S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/22/2016 - 06:27

చెన్నై, ఆగస్టు 21: చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్ వెళుతూండగా కొన్ని వారాల క్రితం 29 మందితో గల్లంతైన ఐఎఎఫ్ విమానం ఎఎన్-32 శకలాలు కనిపించాయా? సముద్ర పరిశోధనలు జరిపే ఆర్‌వి సముద్ర రత్నాకర్ గాలింపులో ఈ శకలాలు కనిపించాయి. లక్షా 45వేల చదరపు కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ 4500 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ నౌక గాలించింది.

08/21/2016 - 15:55

ఉజ్జయిని:మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదీజలాలు ఉజ్జయిన పట్టణాన్ని ముంచెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు, వర్షాల కారణంగా ఒక్కరోజే రాష్ట్రంలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.

08/21/2016 - 15:55

పాట్నా:బిహార్‌లోని సరన్ నుంచి పాట్నాకు తిరిగివస్తూండగా కారు ప్రమాదానికి గురవడంతో కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు.

08/21/2016 - 05:52

సిమ్లా, ఆగస్టు 20: న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేదిగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అంటూ, స్వచ్ఛమైన, సత్వరమైన న్యాయం ఇప్పటికీ ఎండమావిగానే ఉందన్నారు.

,
08/21/2016 - 04:02

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కాశ్మీర్ సమస్యకు పాలనాపరంగా కాక రాజకీయంగా ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయనను కోరారు.

08/21/2016 - 03:57

సాగర్(ఎంపీ), ఆగస్టు 20: మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రహత్‌గఢ్ జిల్లాలో శనివారం ఓ ఇల్లు కూలిపోయిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు గాయపడ్డారు. వర్షాలకు నానిపోయి ఇల్లు కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున రహత్‌గఢ్‌లోని ఏడో వార్డులో మెహతాబ్ సిల్పకర్ (59) ఇల్లు కూలిపోయింది.

,
08/21/2016 - 03:56

న్యూఢిల్లీ, ఆగస్టు 20: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు శనివారం ఆయనను స్మరించుకున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు నాయకులు ఈ సందర్భంగా రాజీవ్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు.

08/21/2016 - 03:51

జైపూర్, ఆగస్టు 20: ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు విజయవంతం కావడం అనేది ‘బ్రిక్స్’ దేశాలు వాటి అమలులో విజయం సాధించడంపై ఆధారపడి ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాలను విజయవంతంగా అమలు చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాలు ఒకే కూటమిగా పని చేయాలని అన్నారు.

08/21/2016 - 03:49

సూరత్ (గుజరాత్), ఆగస్టు 20: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత ఏడాది న్యూఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధరించిన మోనోగ్రామ్డ్ సూటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూటుగా గిన్నిస్ రికార్డుల పుస్తకంలో చోటు దక్కించుకుంది.

08/21/2016 - 03:44

ముంబయి, ఆగస్టు 20: మోకాలి గాయంతో బాధపడుతున్న భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శనివారం ముంబయిలోని ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుంది. దీంతో ఆమె నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానుంది. ఈ నెల ఆరంభంలో సైనా మోకాలికి తగిలిన గాయం రియో ఒలింపిక్స్‌లో మరింత తీవ్రమవడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.

Pages