S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/24/2016 - 07:13

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రపంచంలో పది సంపన్న దేశాల్లో భారత్ చోటు సంపాదించుకుంది. భారత్‌లో 5,600 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

08/24/2016 - 07:12

న్యూఢిల్లీ, ఆగస్టు 23: గత ఫిబ్రవరి 9న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరిగిన ఓ వివాదాస్పద కార్యక్రమంలో పాల్గొన్నందుకు వివిధ రకాల శిక్షలను ఎదుర్కొన్న 21 మంది విద్యార్థులు తప్పు చేశారని అపెలేట్ అథారిటీ అభిప్రాయపడింది. అయితే వీరిలో కొంతమందిపై విధించిన ఆర్థికపరమైన జరిమానాలను ఆ అథారిటీ తగ్గించింది.

08/24/2016 - 04:44

న్యూఢిల్లీ, ఆగస్టు 23: రియో ఒలింపిక్స్‌లో అధికారులు ఎవరూ అందుబాటులో లేరని, తనకు గుక్కెడు మంచినీళ్లు ఇచ్చే వారుకూడా లేకపోవడంతో ఒకానొక దశలో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డానని మహిళా మారథాన్ రన్నర్ ఒపి జైష చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.

08/23/2016 - 16:13

మీరట్ః ఒలింపిక్స్ లో కాంస్య పతకం తెచ్చిన రెజ్లర్ సాక్షి మాలిక్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఆమెకు, ఆమె మతానికి వ్యతిరేకంగా వ్యాఖలు చేసినందుకు నదీమ్ నంబార్డర్ అనే వ్యక్తిపై ఐటి చట్టంకింద కేసు నమోదు చేసినట్లు మీరట్ పోలీసులు తెలిపారు.

08/23/2016 - 15:39

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లోని వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. సత్వర చర్యలకై ఒడిశా నుంచి 5 బృందాలను యూపీకి, పంజాబ్‌ నుంచి మరో 5 బృందాలను బిహార్‌కి తరలించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ఓపీ సింగ్‌ తెలిపారు.

08/23/2016 - 15:31

ముంబయి: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి మంగళవారం కీలక ఒప్పందం కుదిరింది. ముంబయిలోని సహ్యాద్రి అతిథిగృహంలో మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్‌, కేసీఆర్‌ల సమక్షంలో ఉన్నతాధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మూడు బ్యారేజీలు, మహారాష్ట్ర రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నాయి.

08/23/2016 - 12:01

బెంగళూరు: పాకిస్థాన్‌ను ప్రశంసిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ కాంగ్రెస్ ఎంపీ, కన్నడ నటి రమ్యపై కర్నాటకలో దేశద్రోహం కేసు నమోదైంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సుకు హాజరైన ఆమె భారత్ వచ్చాక ‘అందరూ అనుకున్నట్టు పాకిస్థాన్ నరకమేమీ కాదు, అక్కడ మమ్మల్ని బాగా చూసుకున్నారు, అక్కడి జనం మనలాంటి వారే..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

08/23/2016 - 11:45

ఢిల్లీ : ఈ విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో 900, తెలంగాణలో 550 ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగాయి. నిబంధనలు పాటించినప్పటికీ తమ దరఖాస్తుల్ని భారత వైద్య మండలి పరిగణనలోకి తీసుకోలేదంటూ వివిధ వైద్య కళాశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆయా కళాశాలల దరఖాస్తులను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఒక ఓవర్‌సైట్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

08/23/2016 - 04:35

లాహోర్, ఆగస్టు 22: ముంబయి నగరంపై 2008లో దాడి చేసేందుకు లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులకు సుమారు రూ. నాలుగు మిలియన్ల సహాయం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సుఫయాన్ జాఫర్ అనే వ్యక్తిని పాకిస్తాన్‌లోని ఓ కోర్టు జుడీషియల్ కస్టడీకి పంపించింది. సుఫయాన్‌ను విచారణ కోసం మరికొన్ని రోజులు తన కస్టడీకి అప్పగించాలన్న ఎఫ్‌ఐఎ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

08/23/2016 - 04:35

చండీగఢ్, ఆగస్టు 22: పంజాబ్ కొత్త గవర్నర్‌గా వి.పి.సింగ్ బద్నోర్ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్, హర్యానాల హైకోర్టు న్యాయమూర్తి ఎస్.జె.వాజిఫ్‌దార్ రాజ్‌భవన్‌లో ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ హాజరయి, బద్నోర్‌కు అభినందనలు తెలిపారు. బద్నోర్ చండీగఢ్‌కు పాలనాధికారిగా కూడా వ్యవహరిస్తారు.

Pages