S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/01/2018 - 04:51

కాబూల్, ఏప్రిల్ 30: వరుస ఉగ్రదాడులతో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ అతలాకుతలమవుతోంది. తాజాగా సో మవారం ఒకేచోట నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు ఆత్మాహుతి దా డుల్లో కనీసం 25మంది మృత్యువాతపడినట్టు పోలీసులు వెల్లడించారు.

05/01/2018 - 04:48

జెహానాబాద్, ఏప్రిల్ 30: ఎన్ని చట్టాలు చేసినా, ఎంత కఠినమైన శిక్షలు వేస్తూన్నా కామాంధుల్లో అదురు బెదురూ ఉండడం లేదు. బిహార్‌లోని జెహానాబాద్ జిల్లా భార్తువా పట్టణంలో 13 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. బాలికపై దారుణానికి పాల్పడిన వారు ఏడుగురు బాలురేనని పోలీసులు వెల్లడించారు.

05/01/2018 - 04:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ‘కులతత్వం’ బాకు ను దేశం గుండెల్లో దించిందని కాం గ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో పోలీసుల ఎంపిక సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థుల ఛాతీపై ముద్రలు వేయటాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు.

05/01/2018 - 04:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్కడ బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు.

05/01/2018 - 04:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మైనర్‌పై అత్యాచారం, దారుణ హత్య ఘటన దేశ వ్యాప్తంగా రగిలిపోతుంటే జమ్మూకాశ్మీర్ కొత్త ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తాకు అదో స్వల్ప సంఘటనగా తేల్చేశారు. డిప్యూటీ సీఎంగా కేబినెట్‌లోకి చేరిన కాసేపటికే ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన పాశవిక దాడి యావత్ భారతాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే.‘రసానా ఈజ్ ఛోటీ సీ బాత్ (అదో చిన్న సంఘటన)..

05/01/2018 - 04:32

తిరువల్ల (కేరళ), ఏప్రిల్ 30: మతాలు, రాజకీయాలను కలపకూడదని ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు కోరారు. మతపెద్దలు ఆధ్యాత్మిక బోధనలకు పరిమితం కావాలని, రాజకీయ నాయకులు దేశ ఉన్నత వారసత్వాన్నుంచి స్పూర్తిని పొందాలని అన్నారు. మలంకర మారథోమా సిరియన్ చర్చిలో సోమవారం నిర్వహించిన డాక్టర్. ఫిలిపోస్ మార్ క్రిసోస్తమ్ 101వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉపరాష్టప్రతి ప్రసంగించారు.

05/01/2018 - 04:25

అహమ్మదాబాద్, ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిసార్లు హెచ్చరించినా పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఆయన సోమవారం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోదీలు ‘బ్రాహ్మణులు’ అంటూ పేర్కొని తాజా వివాదానికి తెరలేపారు.

05/01/2018 - 04:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: భారత్-పాక్ సరిహద్దులో పాకిస్తాన్ కొన్ని నిర్మాణ పనులు ప్రారంభించడంతో బీఎస్‌ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దులోని షాగర్ బల్గే-తానాట్ ప్రాంతంలో ఈ పనులు ప్రారంభమైనట్లు భారత నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీం తో బీఎస్‌ఎఫ్ అప్రమత్తమైంది.

05/01/2018 - 04:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: మణిపూర్‌లోని మారుమూల గ్రామం లీసాంగ్‌ను విద్యుద్దీకరించటంతో, స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్ధాల తరువాత దేశంలోని పల్లెలన్నీ విద్యుత్ వెలుగుకు నోచుకున్నట్టయ్యింది. దేశంలోని పల్లెలన్నింటికీ విద్యుత్ వెలుగులు అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని 12 రోజులు ముందుగానే సాధించినట్టు అధికారులు చెబుతున్నారు.

05/01/2018 - 04:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసా ద్ యాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి చేశారు. లాలూ డిశ్చార్జి వ్యవహారం వివాదాస్పదంగా మారింది, లాలూ ఆరోగ్య పరిస్థితి కుదుటపడినందునే డిశ్చార్జి చేశామని ఎయిమ్ వైద్యులు చెబుతుండగా దీని వెనకు కుట్ర ఉందని ఆర్జేడి ఆరోపిస్తోంది.

Pages