S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/02/2018 - 20:30

గరుడవేగ హిట్టుతో ఫాంలోకి వచ్చిన యాంగ్రీ హీరో రాజశేఖర్ చేస్తున్న తదుపరి చిత్రం -కల్కి. దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ ప్రాజెక్టులోకి తాజాగా ఆదా శర్మ చేరింది. హీరో రాజశేఖర్ సరసన ముఖ్య పాత్ర చేస్తున్నట్టు తాజాగా ట్వీట్ చేసింది. 2008లో వచ్చిన 1920 పీరియడ్ ఫిల్మ్ చేసిన ఆదా, తరువాత అవకాశాల లేక స్క్రీన్‌కు దూరమైంది.

11/02/2018 - 20:29

సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్‌కుమార్, మిస్టి చక్రవర్తి జంటగా ఎకెయస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎన్.నరసింహారావు దర్శకత్వంలో అశ్వినికుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం ‘శరభ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నవంబర్ 15న విడుదలకు సిద్ధమైంది.

11/02/2018 - 20:27

క్రాంతి, పృధ్వీ, అవంతిక హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఎటువైపో నీ పరుగు’. మద్దినేని రమేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని వి అలేఖ్య, పి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రం ప్రారంభమైంది. హీరో హీరోయిన్లు ముగ్గురిపై తీసిన తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్‌కొట్టగా, దామోదరప్రసాద్, శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

11/01/2018 - 20:40

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి షూటింగ్ గత కొద్దిరోజులుగా యుఎస్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ తుది దశకు చేరింది. నవంబర్ మొదటివారంలో చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగి వస్తుందట. సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా రూపొందించిన ప్రత్యేకమైన సెట్‌లో షెడ్యూల్ జరగనుందట.

11/01/2018 - 20:39

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాతి చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే బన్నీ కోసం త్రివిక్రమ్ గతంలోనే ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ స్క్రిప్ట్‌పైనే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందట. డిసెంబర్ 11న ఆ చిత్రం అధికారికంగా లాంచ్‌కానుంది.

11/01/2018 - 20:38

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన పంజాబీ బ్యూటీ పాయల్‌రాజ్‌పుత్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. తాజాగా ఆమె మరో చిత్రానికి సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటించనున్న చిత్రంలో పాయల్ హీరోయిన్‌గా ఎంపికైంది.

11/01/2018 - 20:36

సినీ వారసత్వం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మొదటి నుంచీ తనదైన ఇమేజ్‌తో ముందకు సాగుతున్నాడు. వైవిధ్యమైన కథల ఎంపిక నుంచి ఆన్‌స్క్రీన్‌పై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మాస్, యాక్షన్, క్లాసిక్.. ఇలా అన్నితరహా కథల్లో నటిస్తున్న తేజు ప్రేమమ్‌తో మంచి విజయాన్ని అందుకున్నాడు. తరువాత చందు మొండేటితో సవ్యసాచి సినిమా చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్.

11/01/2018 - 20:33

సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ‘రోబో’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే కాంబోను రిపీట్ చేస్తూ సీక్వెల్‌గా తెస్తున్న త్రీడీ చిత్రమే 2.0. శంకర్ చెక్కుతున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషనే్స ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారతీయ తలమానిక చిత్రంలా.. 550 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా రూపుదిద్దుకుంటోంది.

11/01/2018 - 20:31

చందమామ ముఖంలో ముఖం పెట్టి చూశాడట బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్. కింగ్‌ఖాన్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం జీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఖాన్ -ఇద్దరు భామల కత్రినా కైఫ్, అనుష్క శర్మలతో కనిపించనున్నాడు. వాళ్లిద్దర్నీ ఫస్ట్‌లుక్ పరిచయం చేస్తూ సినిమాకు సంబంధించిన రెండు పోస్టర్లను ట్విట్టర్‌లో విడుదల చేశాడు షారుక్. ‘తారలను దగ్గర్నుంచి చూడాలన్నది చాలామంది కల.

11/01/2018 - 20:30

ప్రపంచ సినిమా ముందు భారతీయ సినిమాకు ఇంకా గుర్తింపు మిగిలివుందీ అంటే -పాతతరం దిగ్గజ దర్శకులు రూపొందించి పదిలపర్చిన ఆణిముత్యాలే కారణం. 1955లో సత్యజిత్ రే రూపొందించిన ‘పథేర్ పాంచాలి’ చిత్రం -ఇప్పటికీ భారతీయ సినిమా ప్రమాణాల ప్రామాణికత, ప్రాముఖ్యతను నిలబెడుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ వంద విదేశీ చిత్రాల్లో ‘పథేర్ పాంచాలి’కి పదిహేనొవ స్థానం దక్కింది.

Pages