

03/26/2018 - 00:03

విజయనగరం, మార్చి 25: ప్రశాంతమైన విజయనగరంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులు చోటుచేసుకోవడం సంచలనమైంది. శనివారం అర్ధరాత్రి రియాల్టర్ నమ్మి అప్పలరాజుపై మరో రియల్టర్ బొత్స మోహన్ కాల్పులు జరిపాడు. వరుసగా ఆరు రౌండ్లు కాల్చడంతో అప్పలరాజు కిందపడిపోయాడు. ఇక్కడి ఎల్‌ఐసీ భవన్‌కు సమీపంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద ఈ సంఘటన జరిగింది.

03/25/2018 - 23:56

నారాయణపేట టౌన్, మార్చి 25: నారాయణపేట మండలం అభంగాపూర్ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా రెండు వర్గాలకు చెందిన 40మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 14మందిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/25/2018 - 23:37

పాల్వంచ, మార్చి 25: ఒక ప్రైవేట్ బస్సులో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను, 30 కేజీల గంజాయిని ఆదివారం పాల్వంచ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను ఎక్సైజ్ డిఎస్‌పి సి నర్సింహారెడ్డి సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల తెలిపారు. నిందితులను హాజరుపరిచి వివరాలను వెల్లడించారు.

03/25/2018 - 22:47

తిరుపతి, మార్చి 25: తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ వద్ద పూతలపట్టు-నాయుడు జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం 6గంటల సమయంలో తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి తిరుపతికి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొని 20 అడుగుల గుంతలోకి బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ అరుణాచలంతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న సుందరరాజు అక్కడికక్కడే మరిణించారు.

03/25/2018 - 22:45

తిరుపతి, మార్చి 25: పాతకాల్వ వద్ద ఉన్న వకుళా ఆలయం వద్ద ఉన్న నీటిగుంటలో శనివారం కనిపించకుండా పోయిన 7వ తరగతి విద్యార్థి మోహన్ శవమై ఆదివారం తేలాడు. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐ రాజు, కానిస్టేబుల్ పురంధర్‌లు విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు.

03/25/2018 - 22:40

అద్దంకి, మార్చి 25: అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్టర్రహదారిపై మండలంలోని చక్రాయపాలెం వద్ద రోడ్డు డివైడర్‌కు కారు ఢీకొని కారు బోల్తాపడిన ఘటనలో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన అద్దంకి విజయభాస్కర్(17) మృతి చెందగా, భీమవరం గ్రామానికి చెందిన నల్లమోతు రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదం ఘటన సమాచారం తెలుసుకున్న 108 వాహనం వారు, వారిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

03/25/2018 - 22:20

యాడికి, మార్చి 25 : మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు నీటి కొళాయి గుంతలో పడి హేమలత (50) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు హేమలత యాడికి ఉన్నత పాఠశాలలో ల్యాబ్ సహాయకురాలిగా పని చేస్తోంది.

Pages