సంపాదకీయం

గగన ‘సమృద్ధి’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపూర్ణ స్వదేశీయ పరిజ్ఞాన రూపమైన ‘క్రయోజనిక్ ఇంజన్’ విజయం సాధించింది. భూ మి చుట్టూ మరో ఉపగ్రహం తిరగడం మొదలు కావడం భారతీయ అంతరిక్ష పరిశోధన చరిత్రను మ రింత సముజ్వలం చేసిన శాస్ర్తియ పరిణామం! చం ద్రునికి మరో ‘సహచరుడు’ లభించడం కలియుగం 5119వ సంవత్సరం, హేమలంబ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, సోమవారం నాడు సంభవించిన శుభంకర పరిణా మం! ‘జి సాట్-19’ అన్న ఈ ఉపగ్రహం సా యంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిముషాలకు ‘జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-త్రీ-డి-వన్’ అంతరిక్ష నౌకనెక్కి ఊర్ధ్వ ముఖ ప్రస్థానం ఆరంభించింది. పదహారు నిముషాల ఇరవై సెకండ్ల తరువాత భూ సమాంతర కక్ష్యలోకి ప్రవేశించి భూపరిక్రమను ఆరంభించింది! మూడు టన్నుల నూట ముప్పయి ఆరు కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహం ఇంతవరకు మన శాస్తవ్రేత్తలు రూపొందించిన ఉపగ్రహాలలో అతి పెద్దది కావడం సోమవారం నాటి ప్రయోగం సాధించిన ఘనత! ఈ ఉపగ్రహం పయనించిన అంతరిక్ష నౌక ఆరు వందల నలబయి టన్నుల బరువు ఉండడం మరో ఘనత!
ఈ భూ సమాంతర ఉపగ్రహ వాహక నౌక-జిఎస్‌ఎల్‌వి-జియో సింక్రనైజ్డ్ లాంచ్ వెహికల్-స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మాణమైన ‘క్రయోజెనిక్ ఇంజన్’ల సహాయంతో దూసుకుని వెళ్లడం అభూతపూర్వ పరిణామం. ఈ క్రయోజెనిక్-స్వయం శీతలీకరణ-పరిజ్ఞానాన్ని స్వయంగా తయారు చేసుకొనడానికి మన శాస్తవ్రేత్తలు దాదాపు ము ప్పయి ఏళ్లు కృషి చేయవలసి వచ్చింది! ఈ పరిజ్ఞానం మనకు లభించకుండా తథాకధిత -సోకాల్డ్- అగ్రరాజ్యాలు అడ్డుపడడం ప్రచారం కాని దశాబ్దుల వైపరీత్యం. అ మెరికా ఆంక్షలు విధించినప్పటికీ, రష్యా వా గ్దాన భంగం చేసినప్పటికీ అడ్డంకులను అధిగమించి, స్వదేశీయ పరిజ్ఞానంతో ‘స్వయం శీతలీకరణ చోదక యంత్రాన్ని- క్రయోజెనిక్ ఇంజన్ -నిర్మించగలిగిన మన శాస్తవ్రేత్తలు చరితార్థులు, ఆర్యభట్టునకు అనుంగు సోదరులు, వరాహ మిహిరుని వారసులు. భరత మాత వజ్రాల బిడ్డలు! సోమవారం నాటి గగన విజయంతో మన దేశం ‘స్వయం శీతల భౌతిక విజ్ఞాన’ ప్రక్రియను రూపొందించగల ఆరవ ‘అంతరిక్ష శక్తి’గా ఎదిగింది! అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనా, జ పాన్, రష్యా దేశాలు మాత్రమే ఇంతవరకు ‘క్రయోజెనిక్ ఇంజన్‌ల’ను నిర్మించగలిగాయి. ఆరవది మన దేశం. తాము నిరోధించదలచిన అంతరిక్ష విప్లవాన్ని మన దేశం సాధించడం అగ్రరాజ్యాల గుండెలలో అసూయాభయాల విస్ఫోటనం..
అత్యధిక ఉష్ణోగ్రతను చల్లార్చడం ద్వారా ఆవిరి రూపంలోని ఇంధనాన్ని ద్రవీకృతం చేసి చోదకశక్తిగా మార్చడం ‘క్రయోజెనిక్’ ప్రక్రియ! రెండు వందల యాబయి ఎనిమిది సెంటీగ్రేడ్ డిగ్రీల స్థాయికి వేడెక్కిన హైడ్రోజన్ వాయువును, నూట ఎనబయి ఐదు సెంటీగ్రేడ్ డిగ్రీల వేడిగల ఆక్సిజన్‌ను మిశ్రమం చేసి చల్లార్చడం ద్వారా చోదక ఇంధనాన్ని సమకూర్చడం క్రయోజెనిక్ ప్రక్రియ! సామాన్యులకు అర్థమయ్యేది ఇంతవరకే! ఇలా ‘చల్లార్చే ప్రక్రియ’ కేవలం చోదకశక్తి-ప్రొఫెల్లింగ్ ఫ్యూయల్-ను సమకూర్చడానికి మాత్రమే కాదు, ఉపగ్రహ వాహక నౌక- రాకెట్- అమిత వేడికి తట్టుకొనలేక విచ్ఛిన్నం కాకుండా నిరోధించడానికి సైతం దోహదం చేస్తుంది! ఇలా అమిత వేడిని చల్లపరిచే ‘కృత్రిమ వర్ష మేఘం’ వలె క్రయోజెనిక్ ప్రక్రియ అంతరిక్ష నౌకను పరిరక్షించి పైపైకి నడిపిస్తోంది! ఇంతవరకు ఈ ‘క్రయోజెనిక్ ఇంజన్’ల తరహా యంత్రాలను మన శాస్తవ్రేత్తలు రష్యా నుంచి సమకూర్చుకున్నారు. కాని అవి నిజానికి ‘సమగ్రమైన‘ శీతలీకరణ చోదకశక్తి యంత్రాలు కావు! రష్యా సరఫరా చేయడానికి అంగీకరించిన పరిజ్ఞానం వేఱు, సరఫరా చేసిన ‘ఇంజన్’ల పరిజ్ఞానం వేఱు.. రెండూ ఒకటేనని రష్యా వాదించిందట! ఈ ‘మీమాంస’ తెగలేదు! రష్యా మాట తప్పి కేవలం పరికరాలను సమకూర్చి పరిజ్ఞానానికి సున్న చుట్టినట్టు అనధికారకంగా ప్రచారమైంది.!
ముప్పయి ఏళ్లపాటు విదేశాల వారు మన దేశానికి ‘క్రయో’ పరిజ్ఞానం లభించకుండా నిరోధించడం ఆయా దేశాలకు మన దేశం పట్ల భయానికి నిదర్శనం! ‘సహాయం’ చేస్తే మనం తమకంటే ఎత్తులకు ఎదగడం ఖాయమని ఆ దేశాలకు తెలుసు! పేరుకు మాత్రమే ‘సహకారం’.. అమెరికా, ఐరోపా, రష్యాలు అధిక లాభాలను గుంజుకునేందుకు మాత్రమే యత్నించాయి, యత్నిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ ‘క్రయో’ పరిజ్ఞానం మనకు బదిలీ కాకుండా దశాబ్దికి పైగా ఆంక్షలను విధించింది. అందువల్ల ‘గొప్ప మిత్రదేశమైన’ సోవియట్ యూనియన్ అధిక ధరలకు ఈ పరిజ్ఞానాన్ని మనకు అమ్మడానికి క్రీస్తుశకం 1980వ దశకంలో అంగీకరించిందట. 1991లో కమ్యూనిస్టు సోవియట్ రష్యా అంతరించింది, పదిహేను దేశాలుగా విడిపోయింది. ‘సోవియట్ యూనియన్’ దౌత్య వారసత్వం ప్ర జాస్వామ్య ర ష్యాకు లభించింది. కానీ రష్యా ‘ఒప్పందాన్ని’ అమలు జరపడానికి నిరాకరించింది! ‘ఐరోపా’ వారు ‘క్రయో’ పరిజ్ఞానాన్ని సమకూర్చడానికి అంగీకరించినప్పటికీ భయంకరమైన ధరను నిర్ణయించడంతో మన ప్రభుత్వం కొనలేకపోయిందట! రష్యాతో కొత్త ఒప్పందం కుదిరినప్పటికీ రష్యా పరోక్షంగా వంచించింది. పరికరాల-హార్డ్‌వేర్-ను మాత్రమే సమకూర్చి ‘పరిజ్ఞానం-సాఫ్ట్‌వేర్-బదిలీ చేయకుండా మొండికేసింది! ఏడు ఇంజన్లను మాత్రం రష్యా మనకు అమ్మింది! మనం శాశ్వతంగా తమ వద్ద అంతరిక్ష చోదక యంత్రాల-ఇంజన్‌ల-ను కొంటూ ఉండాలన్నది రష్యా వ్యూహం కావచ్చు! ముప్పయి ఏళ్లపాటు ఈ ‘సంఘర్షణ’ కొనసాగింది. సమాంతరంగా మన పరిశోధన కొనసాగడం మన శాస్తవ్రేత్తల విశ్వాసానికి, జాతీయ స్వాభిమానానికి నిదర్శనం. ‘్భరతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ’-ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో-వారి సడలని దీక్షకు నిదర్శనం!
సోమవారం నాటి ప్రయోగం ఈ విశ్వాసానికి విజయం, సడలని వ్రతదీక్షకు అంతరిక్షంలో వికసించిన స్వాభిమాన కేతనం! విజ్ఞాన ప్రదానం చేసే మన సంప్రదాయం ఇది వరకే మళ్లీ మొదలైంది! అమెరికా వారి ఉపగ్రహాలను సైతం మనం అంతరిక్షంలో చేర్చాము! ‘దక్షిణాసియా’ ఉపగ్రహాన్ని రూపొందించి అంతరిక్షంలోకి పంపడం ద్వారా ‘పొరుగు మైత్రి’కి పాదు చేయగలిగాము! ఈ సంప్రదాయ సంస్కారం ఆర్యభటుని నాటిది, వరాహ మిహిరుని విజ్ఞాన పరంపర ఇది..