ప్రకాశం

మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల : అవమానం జరిగిందని మనస్థాపంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొరిశపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే కొరిశపాడు గ్రామం అంబేద్కర్ నగర్‌కు చెందిన యర్రమోతు వేణు బేల్థారీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఈ నెల 16న అతను వ్యక్తిగత పనుల నిమిత్తం తన స్నేహితుడైన ప్రసన్నతో మేదరమెట్ల గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మేదరమెట్ల కు చెందిన యువకులు కొందరు వీరిని అడ్డుకొని మా కుటుంబానికి చెందిన విద్యార్థిని ని వేధిస్తున్నావంటూ వేణు, ప్రసన్నలను నిలదీశారు. వీరి భారీ నుండి ప్రసన్న తప్పించుకోగా వేణును అదుపులోకి తీసుకున్న మేదరమెట్ల వాసులు వేణును ఇంటికి తీసుకు వెళ్లి కొన్ని దెబ్బలు కొట్టారు. విషయం తెలుసుకున్న వేణు బంధువులు మేదరమెట్ల గ్రామానికి వచ్చి వివాదం పై ఆరా తీయగా కొంత సమయం గడిచిన తరువాత వేణు ను మేదరమెట్ల యువకులు వదిలేశారు. ఆనాటి నుండి మనస్థాపం తో ఉన్న వేణు ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో బహిర్భూమికి అని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చారు. ఇంటి వెనుక ఉన్న మరోక గదిలోకి పోయి పాత నవ్వారుతో దూలానికి ఉరి వేసుకొని వేణు (18) మృతి చెందాడు. కొంత సమయం తరువాత వేణు ఉరి వేసుకొని మృతి చెంది ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు కొరిశపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొరిశపాడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హరిబాబు విషయాన్ని దర్శి డియస్‌పి వి శ్రీరాంబాబు, అద్దంకి సి ఐ హైమారావుకు తెలిపి వారి పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వేణు మృత దేహాన్ని జిల్లా దళిత నాయకులు నీలం నాగేంద్రం తో పాటు మరికొందరు దళిత నాయకులు కొరిశపాడు గ్రామంలోని వేణు ఇంటికి వచ్చి వేణు మృతదేహాన్ని సందర్శించి సంఘటనా పూర్వా పరాలను ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా స్నేహితుడు ప్రసన్న ప్రేమ కోసం వెళ్ళి వివాదంలో చిక్కుకొని వేణు ఆత్మహత్య చేసుకోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రతి పాఠశాలలో మెను తప్పనిసరిగా పాటించాలి
మార్టూరు: ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నాం భోజన పథకంలో మెను తప్పక పాటించాలని జిల్లా విద్యా శాఖాధికారి విజయభాస్కర్ అన్నారు. ఆదివారం మార్టూరు మండలంలోని 57 పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్‌లు మంజూరు చేశారు. పాఠశాలన్నింటికి గ్యాస్‌పొయ్యి, సిలిండర్, పైపు తదిత సామాగ్రిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఈ సందర్భంగా డి ఇ ఓ మాట్లాడుతూ విద్యార్ధులకు శుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని వండి వడ్డించాలని ఆదేశించారు. డి ఇ ఓ వెంట మండల విద్యాశాఖాధికారి వస్త్రంనాయక్, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.