S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2017 - 20:59

ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతన ఉత్తేజ్ హీరోయిన్‌గా పరిచయం చేస్తూ శశిభూషణ్ దర్శకత్వంలో సంజీవ్, నందు, కారుణ్య ముఖ్యపాత్రల్లో శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న పిచ్చిగా నచ్చావ్ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను యువనటుడు నవీన్ చంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

01/19/2017 - 20:57

జాతీయ నటుడు కమల్‌హాసన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ‘వికటన్’ ప్రకటించింది. ఈ అవార్డును ప్రముఖ నటుడు రజనీకాంత్ ఆయనకు అందించారు. ఈ సందర్భంగా కమల్‌తో రజనీ ఫొటోకు పోజిచ్చారు.

01/19/2017 - 20:56

తమిళంలో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా దక్కని క్రేజ్‌ను రజనీకాంత్ కబాలి చిత్రంతో దక్కించుకుంది అందాల భామ ధన్సిక. కబాలిలో రజనీకాంత్ కూతురిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈమెకు పలు అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ హీరోయిన్‌గా ఓవైపు నటిస్తూనే, మరోవైపు భిన్నమైన పాత్రలు చేయడానికి సిద్ధమైంది. తాజాగా వేశ్యపాత్రలో నటించేందుకు ఓకె చెప్పిందట. ఈమధ్య సినిమా హీరోయిన్లకు వేశ్యపాత్రలంటే అమితాసక్తి.

01/19/2017 - 20:53

‘జల్లికట్టు’ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాడులో జరుగుతున్న ఆందోళనకు ఆ రాష్ట్రంలోని సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ‘జల్లికట్టు’పై ఆంక్షలు సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్డినెన్స్‌ను విడుదల చేయాలని తమిళ సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా గురువారం నాడు సినిమా షూటింగ్‌లను పూర్తిగా నిలిపివేశారు.

01/19/2017 - 00:38

శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై చిట్టిపల్లి లక్ష్మి సమర్పణలో వెంకటేష్, మల్లేశ్, ప్రాచీ అధికారి, మమతా కులకర్ణి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘సుడిగాలి’.

01/19/2017 - 00:37

కృష్ణవంశీ దర్శకత్వంలో బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఈ చిత్రంలో సందీప్‌కిషన్ పోలీసు అధికారిగా వైవిధ్యమైన పాత్రలో కన్పిస్తారని నిర్మాతలు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నామని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.

01/19/2017 - 00:21

‘తెలుగుజాతికి ఖ్యాతిని తెచ్చిన మహావీరుడు శాతకర్ణి. అలాంటి గొప్ప వ్యక్తి కథ తెలియచేద్దామన్న ఆలోచనలో వచ్చిన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఇచ్చిన విజయం మరిచిపోలేనిది’- అంటున్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా రూపొందిన ప్రతిష్ఠాత్మక వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.

01/19/2017 - 00:20

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తన కొత్త సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. దర్శకుడు బాబీ తెరకెక్కించే ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 11న సినిమాను ప్రారంభించి, అదే రోజున సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్ర బృందం భావిస్తోందట. ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్‌రామ్ భారీగా నిర్మించే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందే అంచనాలు రేకెత్తిస్తోంది.

01/19/2017 - 00:19

సాయి, దీప్తి జంటగా గ్రీన్ సన్ ఇన్నోవేటివ్ పతాకంపై నాగరాజు దర్శకత్వంలో గన్నవరపు చంద్రశేఖర్, పీర్యా నాయక్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇక సె..లవ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల 10న విడుదలకు ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు.

01/19/2017 - 00:18

‘జనతా గ్యారేజ్’ తర్వాత మళ్లీ సినిమాల్లో కనపడలేదు హీరోయిన్ సమంత. అక్కినేని ఫ్యామిలీ మెంబర్‌గా మారబోతూ అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ దగ్గర నుంచి అతని పెళ్లివరకూ వదినగా అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది సమంత. ఇప్పటికే మాజా.. పారగాన్.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్.. లక్స్.. జ్యూవెల్ వన్ లాంటి కంపెనీలతోపాటు ఇంకా కొన్ని వ్యాపార సంస్థలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

Pages