S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2017 - 00:01

సోనమ్ లవ్‌లో వుంది. లండన్‌కి చెందిన ఓ బిజినెస్‌మెన్‌ని డీప్‌గా లవ్ చేస్తోందిట. ఈ వ్యవహారాన్ని అమ్మడే స్వయంగా బయటపెట్టింది. ‘ఇది పూర్తిగా వ్యక్తిగతం. మాది పవిత్ర బంధం. అందుకే డీప్‌గా డీటెయిల్స్ చెప్పను’ అనేసింది. ఇటీవల ఫిలింఫేర్ అవార్డ్స్‌లోక్రిటిక్ ఛాయిస్‌లో ఉత్తమ నటి అవార్డు ఎగరేసుకుపోయిన ఈ భామ.. నీర్జా సినిమాలో నటనకు ఈ పురస్కారం దక్కడం సంతోషాన్నిచ్చిందని చెప్పింది.

01/18/2017 - 23:59

హరీశ్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మాణతలో జయ.బి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘వైశాఖం’. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తిచేస్తున్న సందర్భంగా దర్శకురాలు జయ.బి మాట్లాడుతూ- కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేలా మంచి చిత్రాన్ని రూపొందించామని, లవ్‌లీ తరువాత హిట్ సినిమా కొట్టాలని దీన్ని రూపొందించామని తెలిపారు.

01/18/2017 - 23:56

విడుదలైన ఏడు రోజుల్లోనే చాలా త్వరగా వంద కోట్ల గ్రాస్ దాటిన చిత్రంగా చిరంజీవి నటించిన ‘ఖైదీనెం.150’ కొత్త చరిత్ర సృష్టిస్తోందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే ‘వంద కోట్ల క్లబ్’లో చేరిందని ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

01/17/2017 - 22:04

పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ అంటే ఎంతటి క్రేజ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. గతంలో వారి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది విజయాలను చూస్తే అర్థమైపోతుంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే హిట్ ఖాయమనే బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. అందుకే త్వరలో వీరు చేయనున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2016 ఆఖరులో అధికారికంగా లాంచ్ అయిన వీరి చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉంది.

01/17/2017 - 22:03

‘సినిమా చిత్రీకరణలో మేం ఎలా ఆలోచించినా, ప్రేక్షకులందరూ నందమూరి బాలకృష్ణ శాతకర్ణిగా వందశాతం న్యాయం చేశాడని ఒప్పుకుంటున్నారు. ఈ పాత్రను ఆయన తప్ప మరెవరూ చేయలేని విధంగా నటించారు ఆయన. ఇలాంటి చారిత్రక కథను చేస్తున్నప్పుడు భయం లేకుండా బాధ్యతగా ఆలోచించి చేశాం.

01/17/2017 - 22:02

ఎనిమిదేళ్ల విరామం తరువాత చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖైదీ నెం.150’లో కథానాయికగా మెప్పించిన కాజల్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మనోభావాలు ఇలా..
రెస్పాన్స్ బాగుంది..

01/17/2017 - 22:00

బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఇప్పటికీ మేకప్ వేసుకోని రవితేజ- ఎందుకో స్పీడ్ తగ్గించాడు. విరామం లేకుండా షూటింగ్స్‌లో పాల్గొనడం వల్ల కాస్త రెస్ట్ తీసుకుంటున్నాని టాక్. అందుకే విదేశాలను చుట్టొచ్చే పనిలో ఉన్నాడట. 2016లో రవితేజ ఒక్క సినిమా కూడా చేయలేదు. బెంగాల్ టైగర్ తరువాత చాలా కథలు విన్నా, చాలామంది దర్శకులతో చర్చలు జరిపినా కూడా ఎందుకో ఒక్క సినిమాకు కూడా ఈ మాస్‌హీరో కమిట్ కాలేదు.

01/17/2017 - 21:59

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తీసే నిర్మాతగా దిల్‌రాజుకు పేరుంది. ఆయన సినిమాలంటే జనాలకు ప్రత్యేకమైన ఆసక్తి. తాజాగా దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా దిల్‌రాజు చెప్పిన విశేషాలు..
ఇంత రెస్పాన్స్ ఊహించలేదు

01/17/2017 - 21:57

హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న వార్తలు రావడంతో నూతన దర్శకుడు సాయిరామ్ దాసరి ప్రజలకు క్షమాపణలు తెలిపారు. సాయిరామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ద్యావుడా’ చిత్రం టీజర్ చూశాక హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇందుకు దర్శకుడు క్షమాపణ చెప్పాలని ఆందోళన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఈ చిత్రం రూపొందించలేదని, తానూ హిందువునేనని సాయిరామ్ తెలిపారు.

01/17/2017 - 21:56

గోపీచంద్-సంపత్‌నంది కాంబినేషన్‌లో ఇంకా పేరు నిర్ణయించని చిత్రానికి సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తిచేశారు. నాలుగో షెడ్యూల్ త్వరలో ప్రారంభించనున్నారు. బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జె.్భగవాన్, జె.పుల్లారావు రూపొందిస్తున్నారు.

Pages