S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/24/2018 - 22:32

అనంతపురం అర్బన్, మార్చి 24: ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, రద్దీ ప్రాంతాలు, ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలించే నలుగురు సభ్యులు గల అంతర్ జిల్లా ముఠాతోపాటు మరో ఇద్దరు రిసీవర్ల అంతర్ జిల్లా దొంగల ముఠాను మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 84 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు.

03/24/2018 - 22:27

రాయదుర్గం రూరల్, మార్చి 24 : మండల పరిధిలోని కెంచానపల్లి గ్రామానికి చెందిన మాణిక్యరాజు (18) శనివారం పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కెంచానపల్లికి చెందిన రామాంజనేయులు, వరలక్ష్మి కుమారుడు మాణిక్యరాజు ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో లోన్ ద్వారా ఆటో తీసుకుని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆటో ద్వారా వచ్చిన సంపాదనను రోజూ తల్లికి ఇచ్చేవాడు.

03/24/2018 - 03:44

ఎల్లారెడ్డిపేట, మార్చి 23: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ బస్టాండు ప్రాంతంలో కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని శుక్రవారం ఇసుక లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పదిర గ్రామానికి చెందిన రైతు గోపన్నగారి లస్మయ్య(54) దుర్మరణం పాలయ్యాడు. అతని భార్య రేణుక తీవ్ర గాయాలకు గురైంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు.

03/24/2018 - 03:42

సిరిసిల్ల, మార్చి 23: నకిలీ విత్తనాలను విక్రయిస్తూ అమాయక రైతులను మోసగిస్తూ సులభతరంగా డబ్బు సంపాదిస్తున్న నిందితుడిని సిరిసిల్ల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాల ఏజెంట్ కోట శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, అతడి నుండి రూ.2.60,000 విలువ గల 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

03/24/2018 - 03:40

కరీంనగర్ (లీగల్), మార్చి 23: రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేపడుతూనే అవినీతికి పాల్పడుతూ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ రెవెన్యూ అధికారి రాజయ్యకు సంవత్సరం జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు శుక్రవారం తీర్పు చెప్పారు.

03/24/2018 - 03:26

మహదేవ్‌పూర్, మార్చి 23: లారీలో అక్రమంగా తరలిస్తున్న టేక కలపను అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని బండారిగూడెం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పలిమెల మండలంలోని బండారిగూడెం మీదుగా లారీలో టేకు కలప అక్రమంగా రవాణ అవుతుందనే సమాచారం మేరకు మాటు వేసినట్లు తెలిపారు.

03/24/2018 - 03:13

శంషాబాద్ , మార్చి 23 విమానంలోని సీటు కింద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఎయిరిండియా 952 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానాస్పదంగా గుర్తించిన అధికారులు అతడిని క్షుణంగా తనిఖీ చేశారు. అతడు తను దుబాయి నుంచి తీసుకువచ్చిన 1.22కేజీల బంగారాన్ని విమానంలో తాను కూర్చున్న సీటు కింద దాచి పెట్టిన్నట్లు కస్టమ్స్ అధికారులకు తెలిపాడు.

03/24/2018 - 03:12

మేడ్చల్, మార్చి 23: అవమానభారాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని రాజబొల్లారం అనుబంధ గ్రామమైన అక్బర్జాపేట్‌కు చెందిన కోటగిరి శిరీష ఈనెల 20వ తేదీన తన స్నేహితురాలు సంగీతతో కలిసి సిద్ధిపేట్ జిల్లా ములుగు మండలం వంటిమామిడి గ్రామంలోని ఆసుపత్రికి వెళ్లింది.

03/24/2018 - 03:11

కేశంపేట, మార్చి 23: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. కేశంపేట ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం మార్చి 19న కొత్తపేట గ్రామానికి చెందిన రాణి (32), భర్త రమేష్ ద్విచక్ర వాహనంపై రావిచేడ్ గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో రాణి కిందపడడంతో తీవ్రంగా గాయపడింది.

03/24/2018 - 02:04

న్యూఢిల్లీ, మార్చి 23: లోకాయుక్తలను ఎందుకు నియమించలేదంటూ పనె్నండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సుప్రీం కోర్టు శుక్రవారం నిలదీసింది. ఈ జాప్యాని కి కారణాలను వివరించాలని న్యాయమూర్తులు రంజన్ గగోయ్, ఆర్ భానుమతిలతో కూడిన సుప్రీం కోర్టు బెం చ్ వారిని ప్రశ్నించింది. తమ రాష్ట్రంలో లోకాయుక్త స్థితిగతులను వివరించాలని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ కోరింది.

Pages