S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/26/2018 - 19:32

ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోను, ఇటు మార్కెట్‌లోను క్యూరియాసిటీ సొంతం చేసుకుంది. తారలు, దర్శకుడు, నిర్మాతలు అంతా కొత్తవారే కావటం విశేషం. దర్శకుడిగా శరత్ నర్వాడే పరిచయమవుతున్న చిత్రాన్ని సి.విద్యాసాగర్, జనార్ధన్ ఆర్.ఆర్. నిర్మించారు. శ్రీనివాస్ సాయి, దీక్ష శర్మరైనా హీరో హీరోయిన్లు.

10/26/2018 - 19:31

శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై శివ, సోనాపటేల్ హీరో హీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం రూల్ (ది పవర్ ఆఫ్ పీపుల్స్). నవంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఆడియో బిగ్ సీడీని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు.

10/26/2018 - 19:30

తమిళ స్టార్ హీరో సూర్య 36వ చిత్రంగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్‌జికె అనే సినిమా చేస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమాలో సూర్య ఏ పాత్రలో కనిపించబోతున్నాడో అని తెలుసుకోవడానికి సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎట్టకేలకు ఈ చిల్రో సూర్య పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

10/26/2018 - 19:29

వైవిధ్యమైన కథలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పుడు రోషగాడుతో పోలీస్ పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు విజయ్. విజయ్‌తో నివేదా పేతురాజ్ జోడీ కట్టిన చిత్రానికి గణేశా దర్శకుడు. తాజాగా ‘రోషగాడు’ టీజర్‌ను విడుదల చేసి అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం.

10/26/2018 - 19:28

సీనియర్ హీరో అర్జున్‌పై లైంగిక అభియోగాలు చేసిన నటి శ్రుతిహరణ్ తన మాటకు కట్టుబడే ఉంటానంటోంది. తనపై అభియోగాలు మోపిన శ్రుతిపై ఇప్పటికే హీరో అర్జున్ దావా వేశారు. ‘నిబునన్’ షూటింగ్ టైంలో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడన్నది శ్రుతి అభియోగం. కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లో చర్చకు తెరలేపిన శ్రుతి వ్యాఖ్యలను కొందరు తప్పుబడితే, మరికొందరు మద్దతుగా నిలిచారు.

10/26/2018 - 19:27

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసింది అర్జున్ రెడ్డి చిత్రం. అటు తమిళంలోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ పాత్రను షాహిద్‌కపూర్ పోషిస్తున్నాడు. అతనితో కైరా అద్వానీ జోడీ కడుతోంది. హిందీ చిత్రానికీ సందీప్ వంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే మొదలైంది.

10/26/2018 - 19:26

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకరర్ దర్శకుడు. చిత్రంలో కార్తీ స్టైలిష్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. చేతిలో హెల్మెట్, వెనుక రేసింగ్ బైక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్, నిక్కీ గల్రాని హీరోయిన్లు. ఖాళీ తరువాత కార్తీ, రకుల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై పెద్ద అంచనాలున్నాయి.

10/25/2018 - 20:43

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి టైటిల్ దాదాపు కన్ఫ్‌ర్మ్ అయినట్టే. ఇప్పటికే జగదేకవీరుడు, ముఠామేస్ర్తీ, రౌడీ తమ్ముడు లాంటి టైటిల్స్ వినిపించాయి.. తాజాగా వినయ విధేయ రామ అనే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు హీరో, దర్శకులు. ఈ నేపథ్యంలో వినయ విధేయ రామ టైటిల్‌పై యూనిట్ ఆసక్తిగా ఉన్నారట.

10/25/2018 - 20:41

జనరల్‌గా సినిమావాళ్ళ జీవితాలు అంటే పబ్లిక్ ప్రాపర్టీ లాంటివి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి దాపరికాలు ఉండవు. ఒకవేళ దాపరికం మెయిన్‌టైన్ చేయాలన్న ఏదో ఓ సందర్భంగా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో గ్లామర్ భామ శ్రీయ మాత్రం సీరియస్‌గా ఉంది. ప్రొఫెషన్ లైఫ్ గురించి ఏదైనా మాట్లాడండి.. కానీ పర్సన్ లైఫ్ గురించి మీకు అవసరంలేదని కాస్త గట్టిగానే చెప్పింది.

10/25/2018 - 20:39

మాస్ రాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 29న టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మరో న్యూలుక్‌ను విడుదల చేశారు. రీ ఎంట్రీ ఇస్తోన్న ఇలియానా మరోసారి రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

Pages