S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/12/2017 - 20:57

నిన్నటితరం నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు జారీచేశారు. ఆమె తమ్ముడి భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని రంభ సోదరుడి భార్య ఫిర్యాదు చేశారు. రంభ, ఆమె సోదరుడు శ్రీనివాసరావుపై, కుటుంబ సభ్యులపై సమన్లు జారీచేసేందుకు గతంలోనే పోలీసులు ప్రయత్నించారు. అయితే, రంభ అమెరికాలో ఉండడంతో వీలుపడలేదు.

01/12/2017 - 20:55

విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఆర్.పి.ఎ క్రియేషన్స్, డి.వి. సినీ క్రియేషన్స్ పతాకాలపై డి.వెంకటేష్ తెలుగులో అందిస్తున్న చిత్రం పిజ్జా-2. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ, ఆధునిక టెక్నాలజీతో కొందరు యువకులు అమాయకమైన మహిళలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో తెలిపేలా చిత్రం రూపొందించామని, ఓ సామాజిక సమస్యను థ్రిల్లర్ జోనర్‌లో చర్చించామని తెలిపారు.

01/12/2017 - 20:54

బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని ఆమె సన్నిహితురాలు హాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ కోరుకుంటోందట. రాఖీ చాలా కష్టపడి పైకి వచ్చిందని, ఆమె రాళ్ళలో ప్రవహిస్తున్న నదిలాంటిదని, ఆమె ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోదని, అమ్మాయిలంతా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని హయత్ అంటోంది. రాఖీ లాంటి స్నేహితురాలు దొరకడం తన అదృష్టమని సోఫియా అంటోంది.

01/12/2017 - 20:52

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్లు క్రేజ్ తెచ్చుకోవడం , అవకాశాలు పట్టేయడం ఎలాగో బాగా తెలుసుకున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ హాట్ భామ ఏకంగా టాప్‌లెస్‌లో పోజులిచ్చి షాక్ ఇచ్చింది. ఆమే- దిశా పటాని. ఆమధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని గ్లామర్‌తో మంచి మార్కులే కొట్టేసింది.

01/12/2017 - 01:06

ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70శాతం పైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా షూటింగ్‌లో మహేష్ బుధవారం నుండి పాల్గొంటున్నారు.

01/12/2017 - 01:04

దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్రీయ. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన శ్రీయ చాలామంది స్టార్ హీరోలతో నటించి క్రేజ్ తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ సరసన ఆమె నటించిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా శ్రీయ చెప్పిన విశేషాలు..
* శాతకర్ణిలో అవకాశం ఎలా..?

01/12/2017 - 01:00

‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన దర్శకుడిగా రాజవౌళి గుర్తింపు పొందాడు. ఆయన తెరకెక్కించిన బాహుబలి భారీ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్‌గా బాహుబలి-2 రూపొందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత రాజవౌళి తదుపరి సినిమా ఏమిటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

01/12/2017 - 00:57

మోహన్‌లాల్, ప్రియదర్శన్ కలయికలో ఆశీర్వాద్ సినిమాస్, వన్ ఓవర్ సీస్ నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రూపొందిస్తున్న చిత్రం ‘కనుపాప’. మలయాళంలో విజయవంతమైన ఒప్పమ్ చిత్రాన్ని తెలుగులో దిలీప్‌కుమార్ బొలుగోటి అందిస్తున్నారు.

01/12/2017 - 00:56

బాలీవుడ్‌లో హాట్ హాట్ ఫోజులతో గ్లామర్ భామగా ఇమేజ్ తెచ్చుకున్న బిపాసాబసు ఈమధ్య కరణ్‌గ్రోవర్‌ను పెళ్లిచేసుకుని సినిమాలకు కాస్త దూరమైంది. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో షికార్లు చేస్తున్న ఈ భామ అక్కడ గ్లామర్‌తో అందరికీ మతులు పోగొడుతోందట. పెళ్లైనా కూడా బిపాసాలో అందం ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు జనాలు. కాస్త గ్యాప్ తీసుకున్న బిపాసా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుపుతుందట.

01/12/2017 - 00:55

నిఖిల్, నందిత శేత, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం మంచి విజయాన్ని అందుకుని అర్ధ శతదినోత్సవాన్ని పూర్తిచేసుకుంది. 28 థియేటర్లలో ఈ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సమక్షంలో 50 రోజుల వేడుకను జరుపుకున్నారు.

Pages