S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/22/2017 - 21:14

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయింది. నిన్నటితో ఆ సినిమాను కంప్లీట్ చేసిన మహేష్.. నేటినుండి కొరటాల శివ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ షెడ్యూల్‌లో ఈ రోజునుండి మహేష్ పాల్గొంటున్నాడు. హైదరాబాద్ దగ్గరలో వేసిన భారీ అసెంబ్లీ సెట్‌లో మహేష్ అదరగొడుతున్నాడట. ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడని టాక్?

06/22/2017 - 21:10

‘అవతార్’.. హాలీవుడ్ సినిమా చరిత్రలో సంచలనం క్రియేట్ చేసిన సినిమా. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ పనులు మొదలయ్యాయి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు అద్భుత లోకాన్ని పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు జేమ్స్. అవతార్ రెండో సీరిస్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలిపాడు.

06/22/2017 - 21:08

హిందీలో సూపర్‌హిట్ అయిన జాలీ ఎల్‌ఎల్‌బి చిత్రానికి రీమేక్‌గా సప్తగిరి హీరోగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సప్తగిరి ఎల్‌ఎల్‌బి చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు.

06/22/2017 - 21:07

లేటెస్టుగా గోవా భామ ఇలియానా నటించిన హిందీ సినిమా ‘బాద్షాహూ’ టీజర్ విడుదలై సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఇలియానా అందాలు షాక్ ఇవ్వనున్నాయి. అజయ్‌దేవ్‌గన్ హీరోగా ఇమ్రాన్ షహ్మి, ఇషాగుప్త, విద్యుత్ జమాల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా 1975 కాలంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఓ యధార్థ కథతో తెరకెక్కించారు. సినిమాలో ఏం చెప్పబోతున్నారో టీజర్‌లో చూపించారు.

06/22/2017 - 21:03

పి.డి.రాజు, అభినయ, సాయికిరణ్, భానుచందర్ ముఖ్యపాత్రల్లో.. జె.జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం తొలికిరణం. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 28న విడుదలవుతున్నది.

06/22/2017 - 20:57

మెగాస్టార్ రీ ఎంట్రీ ‘ఖైది నెంబర్ 150’తో సంచలన విజయం అందుకున్నాడు మాస్ దర్శకుడు వినాయక్. ఈ సినిమా వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంకా వినాయక్ నెక్స్ట్ సినిమా ఏదీ కన్‌ఫర్మ్ కాలేదు. ఇటీవలే ఆయన పవన్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు గురించి.. ఎలాంటి క్లారిటీ రాలేదు.. కానీ వినాయక్ తదుపరి సినిమా మెగా హీరోతోనే కన్‌ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది?

06/22/2017 - 20:56

తెలుగు సినిమా స్థాయిని నలుదిశలా చాటిచెప్పిన బాహుబలి-2 చిత్రం సాధించిన విజయం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంకంటే బాహుబలి-2 ఘనవిజయం సాధించింది. ఇటీవలే 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుని 1700 కోట్ల వరకూ వసూలు చేసి ఎన్నో రికార్డులను సృష్టించింది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

06/22/2017 - 20:55

కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న గ్లామర్ భామ నయనతార. వరుసగా అటు యువ హీరోలు.. ఇటు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి జోరుమీదుంది. ఈ అమ్మడితో సినిమా తీయాలంటే దర్శక నిర్మాతలు క్యూకట్టాల్సిందే. ఎందుకంటే అంత బిజీగా ఉంది మరి. పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటుతున్నా కూడా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఈమెతోపాటు వచ్చిన భామలు మాత్రం ఫేడ్‌అవుట్ అయ్యారు.

06/22/2017 - 00:22

వినవయ్యా రామయ్యా ఫేం నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి సమర్పణలో భువన్ సాగర్ నిర్మించిన చిత్రం ‘ఏంజిల్’. షూటింగ్ పూర్తిచేసుకుని గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత భువనసాగర్ వివరాలు తెలియజేస్తూ- ‘సోషియా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.

06/22/2017 - 00:21

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరాకు బదులు దీపావళికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

Pages