సంపాదకీయం

‘కల్తీ’ బతుకులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైతిక నిష్ఠ నశించిపోతుండడం వౌలిక సమస్య. ఇలా నశించిన కారణంగా మన సంస్కృతి అక్రమ వాణిజ్యంతో కల్తీ అయిపోయింది! ఈ స్వ భావ సాంకర్య ప్రభావం విస్తరిస్తున్న కొద్దీ మన జాతీయ జీవనం మరింతగా విషపూరితం అవుతోంది! నెయ్యి కల్తీ అయింది, నూనె కల్తీ అయింది, పప్పులు, పోపులు, మసాలాలు, పాలు, కూరగాయలు సమస్త ఆహారం కల్తీ అయిపోయింది. ‘ప్లాస్టిక్’ విష పదార్థాలతో తయారయిన బియ్యం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని విపణి వీధులను ముంచెత్తుతున్నాయన్నది ఈ ‘సాంకర్య’ చరిత్రలో ప్రస్తుతానికి పరాకాష్ఠ! ‘ప్లాస్టిక్’తో బియ్యం తయారు చేయడం నకిలీ ఉత్పత్తిదారునికి లాభసాటి వ్యాపారం కాదన్న ప్రచారం కూడ సమాంతరంగా పుంజుకొంది! ఇది నిజమా? లేక ప్రచారం కూడ ‘కల్తీ’ అయిపోయిందా? ఏది నిజం?? ‘కల్తీ’ని నిపుణులు తప్ప సామాన్యులు కనిపెట్టలేని స్థాయికి ‘రసాయన విజ్ఞానం’ ఎదిగిపోవడం ప్రధాన సమస్య! పాలు, నెయ్యి, నూనె, కూరగాయలు, బియ్యం, పండ్లు కొనుక్కునే సామాన్యునికి ఏది కల్తీ సరకు? ఏది సహజమైనది?-అన్న పరిజ్ఞానం లేదు! ‘కల్తీ’లు బయటపడినపుడల్లా ‘కల్తీ’ని కఠినంగా అణచివేస్తామని గాండ్రించి గర్జించి ఘీంకరించే ప్రభుత్వాలు జనానికి ‘కల్తీ‘ గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నించిన జాడ దశాబ్దులుగా లేదు! ప్రయోగశాలకు వెళ్లి పరీక్షలు జరిపించడం ప్రతి వినియోగదారునికి ఎలా సాధ్యం? బియ్యంలో సహజమైన మట్టిబెడ్డలు, రాళ్లు, ‘ఊదర్లు’, వంటి కలుపు గింజలు కనిపిస్తే సామాన్యులు కల్తీని కనిపెట్టగలరు! బియ్యం చెడిపోకుండా విషాలు నిండిన రసాయనాలను బస్తాలపై చల్లుతున్నారు, బస్తాలలో కలుపుతున్నారు! ఇలా కలిపినట్టు ‘సం చుల’పై వ్రాసి ప్రకటించినట్టయితే వినియోగదారులు ఆ బియ్యాన్ని నాలుగైదుసార్లు నీటిలో కడిగి కాలుష్యముక్తం చేయగలరు! కానీ వ్యాపారులు ఆ సంగతి చెప్పరు! పచ్చి బియ్యమా? ఆవిరి పట్టిన బియ్యమా? అన్న తేడా ఎంతమందికి తెలుసు? ఇలా మొదలైన ‘కల్తీ’ క్రమంగా రూపుమార్చుకుని విస్తరిస్తోంది! చివరికి మొత్తం బియ్యమే మారిపోయి, పొలం నుండి కాక ‘ప్లాస్టిక్’ బట్టీల నుంచి ‘బియ్యం’ తరలి వస్తున్నాయి. మన దేశంలోని సకల విధమైన ‘కల్తీ’లకు మూల కారణం చైనానుంచి దిగుమతి అవుతున్న విష రసాయనాలు.. ‘చైనా పౌడర్’ అన్నది కల్తీ ప్రపంచంలో ‘కుఖ్యాత’మైపోయింది. ఈ ‘చైనా పౌడర్ల’ దిగుమతిని నిషేధించడం సులభం! ఆపని చేయని ప్రభుత్వాలు గల్లీ గల్లీ తిరిగి దుకాణాలలోని ‘బియ్యం’ ఎలా పరిశీలించగలవు? ప్లాస్టిక్ బియ్యం చైనానుంచి కూడ దిగుమతి అయిపోతున్నాయట!
విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నకొద్దీ ప్రాణాంతకమైన కల్తీ సామగ్రి అందుబాటులోకి వస్తోంది! పాలలో నీళ్లను కలపడం, నెయ్యిలో నూనెలు కలపడం, వెన్నలో బియ్యం పిండిని కాని మినప పిండిని కాని అరటిపండ్ల గుజ్జును కాని కలపడం దశాబ్దుల పూర్వం మాట! తేనెలో బెల్లం కలిపేవారట, ఈత గింజలను చింత గింజలను దంచి గోధుమ పిండిలోను, కాఫీ పొడిలోను కలిపేవారట, మిరియాలలో బొప్పాయి విత్తనాలను కలిపేవారట! కల్తీ పరికరాలు, అసలు పదార్థాలు కూడ ప్రాకృతికమైనవి. అందువల్ల అసలు ఆహార పదార్థాల ప్రమాణాలు తగ్గినప్పటికీ ఈ కల్తీల వల్ల ప్రాణాలు పోయేవి కావు! కాని ‘విష రసాయనాల’ ఆవిష్కరణ జరిగిన తరువాత ‘కల్తీ’ ప్రాణాలను తీస్తోంది! ‘విజ్ఞానం’ మాత్రమే పెంచుతున్న వ్యవస్థలు, విద్యలు నైతిక నిష్ఠను, జీవన మూలాలను తుంచి వేయడం దశాబ్దుల అధోగతి. అందువల్లనే ‘విజ్ఞానం’తో ప్రాణాలు తీయడానికి వెనుకాడని పైశాచికత్వం, పాశవికత్వం, రాక్షసత్వం, బీభత్స స్వభావం మానవ చిత్తవృత్తిని ఆవహించాయి, నడిపిస్తున్నాయి! పండ్లమీద ‘చైనా పౌడర్’ చల్లి రంగుమార్చడం, ఆ పండ్లను తిన్న వారు క్రమంగా కాన్సర్ వంటి భయంకర వ్యాధులకు గురి అవుతున్నారని ఈ ‘పౌడర్’ను వాడుతున్న వారికి తెలుసు. ఇలాంటి వాటిని వాడుతున్న వారికి తెలుసు! అయినా వారు, అక్రమ వ్యాపారులు, వాడడం మానరు.. జనం బతుకులు ఏమయితేనేమి?-అన్నది వ్యాపార దౌత్య ప్రవృత్తి, వికృత చిత్తవృత్తి! ‘కల్తీ’ జరుగుతున్నది ప్రధానంగా మన మనసులలో...
‘కల్తీ’ పాల వ్యాపారులతో పొలీసులు కుమ్మక్కయిపోతున్నారు. ‘కల్తీ’ పండ్ల వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయిపోతున్నారు, ‘మాగీ’ వంటి సేమ్యాలను,‘పెప్సీ’ వంటి పానీయలను, ఐస్‌క్రీమ్‌లను, చాక్లెట్లను కల్తీ చేస్తున్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ యజమానులతో రాజకీయ వేత్తలు కుమ్ముక్కయిపోయారు! ‘బాసిలస్ తురింజెన్సిస్’- బిటి-వంటి జీవ రసాయన విషాలను ఉత్పత్తి చేస్తున్న జన్యు పరివర్తక -జెనటిక్ మోడిఫికేషన్- మహా సంకర సస్యాల ఉత్పత్తిదారులతో ప్రభుత్వాలు కుమ్మక్కయిపోతున్నాయి! ఈ దేశ ప్రజల బతుకులు కల్తీ కా లుష్య వలయంలో బందీ అయిపోయి ఉ న్నాయి! అందువల్ల అది ‘కల్తీ’ అయింది, ఇది ‘కల్తీ’ అయింది అ ని చిటపటలుగా పుటపుటలుగా ప్రచారం అ వుతున్న వార్తలను జ నం వింటున్నారు, వి స్మయ గ్రస్తులైపోతున్నారు, మరిచిపోతున్నారు! ప్రభుత్వ యంత్రాంగం కూడ ‘పాపం’ ఎంతకాలమని గుర్తుపెట్టుకుంటాయి? అందువల్ల తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ‘కల్తీ’ పాలు ప్రతిరోజు సరఫరా అయిపోతున్నాయి! పాలు కాచిన వెంటనే కొన్ని సందర్భాలలో ‘కల్తీ’ బండారం బయటపడుతోంది! మరి కొన్ని సందర్భాలలో ఆ పాలు పెరుగుగా మారగానే చిత్ర విచిత్రమైన వాసన వస్తోంది! పెరుగు తీగెలు తీగెలుగా ఉంటోంది. వర్ణింప వీలు కాని పద్ధతిలో వెగటు కలిగిస్తోంది! కానీ లక్షలాది గృహస్థులు ఈ ‘కల్తీ’కి అలవాటు పడిపోయారు! ఫిర్యాదులు ఎవరు చేస్తున్నారు? ఎవరికి??
ప్లాస్టిక్ బియ్యం సంగతి ఇప్పుడు ప్రచారమవుతోంది. ఆలుగడ్డలు-బంగాళా దుంపలతోను, ప్లాస్టిక్ వ్యర్థాలతోను ఈ బియ్యం తయారవుతున్నాయన్నది ‘కల్తీ’ సమాచారంలో కొంత భాగం మాత్రమే! ‘ప్లాస్టిక్’ సంచులను ప్రభుత్వాలు, స్థానిక సంస్థల అధికారులు పదే పదే నిషేధిస్తున్నారు. ప్లాస్టిక్ సంచుల వినిమయం నానాటికీ విస్తరిస్తూనే ఉంది! ఇది ప్రతిక్షణం కనబడుతున్న ‘కల్తీ!’ దీన్ని నిరోధించలేని ప్రభుత్వాలు కనబడని ‘కల్తీ’ని ఎలా నిషేధించగలవు? ఎలా నిర్మూలించగలవు? ఇళ్లలో తయారు చేస్తున్న అన్ని రకాల మిఠాయిలలోను, పులిహోర చిత్రాన్నం వంటి ఆహారాలలోను గృహస్థులు ‘రసాయనాలను’ కలుపుతున్నారు- రంగుల కోసం, రుచి కోసం! పువ్వులు లేవు, ప్లాస్టిక్ పువ్వులు ఆకర్షిస్తున్నాయి..