S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

06/11/2017 - 01:42

విద్యార్థుల్లో దాగిన సృజనను వెలికితీయగలిగే సామర్థ్యమున్న గురువు లభిస్తే ఆ శిష్యుడు భావి సమాజానికి మార్గనిర్దేశనం చేయగలిగిన జ్ఞానుడు అవుతాడనటంలో అతిశయోక్తి లేదు. అలాంటి గురువులు ప్రాచీన కాలంలో ఎందరో శిష్యులను తయారుచేయటం వల్లే మనదేశ సంస్కృతి వేనోళ్ల కొనియాడబడుతోంది.

06/11/2017 - 01:41

రాయడం అంటూ తగ్గిపోయిన ఈ రోజుల్లో ఉత్తరాల ప్రసక్తి తీసుకొస్తే కాస్త వింతగానే ఉంటుంది. అయితే తెల్లకాగితాల మీదో, ఇన్‌లాండ్ లెటర్ మీదో, పోస్టుకార్డు మీదో కాకుండా, మానిటర్ మీదో, సెల్‌ఫోన్ స్క్రీన్ మీదో సందేశాలు రాయకుండా ఇప్పుడు ఎవరూ లేరు. పోస్టల్ శాఖ ద్వారా ఉత్తరాలు లేదా లేఖలు రాసి పంపడం మాత్రం తగ్గింది. ఇదంతా లేఖా సాహిత్యం మీద కాస్త కురచగా చెప్పుకునే సంగతి.

06/11/2017 - 01:40

కొత్త బంగారు లోకం (మనోగీతికలు)

05/13/2017 - 21:53

ఉదయం 11 గంటలవుతోంది. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా మండుతోంది. అయినా ఆంధ్రా యూనివర్సిటీ క్యాంటీన్ సందడిగా ఉంది. ఎక్కువ జనం లేనిచోట, ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర రమ, నిర్మల కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల ముఖాలను బట్టి చూస్తే వాళ్లేదో సుదీర్ఘ సంభాషణలో మునిగి ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్లు అదే యూనివర్సిటీలో ఎంఏ కలిసి చదివారు. మొదటి పరిచయంలోనే స్నేహితులయ్యారు. అభిరుచులు కూడా కలిశాయి.

04/30/2017 - 03:32

నాలుగు సంవత్సరాల నుండి నడుస్తున్న క్రిమినల్ కేసుకు రేపే తుది తీర్పు. న్యాయస్థానానికి సాక్ష్యాలే ఆధారం. న్యాయదేవత కళ్లకి నల్లగుడ్డ కట్టుకొని చేతిలోకి త్రాసుతో న్యాయాన్యాయములను తూకం వేస్తుంది. అపరాధిని శిక్షించడానికి కావలసిన సాక్ష్యాల భారం సంతృప్తికరంగా ఉంటే శిక్ష ఖరారు అయినట్లే! అది దొంగ సాక్ష్యమైనా అనవసరం. న్యాయస్థానంలో భగవద్గీత తాకగానే అది పవిత్రమైపోతుంది.

04/30/2017 - 03:27

భూతకాల వలయంలోంచి
జ్ఞాపకాలు ఎగసిపడుతాయి
భవితాకాశమంతా
ఆశల పూజలు విరబూస్తాయి
వర్తమానమొక్కటే
వాస్తవాలతో జత కడుతుంది
మానవ జన్మ మాత్రం
నూరేళ్ల జీవితమై విస్తరిస్తుంది
కొందరు మాత్రమే
మనిషితనానికి రూపవౌతారు
వాళ్ల అనే్వషణ ప్రవృత్తి అవుతుంది
అనునిత్యం కాలాన్ని గమనిస్తూ
అవాస్తవాలపై కనె్నర్రజేస్తారు

04/30/2017 - 03:21

ఒకసారి శ్రీశ్రీని కొందరు ఇంటర్వ్యూ చేస్తూ ‘శ్రీశ్రీ మహాకవి అయితే కావచ్చు గానీ, ప్రజాకవి కాడని కొందరు విప్లవకారుల అభిప్రాయం. మీ వ్యాఖ్య?’ అని అడిగారు. దానికి శ్రీశ్రీ సమాధానమిస్తూ.. ‘ఏకీభవిస్తున్నాను. నేను అక్షరాస్యుల కవిని, చదువు రానివారి కవిని కాను. ప్రజాకవి కానివాడు మహాకవి కూడా కాలేడు’ అన్నారు. శ్రీశ్రీ మహాకవో, ప్రజాకవో, మరో కవో చెప్పాల్సింది శ్రీశ్రీ కాదు, కాలం!

04/24/2017 - 23:11

పేద విద్యార్థులకు వరంగా మారిన
విశాఖ హిందూ రీడింగ్ రూం

04/16/2017 - 01:56

బయటంతా చిమ్మ చీకటి అంధకారాన్ని చీల్చుకుంటూ రైలు దూసుకుపోతుంది. మూడురోజుల నుంచి నిద్ర సరిగా లేకపోవటంతో మత్తుగా పట్టేసింది.

04/16/2017 - 01:54

మా ఊరికి వస్తూనే ఉంటాయి
ఆత్మబంధువులై
చలికాలం మంచుపూలు కురిసే
వెనె్నల వేళ
మా ఊరి చింతచెట్లపైకి
దేశదేశాలు దాటి
ఎతె్తైన కొండల వరుసలు దాటి
అలల శబ్దాల గంభీర
సముద్రాలు దాటి
పైనుంచి పైకి ఎదిగిన ఎతె్తైన
అడవుల శిరస్సుల పైనుంచి
వస్తూనే.. వస్తూనే ఉంటాయి
రెక్కల టపటపల శబ్దాలు చేస్తూనే
వరుస వరుసలుగా సైబీరియా విహంగాలై

Pages