S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/30/2018 - 19:54

ఇటీవలే తెలుగులో విడుదలైన ఆర్‌ఎక్స్ 100 సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ నెగెటివ్ షేడ్‌లో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటనతోపాటు గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు వస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

10/30/2018 - 19:53

భద్ర, సింహలాంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ, మిర్చితో దర్శకుడిగా మారాడు. తర్వాత శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస హిట్లుతో అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్లు, టాప్ హీరోలు కొరటాల కోసం క్యూకట్టే పరిస్థితి ఉంది. అయితే, కొరటాల చిరంజీవితో సినిమా చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

10/30/2018 - 19:51

పిఎస్‌వి గరుడవేగతో సక్సెస్ అందుకున్న రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న మరో యాక్షన్ మూవీ -కల్కి. గరుడవేగ సంచలన విజయంతో రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

10/30/2018 - 19:49

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. ‘పలాస 1978’ పేరిట కరుణకుమార్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, వినె్సంట్ అరుల్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ యదార్థ సంఘటనల ఆధారంగా ‘పలాస 1978’ చిత్రాన్ని తెరమీదకు తెస్తున్నామన్నారు.

10/30/2018 - 19:48

ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనదైన బ్రాండ్ మార్క్‌తో దూసుకుపోతున్న బ్యానర్ మైత్రీ మూవీస్. స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు నిర్మిస్తూ సంచలన విజయాలను నమోదు చేస్తున్నారు. బ్యానర్‌కు తగ్గట్టుగానే ముగ్గురు నిర్మాతల మైత్రి బంధం టాలీవుడ్‌లో మెగా బ్రాండ్‌ను క్రియేట్ చేసింది.

10/30/2018 - 19:46

కోలీవుడ్‌లో అందరూ ఫైర్‌బ్రాండ్ అనీ పిలిచే హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది వరలక్ష్మి. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, హీరోయిన్‌గానే కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటీవలే పందెంకోడి 2 చిత్రంలో నెగెటివ్ షేడ్‌లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో నటించింది.

10/30/2018 - 19:44

శృంగార తార షకీల. 90లలో యూత్‌ను పిచ్చెక్కించిన స్టార్. షకీలా సినిమా వస్తుందంటే? స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా పడిన సందర్భాలు లేకపోలేదు. ముఖ్యంగా కన్నడ, తెలుగు, మలయాళం భాషల్లో షకీలా సినిమాలకు పిచ్చి గిరాకీ. షకీలా సినిమా పోస్టర్ గోడమీద పడిందంటే చాలు యువతనుంచి పండుముసలి వరకూ థియేటర్‌వైపు సైకిళ్లు మళ్లించేవారు. షకీలా సినిమా తెలుగు డబ్బింగ్ టైటిల్స్ అంతే క్యాచీగా ఉండేవి.

10/29/2018 - 21:07

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బంపర్ ఆఫర్ కొట్టిందనే వార్త ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ అందుకున్న కాజల్, అటు స్టార్ హీరోలతోపాటు కుర్ర హీరోలకు జోడీకడుతూ కొత్త ట్రెండ్‌కు స్వీకారం చుడుతోంది. గత ఏడాది చిరంజీవితో ఖైది నెం 150లో నటించిన ఈమె, రామ్‌చరణ్‌తో నాలుగు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

10/29/2018 - 21:06

టాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న రాజవౌళి ట్రిపుల్ ఆర్ మల్టీస్టారర్ అనుకున్న సమయానికంటే ముందే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

10/29/2018 - 21:05

విభిన్నమైన సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్, తాజాగా నటిస్తున్న అంతరిక్షం చిత్రం షూటింగ్ పూర్తికావస్తోంది. డిసెంబర్‌లోనే విడుదలకు సిద్ధమైన ఈ సినిమా తరువాత మరో చిత్రానికి ఓకె చెప్పాడు. అయితే ఈ చిత్రానికి సాగర్‌చంద్ర దర్శకత్వం వహించనున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో దర్శకుడిగా మారిన ఇతను, వరుణ్‌తేజ్ కోసం నిజాం కాలంనాటి ప్రేమకథతో స్క్రిప్ట్ సిద్ధం చేశాడు.

Pages