సంపాదకీయం

ఆవుల వధ ఆగదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోసంతతి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమావళిని తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అమలు జరుపరాదని స ర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం విచిత్రమైన పరిణామం! ఈ తాత్కాలికమైన నిలిపివేత రా జ్యాంగం నిర్దేశిస్తున్న గో పరిరక్షణ, పాడిపశువుల పరిరక్షణ స్ఫూర్తికి విరుద్ధం! గతంలో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం గత మే నెలలో ఈ నూతన నియమావళిని రూపొందించింది! ఆ నియమావళిని సర్వోన్నత న్యాయస్థానమే మళ్లీ తాత్కాలికంగా నిలిపివేయడం సామాన్య ప్రజలకు అంతుపట్టని వ్యవహారం. వధించడం కోసం సంతలలో ఆవులను, దూడలను, కోడెలను, ఎద్దులను కొనుగోలు చేయరాదని, అమ్మరాదని నిర్దేశిస్తూ గత మే నెల 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం నియమావళిని జారీ చేసింది. పశువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించడానికి వీలుగా ‘పశువుల సంతల’ కలాపాలను నియంత్రించడం ఈ నియమావళికి ప్రాతిపదిక! గోసంతతిని మాత్రమే కాక గేదె-బర్రె, ఎను ము-లను, ఒంటెలను కూడ వధశాలలకు తరలించే నిమిత్తం సంతలకు తోలరాదన్నది మే నెలలో జారీ అయిన నియమావళిలోని నిబంధన! ఈ ‘నియమావళి’ని సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలపివేయడం వల్ల గోవధ, పశువధ యథాపూర్వకంగా జరిగిపోగలదు.. రాజ్యాంగ స్ఫూర్తి ఏమయినట్టు? ఈ నియమావళిని దేశంలోని వివిధ ఉన్నత న్యాయస్థానాలలో వివిధ సంస్థలు, వ్యక్తులు సవాలు చేసారు. అం దువల్ల వివిధ రకాలైన తాత్కాలిక ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉందట. ఈ కారణంగా దేశానికంతటికీ వర్తించగల సర్వోన్నత న్యాయాదేశం అనివార్యం అ యిందట! అటువంటప్పుడు విచారణ పూర్తయ్యేవరకు నియమావళి అమలు జరపవచ్చన్న తాత్కాలిక ఆదేశాన్ని సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసి ఉండవచ్చు! అలా జరగలేదు! ఎప్పటికైనా దేశమంతటా సర్వసమగ్రంగా గోవధ నిషేధం అమలు జరగాలని రాజ్యాంగంలోని నలబయి ఏడవ అధికరణంలో నిర్దేశించారు! కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమావళి ‘సమగ్ర గోవధ నిషేధం’ విధించలేదు. అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం నియమావళి అమలును నిలిపివేసింది. గోజాతికి దిక్కెవ్వరు?
కేంద్ర ప్రభుత్వం ఈ నియమావళిని తనంత తానుగా రూపొందించలేదు. గో సంతతి పట్ల, పశువుల పట్ల నిర్దయను నిరోధించాలని కోరుతూ 2014లో ‘పీపుల్స్ ఫర్ యానిమల్స్’-జంతుమిత్రులు -అన్న సంస్థ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయ యాచికను దాఖలు చేసింది. ఈ ‘పిటిషన్’ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ‘పాడిపశువుల అక్రమ రవాణా’ను నిరోధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిరోధించడానికై మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించాలని కూడ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిది. మంత్రివర్గం ఉపసంఘం సూచనల మేరకే కేంద్రం మే నెలలో నూతన నియమావళిని రూపొందించింది! సంతలలో కొనే, అమ్మే గోసంతతిని వధించరాదన్నది ఈ నియమావళి.. దీన్ని వివిధ న్యాయస్థానాల్లో సవాలు చేయడం తదుపరి పరిణామం! అయితే కేరళ హైకోర్టు ఈ నిమమావళిని నిలిపివేయడానికి అంగీకరించలేదు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు సూచించింది కూడ! మద్రాసు ఉన్నత న్యాయస్థానానికి చెందిన మధురై న్యాయపీఠం మాత్రం కేంద్ర ప్రభుత్వ నియమావళిని తాత్కాలికంగా రద్దు చేసింది! ఈ నేపథ్యంలో మధురై న్యాయపీఠం నిర్ణయాన్ని మంగళవారం సుప్రీం కోర్టు కూడ సమర్ధించింది! ఇది విడ్డూరం. ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించవలసిందిగా ఆదేశించింది సుప్రీం కోర్టే. ఒకవేళ తాము ఈ నియమావళిని రూపొందించకపోయినట్టయితే, ‘ఎందుకు రూపొందించలేదని సర్వోన్నత న్యాయస్థాన తమను ప్రశ్నించవచ్చు’ అన్న భయంతోనే కేంద్రభ్రుత్వం వారు నడుం బిగించారు! అయినప్పటికీ ‘గోవుల గోడు’ ఇప్పుడిప్పుడే ముగిసేటట్టు లేదు!
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమావళి వల్ల తమ ఆహారపు అలవాట్లపై నిషేధం విధించినట్టయిందన్నది గోవధను కోరుతున్నవారు చేస్తున్న వాదం. ఈ వాదం చేస్తున్నది అతి కొద్దిమంది మాత్రమే! అయినప్పటికీ ఈ వాదం అతి పెద్దగా వినిపిస్తుండడానికి కారణం ఈ దేశపువౌలిక జాతీయ సాంస్కృతిక తత్త్వాన్ని మట్టుపెట్టడానికి గుట్టు చప్పుడు కాకుండా అమలు జరుగుతున్న షడ్యంత్రం.. ఆవును తల్లిగా ఆరాధించడం ఈ దేశపు అనాది సంస్కృతి! కానీ కేంద్రప్రభుత్వం ఆహారపు అలవాట్లను నియంత్రించలేదు. సంతలలో అమ్మే, కొనే పాడిపశువులను ‘కోత’కు ఇవ్వరాదని మాత్రమే ని యమావళి చెబుతోంది. గోమాంసం తినరాదన్న నిబంధనను కేంద్ర ప్రభు త్వం విధించలేదు! ఈ సంగతి కేరళ హైకోర్టు వారు స్ప ష్టంగానే చెప్పారు. గోమాంసాన్ని దిగుమతి చేసుకుని ఆబ గా ఆరగించవచ్చు, వద్దన్నది ఎవరు? దేశంలో నియతంగా గోమాంసం తినేవారి సంఖ్య జనాభాలో కేవలం ఒకటిన్నర శాతమన్నది నిగ్గుతేలిన నిజం. మరో రెండున్నర లేదా మూడు శాతం మంది ఎప్పుడో అప్పుడు ఆవు మాంసాన్ని తిం టున్నారు. అందువల్ల ఇలా తినడం వల్ల గోసంతతి హరించిపోవడం లేదు. ఆవులను, దూడలను హత్య చేసి ‘శుద్ధి‘ ప్రక్రియ పేరుతో డబ్బాలలో మాంసం నిలువ చేసి టన్నుల కొద్దీ విదేశాలకు తరలించడంవల్ల మాత్రమే దశాబ్దుల పాటు గోసంతతి అంతరించిపోయింది! దేశంలో ఒకప్పుడు దాదాపు రెండు వందల జాతుల ఆవులుండేవట.. ప్రస్తుతం ఇరవై తొమ్మిది జాతుల స్వదేశీయ గోసంతతి మాత్రమే ఊపిరితో ఉంది!
ఆవులను, కోడెలను, దూడలను, ఎద్దులను హత్య చేయడానికి వీలుగా ‘మార్పిడి’ చేయడానికి ‘సంత’లు ఏర్పడిలేవు! పాడి పశువులను, పొలం దునే్న బసవన్నలను పెంచుకోదగిన పెయ్యిలను, దూడలను వినిమయం చేసుకోవడానికి మాత్రమే దేశంలో అనాదిగా పశువుల ‘సంత’లు ‘పరష’లు ‘మేళా’లు ‘జాతర’లు ఏర్పడి ఉన్నాయి. గోరక్షణ భూరక్షణకు ప్రాతిపదిక! సర్వోన్నత న్యాయస్థానానికి ఇదంతా తెలుసు! సర్వోన్నత న్యాయ నిర్ణయం శిరోధార్యం. కాని నిర్ణయాన్ని సమీక్షించవలసిందిగా ప్రభుత్వం యాచించవచ్చు. ప్రజలు ప్రార్ధించవచ్చు!!