కరీంనగర్

మొక్క సంరక్షణకు కృషి చేస్తే ఆసుపత్రి ఫీజులో రాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూలై 14: తెలంగాణ హరితహారం 3వ విడత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అరుణ ఆసుపత్రి వైద్యులు ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు ఎల్లాల అరుణ, శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చిన సందర్శకులకు ఒక మొక్కను అందించి నాటాలని సూచించారు. అంతేకాకుండా వైద్యం కోసం వచ్చే మహిళలకు మొక్కలను అందించి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలు సేకరించారు. తిరిగి వైద్యం కోసం వచ్చే సమయంలో మొక్కకు సంబంధించిన మొక్క ఎదుగుదల వివరాలతో పాటు ఫొటోను చూపిస్తే ఫీజులో రాయితీ అందిస్తానని మొక్కల పెంపకానికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అనంతరం సామాజిక వేత్త, వైద్యులు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటే బాధ్యత మనపై ఎంతో ఉందన్నారు. ముఖ్యంగా మొక్కలను తమ పిల్లలతో సమానంగా చూడాలని సిఎం కెసిఆర్ చేసిన సూచనతో తాను అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని స్వచ్చందగా నిర్వహిస్తానని వైద్యులు తెలిపారు. మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్న సామాజిక వేత్త శ్రీనివాస్‌రెడ్డిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో భూముల రాజేశ్, భీరం రాజేశ్, నరేష్, సుధాకర్,శ్రవణ్, ప్రసాద్, శేఖర్‌రెడ్డి, జ్యోతి, రేఖ, లక్ష్మి, జల ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
అందరి సహకారంతోనే హరిత తెలంగాణ సాధ్యం
గోదావరిఖని, జూలై 14: అందరి సహకారంతోనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ అన్నారు. మూడవ విడత హరిత హారంలో భాగంగా శుక్రవారం రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో 800 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి దుగ్గల్ హాజరై మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అవసరాలతో ప్రస్తుతం కాలుష్యం విపరీతంగా పెరిగి పోయిందని తెలిపారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో చాలా అనర్థాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. వాతావరణ సమతుల్యత దెబ్బతిని కాలాలలో మార్పులు వస్తాయని తెలిపారు. దీంతో పెను విపత్తులు సంభవించే అవకాశం ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో జీవ మనుగడ కష్టతరం అవుతుందని తెలిపారు. దీన్ని అధిగమించాలంటే సమృద్ధి చెట్లు ఉండాలని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. కేవలం మొక్కను నాటి తమ బాధ్యత తీరిందని చేతులు దులుపుకోవద్దని, అవి చెట్టుగా పెరిగేంత వరకు వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగానే రామగుండం కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో గల గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటించే కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. జనమైత్రి పోలీసులకు 5వేల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని విధించారు. కార్యక్రమంలో సిఎస్‌బి ఇన్‌స్పెక్టర్ విజయసాథరి, సిఐ వాసుదేవ రావు, ఆర్‌ఐ ఇన్‌ఛార్జి రజినీకాంత్, ఆర్‌ఎస్‌ఐలు మధూకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, సిపిఓ ఎఓ సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.