సంపాదకీయం

‘మానస’ యాత్రకు అవరోధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత జరిగినట్టు ప్రచారం అవుతున్నప్పటికీ మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వౌనం వహించి ఉండడం అంతుపట్టని వ్యవహా రం. దురాక్రమణ సాగిస్తున్న చైనా ప్రభుత్వం మాత్రం పైశాచిక స్వరంతో అబద్ధాలను ప్రచారం చేస్తోంది, మన దేశంపై అభాండాలను వేస్తోంది. వాస్తవాలను ప్రచారం చేయడం కంటే చైనా వారి అబద్ధాలకు మన దేశంలోని కొన్ని పత్రికలు అధికప్రాధాన్యం ఇస్తుండడం జనానికి అర్థం కాని వ్యతిరేక పరిణామం. ‘కైలాస పర్వత-మానస సరోవ రం’ యాత్రకు వెడుతున్న మన యాత్రికులను సిక్కింలోని ‘నాథులా’ కనుమ మార్గం వద్ద చైనా దళాలు అడ్డగించడం, యాత్రను రద్దు చేస్తున్నట్టు చైనా ప్రకటించడం జరిగిన విపరిణామం! దీన్ని ‘ప్రాధాన్యం’తో ప్రచారం చేయవలసిన బాధ్యత మాధ్యమాలది. కొన్ని పత్రికలు దృశ్య మాధ్యమ స్రవంతుల వారు ఈ బాధ్యతను నిర్వహిస్తున్నా యి. కానీ మరికొన్ని పత్రికలు ‘యాత్రికులను అడ్డగించడంలో ఔచిత్యాన్ని’ వివరించిన చైనా వారి అబద్ధాలకు, మన ప్రభుత్వంపై చైనా వేస్తున్న నిందలకు బహుళ ప్రాచుర్యం కల్పిస్తున్నారు! దోకలా ప్రాంతంలో సిక్కింలోకి చొరబడిన చైనా దళాలు -పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పిఎల్‌ఏ- మన సైనిక స్థావరాలపై దాడులు చేయడం, కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేయడం ఆలస్యంగా బయటపడిన సమాచారం! అంతకు పూర్వం పదిరోజుల క్రితం జరిగిన ఈ చొరబాటు గురించి జూన్ ఇరవై ఆరవ తేదీన ప్రచారమైంది. ఈ చొరబాటును మన సైనికులు పదిరోజులుగా ప్రతిఘటిస్తున్నారు. ఈ ప్రతిఘటనకు ప్రతీకారంగా సిక్కింలోని నా థులా కనుమ మా ర్గం గుండా టిబెట్‌లోని ‘కైలాస మాన స సరోవరం’ సందర్శన యాత్రకు వెడుతుండిన యాబయి మంది మన దేశస్థుల ను చైనా దళాలు నిరోధించాయట! మరో మూడు వందల మంది యాత్రికులు కూడ ‘కైలాసం’ వైపు, ‘మానస సరోవరం’ వైపువెడుతున్న మార్గంలో పడిగాపులు పడి ఉన్నారట! పదిరోజులకు పైగా ‘చొరబాటు’ జరిపిన చైనా నోరు మెదపలేదు! కానీ చొరబాటును గురించి మన ప్రభుత్వం ఎందుకని వెల్లడి చేయలేదన్నది విచిత్రమైన వ్యవహారం! చొ రబాటు గురించి మాధ్యమాలలో ప్రచారమైన తరువాత రెండు రోజులు గడిచినప్పటికీ మన విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ ఇవ్వకపోవడం విచిత్రం కాదా? ఈలోగా మన దళాలు తమ భూభాగంలోకి చొరబడినట్టు చైనా ప్రభుత్వం బీజింగ్‌లో మంగళవారం అబద్ధాన్ని ప్రచారం చేసింది. ఈ ‘చొరబాటు’ ముగిసే వరకు ‘కైలాస యాత్ర’కు, ‘మానస’ యాత్రకు మన దేశస్థులను అనుమతించబోమని చైనా నిర్లజ్జగా ప్రకటించేసింది!
చైనా దురాక్రమణ వ్యూహం విస్తరిస్తోందనడానికి సిక్కింలోని చైనా దళాలు చొరబడడం సరికొత్త నిదర్శనం. దోకలా ప్రాంతం మన సిక్కిం భూటాన్‌లోను, టిబెట్‌లోను కలిసే చోట సిక్కింలో నెలకొని ఉంది. ఇక్కడ టిబెట్‌కు, మన దేశానికి మధ్య సరిహద్దు స్పష్టంగానే ఉంది! బ్రిటన్ దురాక్రమణ సమయంలో మన దేశపు ప్రధాన భూభాగం నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఉండిన సిక్కిం బ్రిటన్ నుంచి మన దేశం విముక్తమైన తరువాత 1974లో మళ్లీ మన దేశంలో కలిసింది. సిక్కిం ప్రజలు ముక్తకంఠంతో ఆమోదించిన తరువాతనే ఈ విలీనం జరిగింది. కానీ చైనా ప్రభుత్వం మన దేశంలో సిక్కిం విలీనాన్ని దాదాపు మూడు దశాబ్దులపాటు గుర్తించలేదు. ఆ తరువాత సిక్కిం మనదేశంలో భాగమని గుర్తించింది! ఇది జరిగిన తరువాత సిక్కింలోని నాథులా కనుమ మార్గం తిరిగి తెరుచుకుంది! 1962వ సంవత్సరంలో చైనా మన అరుణాచల్ ప్రదేశ్‌లో, లడక్‌లో దురాక్రమణ జరిపిన తరువాత నాథులా కనుమ మార్గం మూతపడింది! దాదాపు పదునాలుగేళ్లుగా నాథులా కనుమ మార్గం గుండా ‘సీమాంతర వాణిజ్యం’ జరుగుతోంది! అందువల్ల సిక్కింలోకి చైనా చొరబడడం సరికొత్త కవ్వింపు చర్య! లడక్‌కు, అరుణాచల్‌కు పరిమితమైన ఈ చొరబాట్లు సిక్కింకు కూడ విస్తరించడం చైనా దురాక్రమణ స్వభావానికి, దౌత్య దౌర్జన్యానికి విస్తరణ..
కైలాస, మానస సరోవర ప్రాంతాలకు మనం వెళ్లి రావడానికి చైనా ప్రభుత్వం వారి అనుమతి అనివార్యం కావడం మన జాతీయ చారిత్రక వి షాదం. ఇంటిగోడల వద్దకు గజదొంగలను చేర్చుకున్నట్టుగా, చైనాను మన ఉత్తర సరిహద్దులకు మన ప్రభుత్వమే తరలించుకొని వచ్చింది. ఈ ‘తరలింపు’ 1950 దశకం నాటి మన విదేశాంగ, వ్యూహాత్మక, రక్షణ విధానాల వైఫల్యాల ఫలితం! ఈ వైఫల్య విధాయకుడు అప్పటి మన ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ. దాదాపు రెండున్నర సహస్రాబ్దుల పాటు టిబెట్ స్వతంత్ర దేశం. టిబెట్ మన దేశానికి, చైనాకు మధ్య స్వతంత్ర దేశంగా నెలకొని ఉన్నంత కాలం మనకూ, చైనాకూ మధ్య సరిహద్దు లేదు. బర్మా మన దేశంలో భాగంగా ఉ న్న సమయంలో వే ల ఏళ్లపాటు మనకూ చైనాకూ మధ్య కే వలం రెండు వందల కిలోమీటర్ల సరిహ ద్దు ఉండేది. 1935లో బర్మా ను మన దేశం నుండి బ్రిటన్ ప్ర భుత్వం విడగొట్టిన తరువాత మనకు, చైనాకు మధ్య ఈ సరిహద్దు కూడ లేకుండా పోయింది. 1885లో ‘సింకియాంగ్’ను చైనా కలుపుకున్న తరువాత మన కశ్మీర్‌కు ఉత్తరంగా చైనా ఏర్పడింది. కానీ 1959లో టిబెట్‌ను చైనా దురాక్రమించిన తరువాతనే చైనాలో మనకు చరిత్రలో మొదటిసారి దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల అతి పెద్ద సరిహద్దు ఏర్పడింది! టిబెట్‌ను చైనా దురాక్రమించడాన్ని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలోని మన ప్రభుత్వం సమర్ధించడం ‘హిమాలయ మహాపరాధం’- హిమాలయన్ బ్లండర్! ఈ దురాక్రమణ కారణంగా ‘్భ రత-టిబెట్’ సరిహద్దు ‘్భరత-చైనా’ సరిహద్దుగా మారిపోయింది! ఇలా మారిన తరువాత మూడేళ్లు గడవక ముందే చైనా మన దేశంలో 1962లో దురాక్రమణ జరిపింది...
మన కైలాస పర్వతాన్ని, మన మానస సరోవరాన్ని మనం దర్శించుకోవడానికి చైనా అనుమతి అనివార్యం కావడం 1950వ దశకం నాటి మన ‘హిమాలయ మహాపరాధ’ ఫలితం! ‘కైలా సం’,‘మానస సరోవరం’ మన చరిత్రతో సంస్కృతితో ముడివడి ఉన్నాయి! ఇవి భారతీయులకు సహస్రాబ్దులుగా స్ఫూర్తి కేంద్రాలు! టిబెట్‌లో నెలకొని ఉన్న ఈ జంట క్షేత్రాల సందర్శనకు మనం నిర్నిరోధంగా వెళ్లి రావడం 1959 వరకు నడిచిన చరిత్ర. ఈ చరిత్రను చైనా చెరిచింది! మానస సరోవరంలో పుట్టి మన దేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిని కూడ చైనా నిరోధిస్తోంది..