సంపాదకీయం

‘ట్రంపు’ కంపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని అమెరికా తిరస్కరించడం ‘ప్ర పంచీకరణ’ కోటలు బీటలు వారుతున్నాయనడానికి మరో నిదర్శనం! ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించడానికి అనేక ఏళ్లపాటు ‘ప్రాబల్య దౌత్య’ దౌర్జన్యాన్ని నడిపిన అమెరికా ఇప్పుడు ‘ప్రపంచీకరణ’ విఘటనను కోరుకుంటోంది! ఇందుకు ప్రధాన కారణం చైనా ‘ఆర్థిక విస్తరణ’! పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ నుంచి తమ దేశం వైదొలగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించడం ప్రకంపనలను సృష్టిస్తోందట.. సృష్టిస్తోందన్న ప్రచారం మొదలైంది! అమెరికా నిష్క్రమణ వల్ల పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలో చైనాకు ఎదురు లేకుండా పోతుంది! ఇదీ మన దేశాన్ని కలవరపరచదగిన అంశం! ‘అమెరికా తోక ముడిచిన తోడేలు..’ అన్నది ట్రంప్ నిర్ణయం ద్వారా మరోసారి ధ్రువపడింది! ‘చైనా దూకుతున్న తోడేలు..’ ఇదీ మన దేశాన్ని ప్రభావితం చేయనున్న అంతర్జాతీయ వైపరీత్యం! 2015లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కుదిరిన ‘అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ’ ఒప్పందం నిజానికి అమెరికాపై చైనా సాధించిన వ్యూహాత్మక విజయం! ఈ సంగతిని ట్రంప్ ఆలస్యంగా గ్రహించాడు! వ్యక్తిగత దురహంకారం, శే్వత జాతీయ దురతిశయం నిండిన డొనాల్డ్ ట్రంప్‌కు మన దేశం పట్ల కల విద్వేష భావం ఆశ్చర్యకరం కాదు! అందువల్ల తన ప్రధాన ఆర్థిక వాణిజ్య వ్యూహాత్మక ప్రత్యర్థి అయిన చైనాతోపాటు ట్రంప్ మన దేశానికి వ్యతిరేకంగా వి షం కక్కాడు! అంతర్జాతీయ కాలుష్యం అతిగా ‘పెంచిన’ చైనా కాలుష్యం ‘పంచని’ మన దేశంతోపాటు అమాయకత్వాన్ని అ భినయిస్తుండడం ‘పా రిస్ ఒప్పంద’పు అం తర్నాటకం! తోడేళ్లతో కలిసి తరుముతున్న చైనా కుందేళ్లతో కలిసి పారిపోతున్నట్టు అభినయిస్తుండడం జరిగిపోతున్న అంతర్నాటకం! ప్రపంచాన్ని ముంచెత్తుతున్న మొత్తం కర్బన కాలుష్యం- బొగ్గుల పొగ-లో ఇరవై తొమ్మిది శాతం చైనా నుండి వెలువడుతోంది! అమెరికా నుంచి పదిహేడు శాతం కర్బన కాలుష్యం వెలువడుతోంది. మన దేశం నుంచి వెలువడుతున్న కర్బన కాలుష్యం కేవలం ఆరు శాతం! అందువల్ల తమ దేశం కంటే దాదాపు తొంబయి శాతం అధికంగా ‘కర్బన ద్వి ఆమ్ల వాయువు’-కార్బన్ డై ఆక్సయిడ్ -సిటువో-ను వెదజల్లుతున్న చైనా ‘పారిస్ ఒప్పందం’ వల్ల అక్రమ లాభం పొందుతున్నట్టు ట్రంప్ ఆరోపించడంలో వాస్తవం ఉంది! కానీ తమ దేశం పంచుతున్న కాలుష్యంతో పోల్చినప్పుడు మూడవవంతు స్థాయిలో మాత్రమే ఈ ’బొగ్గుల వాయువు’ వెలువడుతున్న మనదేశాన్ని కూడ ట్రంప్ ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నాడు?? ‘ఉద్యోగాల’ సమస్య కారణం!!
చైనాలోను, అమెరికాలోను కర్బన కాలుష్యాలను వెదజల్లుతున్న పరిశ్రమలు మూతపడాలి లేదా కాలుష్యాన్ని శుద్ధి చేసే వ్యవస్థలను నెలకొల్పాలి! కానీ తమ దేశం బొగ్గు ఉత్పత్తులను నిలిపివేయడానికి అంగీకరించిందని కానీ చైనా మాత్రం బొగ్గును ఉత్పత్తి చేస్తోందని బొగ్గుతో నడిచే పరిశ్రమలను విరివిగా నెలకొల్పుతోందని ట్రంప్ చెప్పాడు! బొగ్గు పరిశ్రమలను ప్రారంభించడం మానివేసినట్టు చైనా చెబుతోంది! కొత్త పరిశ్రమలను ప్రారంభించకపోవచ్చు. కాని 2015 నాటికి ఉన్న పరిశ్రమల వల్లనే చైనా నుండి మొత్తం ప్రపంచ కర్బన కాలుష్యంలో ఇరవై తొమ్మిది శాతం వెలువడుతోంది! ఈ కర్బన కాలుష్యం స్థాయిని తగ్గించడానికి గత రెండేళ్లలో చైనా ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలా లేదు! అమెరికాది కూడ ఇదే ‘వరుస’. దాదాపు పదిహేను ఏళ్లు అమెరికా చైనాలు కాలుష్యాన్ని పెంచడంలో తోడుదొంగలు! ఇప్పుడు ఉభయ దేశాల మధ్య వైరుధ్యాలు ఏర్పడడానికి కారణం ‘ప్రపంచకరణ’...
మన దేశం కాలుష్య నిరోధక నిధుల కోసం సంపన్న దేశాల వద్ద బిచ్చమెత్తుతోందన్నది ట్రంప్ మనకు వ్యతిరేకంగా చేసిన అవమానకరమైన ఆరోపణ! అంతేకాని మన దేశం కాలుష్యాన్ని పెంచుతోందని కాని, నిరోధక చర్యలు తీసుకోవడం లేదని కాని ట్రంప్ ఆరోపించలేదు! మన దేశంలో 2020 నాటికి బొగ్గు ఉత్పత్తి రెట్టింపు అవుతుందని మాత్రమే ట్రంప్ చెప్పాడు! మనదేశం సహా ప్రవర్ధమాన దేశాలు బొగ్గును ఉత్పత్తి చేయడంపై పారిస్ ఒప్పందం నిషేధం విధించలేదు! ఈ ఉత్పత్తివల్ల కాలుష్యాన్ని విస్తరించకుండా నిరోధక చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ చర్యలను చేపట్టడం కోసం సంపన్న దేశాల ప్రభుత్వాలు వర్ధమాన దేశాలకు నిధులను సమకూర్చాలన్నది పారిస్ ఒప్పందంలోని నిబంధన! ఈ నిబంధనకు అనుగుణగా అమెరికా చైనాలు ఎన్ని నిధులు సమకూర్చాయి? ఈ నిధుల విషయమై పొంతనలేని ఆరోపణలు,అసత్యా లు, అర్ధసత్యాలు ప్ర చారమవుతున్నాయి. ‘బిచ్చమెత్తుతున్నట్టు’ ఆరోపిస్తున్న అమెరికా మన దేశానికి గత రెండేళ్లలో ‘ఆరువందల యాబయి కోట్ల రూపాయల’ను కాలుష్య నిరోధక విరాళం ఇచ్చింది. కేవలం గంగానదీ ప్రక్షాళనానికి రెండువేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్న మన ప్రనుత్వం ఈ ‘విదేశీయ భిక్ష’ను ఉదారంగా వదులుకోవడం మేలు! దశాబ్దుల తరబడి బ్రిటన్ సైతం ఇలా ‘బిచ్చం’ పెట్టి మనలను అవమానించింది! ‘చిట్టెడు బియ్యం తెచ్చిన బియ్యమ్మ చేటెడు అన్నం ఆరగించినట్టు’గా సంపన్నదేశాలు కా లుష్య నిరోధక విరాళాలు ఇస్తున్నాయి. అమెరికా నుండి ఐరోపా నుంచి చైనా నుంచి మనం అక్కరలేని దిగుమతులను తగ్గించుకున్నట్టయితే సాలీనా సగటున రెండు లక్షల కోట్ల రూపాయల విదేశీయ వినిమయ ద్రవ్యం-్ఫరిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- మన ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఇంతకు ఐదు రెట్ల ఆదాయం దేశ ప్రజలకు మిగిలిపోతుంది
కర్బన కాలుష్య వాయువు బొగ్గును కాల్చడం వల్ల కంటే అధికంగా పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలవల్ల, ప్లాస్టిక్ సంచుల వల్ల ఏర్పడుతోంది! చైనా విచ్చలవిడిగా జరిపిన తవ్వకాల వల్ల విస్తరించిన కాలుష్యం వేడికి హిమాలయాలు కరిగిపోతున్నాయి. ప్రపంచీకరణ ద్వారా తమ దేశాల సంస్థలు వర్ధమాన దేశాలను భారీగా దోచుకోగలవని అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు భావించాయి. 2005 నుంచి చైనా సంస్థలు ఈ దోపిడీలో అగ్రగాములయ్యాయి. అందువల్లనే ప్రపంచీకరణ నుంచి బయట పడాలని ట్రంప్ భావిస్తున్నాడు. ‘పారిస్ ఒప్పందం’ ఆరంభం...!