తెలంగాణ

టిఆర్‌ఎస్‌కు వంద సీట్లొస్తే రాజకీయ సన్యాసం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలిస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని టి.పిసిసి ఉపాధ్యక్షుడు, తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాష్ట్ర మంత్రి కె. తారక రామారావుకు సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని మంత్రి కెటిఆర్ చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఒకవేళ వంద సీట్లు గెలుపొందకపోతే మంత్రి కెటిఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని ఆయన సవాల్ విసిరారు. మజ్లిస్ పార్టీ షహర్ హమారా, మేయర్ హమారా అని ప్రచారం చేయడాన్ని ఆయన అపహాస్యం చేశారు. 61 డివిజన్లలో పోటీ చేసి మేయర్ హమారా అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి వెళ్ళేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదని అన్నారు.