ప్రకాశం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియస్ పురం, జూన్ 25: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు నివాసగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలో 2016 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన మినుము, కంది పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం కింద 14.25కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఆయన తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో 7.134 హెక్టార్ల మినుము, కంది పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కనిగిరి నియోజకవర్గంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరగా రైతుల సమస్యలపై స్పందించిన ఆయన రైతులను ఆదుకునేందుకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కనిగిరి మండలంలో 2,339మంది రైతులకు 2కోట్ల33లక్షల 93వేల రూపాయలు, పామూరు మండలంలో 2,265మంది రైతులకు 2కోట్ల54లక్షల 89వేలు, వెలిగండ్ల మండలంలో 3,085మంది రైతులకు 3కోట్ల76లక్షల 47వేలు, హెచ్ ఎంపాడు మండలంలో 3,898రైతులకు 4కోట్ల5లక్షల 75వేలు, సియస్‌పురం మండలంలో 1,345మంది రైతులకు 78లక్షలు, పిసిపల్లి మండలంలో 636మంది రైతులకు 77లక్షల రూపాయల నష్టపరిహారం విడదలైనట్లు ఆయన తెలిపారు. నష్టపరిహారం మంజూరైన రైతులకు త్వరలో సంబంధింత బాండ్లను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. గతంలో ఏప్రభుత్వం చేయని విధంగా ఒక్కో ఎకరానికి 4వేల రూపాయల వంతున నష్టపరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా రైతు రుణమాఫీ కింద కనిగిరి నియోజకవర్గంలో 149కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం సబ్సిడీ కింద ట్రాక్టర్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులను అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈసమావేశంలో టిడిపి నాయకులు సిహెచ్ నాగయ్య, సిహెచ్ సుబ్బయ్య, పివిఎస్ ప్రసాద్, పావలి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.