S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/04/2018 - 12:16

న్యూఢిల్లీ : దేశంలో మహిళలు స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన నరేంద్ర మోదీ యాప్ ద్వారా కర్ణాటక బీజేపీ మహిళా మోర్చా ప్రతినిథులతో మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాల్లో విజయాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు.

05/04/2018 - 12:21

బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప శుక్రవారం ఉదయం విడుదల చేశారు. యడ్యూరప్ప మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు తాను చేసే మొట్టమొదటి ప్రకటన రైతులు, నేతన్నల రుణాలు రూ.1 లక్ష వరకు రద్దు చేయడమేనన్నారు. రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించేందుకు ‘మిషన్ కల్యాణి’ని ప్రారంభిస్తామని చెప్పారు.

05/04/2018 - 12:19

బెంగళూరు : కర్ణాటకలోని జయనగర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ వినయ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. కుప్పకూలిపోయాడు. దీంతో వినయ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం జయదేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం తెల్లవారుజామున వినయ్‌కుమార్ కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.

05/04/2018 - 02:34

ఔరద్, మే 3: కర్నాటక ఎన్నికల ప్రచారంలో రోజుకో కొత్త ఒరవడి చోటుచేసుకుంటోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు తార స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య ఆరోపణలూ అదే స్థాయిలో సాగాయి. అయతే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఇక్కడో ఎన్నికల సభలో మాట్లాడుతూ నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయబోనని అకస్మాత్తుగా ప్రకటించారు.

05/04/2018 - 02:28

న్యూఢిల్లీ, మే 3: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ‘కోడ్’ ఉల్లంఘిస్తూ విచ్చల విడిగా అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గురువారం ఇక్కడ ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్ నాయకులు అభిశేక్ సింఘ్వీ, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీతో కూడిన బృందం బీజేపీ యాడ్‌లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

05/04/2018 - 03:27

న్యూఢిల్లీ, మే 3: అరవై ఐదవ జాతీయ చలన చిత్ర ఆవార్డుల ప్రదానోత్సవం వివాదాస్పదమైంది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కేవలం పదకొండు ముఖ్యమైన అవార్డులు మాత్రమే బహూకరించటంతో దాదాపు డెబ్భై మంది ఇతర బహుమతి గ్రహీతలు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. 1954 సంవత్సరం నుండి జరుగుతున్న జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమాన్ని భ్రష్టుపట్టించారని పలువురు అవార్డు గ్రహీతలు ఆరోపించారు.

05/04/2018 - 03:29

లక్నో/ఉదయ్‌పూర్, మే 3: ఉత్తర భారతంపై ప్రకృతి కనె్నర్ర జేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి విలయానికి సుమారు 100 మంది మృత్యువాత పడ్డారు. ఇసుక తుపానుకు భారీ వర్షం తోడై బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఉపద్రవానికి వందమంది ప్రాణాలు కోల్పోయారు. గాలి దుమారం, వర్షం విధ్వంసం సృష్టించాయి. ఇళ్లు ఎక్కడికక్కడ నేలమట్టమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.

05/04/2018 - 03:34

పాట్నా, మే 3: బిహార్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతీహరీ ప్రాంతంలో ప్రయాణికుల బస్సు రోడ్డుపై పల్టీ కొట్టింది. వెంటనే బస్సుకు నిప్పు అంటుకుంది. దీంతో 27 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మోతీహరీ జిల్లా చెత్వా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుందని విపత్తుల శాఖ మంత్రి దినేష్ చంద్ర యాదవ్ వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.

05/04/2018 - 03:35

కల్బుర్గి (గుల్బర్గా), మే 3: దేశ సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉందని, ఇటీవల కాశ్మీర్ సరిహద్దుల్లో సైనికులు సాహసంతో వైమానిక దాడులను నిర్వహిస్తే, వారిని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. జవాన్ల త్యాగాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌కు పాలించే హక్కుందా అని ఆయన నిలదీశారు.

05/03/2018 - 17:52

బీహార్ : బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన బీహార్‌లోని మోతిహారీలో చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే అందులో నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మృతి చెందారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ఢమైంది.

Pages