కరీంనగర్

స్వశక్తి మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ లింకేజి రుణాలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 14: స్వశక్తి సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి, మహిళా సాధికారతకు బ్యాంక్ లింకేజి రుణాలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం స్థానిక స్వశక్తి కళాశాలలో జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) 36వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వశక్తి సంఘాల మహిళల సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలందరు బ్యాంక్ లింకేజి రుణాలు తీసుకొని సూక్ష్మ వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నిర్వహిస్తూ సుస్థిర జీవనోపాధిని ఏర్పరచుకోవాలని సూచించారు. స్వశక్తి సంఘాల సభ్యులు వారికున్న అవకాశాలను, నైపుణ్యాలను పెంచుకొని ప్రతీ యేటా తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అభివృద్ధితోపాటు సామాజిక భద్రత కల్పించుకోవాలని అన్నారు. మహిళలు పొదుపుతోపాటు గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు వందశాతం నిర్మించుకోవాలని చెప్పారు. జిల్లాలో దాదాపు 97 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేశామని, మిగిలిన మూడు శాతం పూర్తి చేయించాలని మహిళలకు సూచించారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలుతాయని, బహిరంగ మల విసర్జన ద్వారా అంటు వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుందని, దీనిని గ్రహించి మరుగుదొడ్లను వినియోగించుకోవాలని, అప్పుడే అంటు వ్యాధులను నివారించవచ్చునని అన్నారు. జిల్లాలో 1.53 లక్షల మంది స్వశక్తి సంఘాల మహిళలు ఉన్నారని, ప్రతీ స్వశక్తి సంఘం మహిళ 20మొక్కలను నాటి రక్షించాలని సూచించారు. ఒక మొక్క ఐదుగురికి అవసరమైన ఆక్సీజన్ అందిస్తుందని చెప్పారు. 30ఏళ్ల క్రితం ఎన్నో చెట్లు ఉండేవని, ఆ చెట్లను నరకడం వల్ల పర్యావరణం దెబ్బతిని వర్షాలు కురువకపోవడం, అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి రావడం జరుగుతుందని అన్నారు. మళ్లీ పాత పద్ధతులు రావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, వాటిని రక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. నాబార్డ్ ఎజిఎం రవిబాబు మాట్లాడుతూ బ్యాంకులకు, వ్యవసాయాభివృద్ధిలో అన్ని రంగాల్లో నాబార్డ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. సామర్థ్య రుణ ప్రణాళిక తయారీలో ప్రాధాన్యత రంగానికి రుణ పంపిణీ పర్యవేక్షణ, పంట రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, వ్యవసాయ అనుబంధ రంగాలకు యూనిట్ కాస్ట్ నిర్ణయించడంలో నాబార్డ్ కీలక పాత్ర వహించి బ్యాంకులకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన పలువురికి కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు మీనా, కెడిసిసి బ్యాంక్ డిజిఎం రవీందర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.