సంపాదకీయం

‘మారని’ రష్యా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో జరిపిన పర్యటనకు ద్వైపాక్షిక ప్రాధాన్యం కంటే బహుళ పక్షీయ ప్రాధాన్యం ఎక్కువగా లభించింది! ఇలా లభించడం మనకూ రష్యాకు మధ్యగల స్నేహ సంబంధాలలో యథాతథస్థితి కొనసాగుతోందనడానికి మరో నిదర్శనం. కుడంకుళంలో రష్యా సహకారంతో మనం నిర్మించుకున్న అణువిద్యుత్ కేం ద్రంలో మరో రెండు ఉత్పాదక యంత్ర వ్యవస్థ- రియాక్టర్-లను నెలకొల్పడానికి ఉభయ దేశాల మధ్య ఒప్పందం కుదరడం కొత్త పరిణామం కాదు. ఎందుకంటే ‘ఈ రెండు రియాక్టర్‌లను మీకు ఇస్తాను..’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఏడాదిగా చెబుతున్నాడట! మన అంగీకారంతో నిమిత్తం లేదన్నట్టు ఉభయ దేశాల తరఫున పుతిన్ తానే ప్రతినిధి అయినట్టు స్ఫురింపచేయడం మోదీ రష్యాలోని పీటర్స్‌బర్గ్ నగర సందర్శనకు నేపథ్యం. ‘అంతర్జాతీయ ఆర్థిక సమాఖ్య’- ఇంటర్‌నేషనల్ ఎకనమిక్ ఫోరం- సమావేశంలో శుక్రవారం మోదీ చేసిన ప్రసంగం బహుళ పక్షీయ స్ఫూర్తికి నిదర్శనం. మన దేశంలో పెట్టుబడులను పెట్టవలసిందిగా రష్యాను మాత్రమేకాక ఇతర దేశాలను కూడ మోదీ ఆహ్వానించడం బహుళ పక్షీయ స్ఫూర్తి. ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత బహుళ పక్షీయ ఆర్థిక స్ఫూర్తి ద్వైపాక్షిక, రక్షణ, వ్యూహ, దౌత్య, వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ ‘చరిత్ర’ను ప్రస్తుతం చైనా ప్రధానంగా నడిపిస్తోంది. చైనా మనకు ‘వ్యూహాత్మక’ శత్రువన్నది జగమెరిగిన స త్యం. కానీ ఒకప్పటి పరస్పర శత్రుదేశాలైన రష్యా, చైనాలు పదేళ్లకు పైగా ప్రగాఢ మి త్రదేశాలుగా మారి ఉన్నాయి. పాకిస్తాన్‌తోను మన దేశంతోను రష్యా సమాన మైత్రిని పాటిస్తుండడం చైనా ప్రభావం. చైనా నాయకత్వంలో ‘షాంఘయి సహకార సమాఖ్య’- షాంఘయి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్- ఎస్‌సిఓ-లో మన దేశానికి సంపూర్ణ సభ్యత్వం లభిస్తోందని రష్యా అధ్యక్షుడు ప్రకటించడం బహుళ పక్షీయ స్ఫూర్తికి మరో నిదర్శనం. మోదీ-పుతిన్ చర్చల తరువాత విడుదలైన ‘దర్శన పత్రం’- విజన్ డాక్యుమెంట్-లో ద్వంద్వ ప్రమాణాలకు అతీతంగా అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరసించాలని పిలుపునివ్వడం బహుళ స్ఫూర్తికి మరో సాక్ష్యం.
మన ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం వల్ల ఉభయ దేశాల మైత్రీ ప్రస్థానంలో ఎంత ప్రగతి జరిగిందన్నది వేచి చూడదగిన అంశం. రష్యా అధ్యక్షుడు పుతిన్ దాదాపు పదిహేడు ఏళ్లుగా రష్యా విదేశాంగ నీతికి కేంద్ర బిందువు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోను, ది మిత్రీ మెద్విదేవ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు ప్రధానిగా ఉన్న సమయంలోను కూడ పుతిన్ ప్రాబల్యం రష్యానీతిని నిర్దేశించింది. అధ్యక్షుడిగా పనిచేసిన తరువాత పుతిన్ ప్రధాని అయ్యాడు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఇలా జరగడం చాలా అరుదు. రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత 2008లో పుతిన్ అధ్యక్ష పదవిని మెద్విదేవ్‌కు అప్పగించాడు. అయితే గురుతుల్యుడు పుతిన్ ప్రధానమంత్రిగా ఉండడానికి అంగీకరించినట్టయితే మాత్రమే తాను తమ ‘యునైటెడ్ రష్యా’ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని మెద్విదేవ్ నిబంధన పెట్టాడు, పుతిన్ అంగీకరించాడు. ఒకే వ్యక్తి వరుసగా రెండుసార్లు కంటె మించి అధ్యక్ష పదవికి పోటీ చేయరాదన్న రాజ్యాంగ నిబంధన వల్ల పుతిన్ 2008లో మూడవసారి పోటీ చేయలేకపోయాడు. నాలుగేళ్ల తర్వాత 2012 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్ మళ్లీ ‘యునైటెడ్ రష్యా’ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. మెద్విదేవ్‌ను ప్రధానిగా నియమించాడు. మెద్విదేవ్ 2012లో రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు. పార్టీలోను, ప్రజలలోను పుతిన్‌కున్న పలుకుబడి ప్రాబల్యం ఇందుకు కారణం. ‘వరుస’ తప్పింది కాబట్టి పుతిన్ మళ్లీ అధ్యక్షుడు కాగలిగాడు. ఇలా కేవలం రాజ్యాంగ నిబంధనను పాటించడానికి లేదా వరుసగా మూడుసార్లు ఎన్నిక కారాదన్న రాజ్యాంగ పరమైన ఆంక్షలను తప్పించుకొనడానికి మాత్రమే పుతిన్ 2008వ, 2012వ సంవత్సరాల మధ్య తనకు శిష్య తుల్యుడైన మెద్విదేవ్‌కు అధ్యక్ష పదవిని అప్పగించాడు. ఇలా 2000వ సంవత్సరం నుంచి పదిహేడు ఏళ్లుగా రష్యాకు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ప్రజాస్వామ్య నాయకుడు పుతిన్. భారత రష్యా స్నేహం క్రమంగా పలచబడుతుండడం ఈ పదిహేడు ఏళ్ల చరిత్ర..
‘షాంఘయి సహకార సమాఖ్య’లోను ‘ఆసియా-పసిఫిక్’ దేశాల కూటమిలోను మన దేశానికి సభ్యత్వం లభించకుండా చైనా అడ్డుకుంది. నిజానికి చైనా ప్రాబల్య ప్రకటనకు వేదిక అయిన ‘షాంఘయి సమాఖ్య’లో మనకు సభ్యత్వం అనవసరం. ‘పట్టుదారి’- సిల్క్‌రోడ్- పునరుద్ధరణ పథకం చైనా ఆధిపత్యానికి మరో మా ధ్యమం. ఈ పథకంలో చేరరాదని మన ప్ర భుత్వం ఇటీవల నిర్ణయించింది. అందువల్ల ‘షాంఘయి సమా ఖ్య’కు కూడ మనం దూరంగా ఉండడం మేలు. కానీ ఈ షాం ఘయి సమాఖ్య లో చేరిపోవాలని మన ప్ర భుత్వం తహతహలాడిపోవడానికి కా రణం ఉజ్‌బెకిస్థాన్, కఝక్‌స్థాన్, కిర్గీస్థాన్, తజకిస్థాన్ వంటి మధ్య ఆసియా దేశాలు ఈ ‘సమాఖ్య’లో ఉండడం. అందువల్ల రష్యా ప్రభుత్వం మనకు ఈ సంస్థలో సభ్యత్వం కల్పించడం ‘గొప్ప మేలు’గా ప్రచారం జరుగుతోంది. చైనా లేకుండా రష్యాను, మధ్య ఆసియా దేశాలను కలుపుకొని మనం విడిగా ‘ముంబయి సమాఖ్య’ను ఏర్పాటు చేసుకోవచ్చు. మధ్య ఆసియాతో వాణిజ్య సహకారం పెంపొందించుకోవచ్చు! కానీ ఇందుకు రష్యా బహుశా ఒప్పుకోదు. ‘పుతిన్ రష్యా’ చైనాకు గొప్ప నేస్తం. ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రం పాకిస్తాన్ ప్రభుత్వం. పుతిన్ ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్‌తో 2014 నవంబర్‌లో రక్షణ ఒప్పందం కుదుర్చుకొంది. పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండ మన దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌తో కలిసి రష్యా ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించింది. అందువల్ల రష్యా మనకు సహజ మిత్రదేశమని పీటర్స్‌బర్గ్‌లో మన ప్రధాని చెప్పడం కేవలం ‘ఔపచారిక’ పునరుద్ఘాటన..!
‘దర్శన పత్రం’లో అంతర్జాతీయ బీభత్సకాండను తీవ్రంగా నిరసించినప్పటికీ ‘ద్వంద్వ ప్రమాణాలు లేకుండా’ అన్న నిబంధనను చేర్చడం పుతిన్ విధానానికి అనుగుణం. అమెరికాను, ఐరోపా సమాఖ్యను వ్యతిరేకించడం పుతిన్ దీర్ఘకాల విధానం. అందువల్లనే ఆయన చైనాకు దగ్గరయ్యాడు. పాకిస్తాన్‌ను మచ్చిక చేశాడు. ఈ విధానాన్ని మనం ఎలా మార్చగలం?