మహబూబ్‌నగర్

ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 3: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 70 టిఎంసిల నీటిని శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోసి మూడు జిల్లాలోని 10లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించేందుకు చేపట్టిన పథకానికి గండిపడేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివిధ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదులలో నిర్మించనున్న రిజర్వాయర్ నుంచి రోజుకో టిఎంసి చొప్పున అరవై రోజులు నీటిని తరలించేవిధంగా ప్రాజెక్టును రూపొందించడం జరిగిందని, ఇందుకు సంబందించిన సర్వే పనులు చురుకుగా సాగుతున్నాయని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్‌రెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా అప్పటి ప్రభుత్వం నల్గొండ జిల్లాకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించేందుకు జివో 159 ద్వారా ఎస్‌ఎల్‌బిసి పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సొరంగం మార్గంలో డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేవిధంగా ప్రాజెక్టును డిజైన్ చేయడంతోపాటు సొరంగం పనులను చేపట్టింది. గత 8ఏళ్ల నుంచి పనులు జరుగుతునే ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేయడంతోపాటు, రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నది. అందులో భాగంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు-రంగారెడ్డి-నల్గొండ జిల్లాలలోని 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలిస్తున్న కెఎల్‌ఐ ప్రాజెక్టు సమీపంనుంచే నీటిని ఎత్తిపోసి నార్లాపూర్ మీదుగా ఏదుల, వట్టెం, కరివేన తదితర రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించేవిధంగా ప్రాజెక్టును రూపొందించి ప్రభుత్వం పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఏదుల నుంచి నల్గొండ జిల్లాకు నీటిని ఇచ్చే డిండి ఎత్తిపోతల పథకంకు నీరు అందించేవిధంగా ప్రభుత్వం పథకాన్ని రూపొందిస్తున్నది. రోజుకు ఒక టిఎంసి చొప్పున 60 రోజులలో 60 టిఎంసిల నీటిని తరలించేవిధంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు గండి పడటంతోపాటు కెఎల్‌ఐ ఆయకట్టు ధ్వంసమవుతుందని అధికార పార్టీ నేతలు తప్ప మిగతా అన్నీ పార్టీలవారు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకంకు ముందుగా కేటాయించిన విధంగా ఎస్‌ఎల్‌బిసి ద్వారానే సాగునీరు అందించాలని, ఏదుల నుంచి నీటిని కేటాయించవద్దని వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేందుకు వీలుగా రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలను చేపట్టి తీవ్రమైన ఒత్తిడి తేవాలనే కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈమేరకు ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు అధికార పార్టీ మినహా మిగతా అన్నీ పార్టీలకు చెందిన వారు సమావేశమై కార్యచరణ ప్రణాళికను రూపొందించడంలో నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. మరికొన్ని రోజులలో ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఏదుల నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీరు అందించే ప్రాజెక్టును ముందునుంచి వ్యతిరేకిస్తున్న మాజి మంత్రి బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకులు నాగం జనార్దన్‌రెడ్డి ఈనెల 6న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఏదుల నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీరు అందించే ప్రాజెక్టును అడ్డుకునేందుకు సన్నధమవుతున్నట్లు ఆయా పార్టీలకు చెందిన వారు తెలిపారు.

రాష్ట్రంలో ఒకే కుటుంబ పాలన కొనసాగుతోంది
మక్తల్, ఫిబ్రవరి 3: తెలంగాణ నూతన రాష్ట్రంలో ఒకే కుటుంబ పాలన నడుస్తుందని, వారు వేధికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్పా ప్రజలకై ఎలాంటి సంస్కరణలు చేసిన దాఖలాలు లేవని బిజెపి రాష్ట్ర ప్రోగ్రామ్స్ ప్లానింగ్ కమిటి వైస్ చైర్మన్ బి.కొండయ్య అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలో జరిగిన బిజెపి మండల పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వాహణకు ముఖ్యఅతిథిగా వచ్చిన కొండయ్య కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి మేనల్లుడు మంత్రి హరీష్‌రావు ఎక్కడ ఎదుగుతాడోనన్న భయంతో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆయనను దూరంగా ఉంచి తన తనయుడు మంత్రి కె.తారకరామారావుకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని, ఇది కుటుంబ పాలనకు చెరమగీతం పాడటం లేదా అని అన్నారు. మక్తల్ నియోవజవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి ఎన్నికల్లో గెలిచాక ప్రజల సమస్యలను గాలికొలిదేసి వారి స్వార్థాలకు లోబడి రాజకీయాలను తమ స్వార్థం కొరకు వాడుకుంటుంన్నారని ఆయన ఆరోపించారు. కాగా బిజెపి మాత్రం ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రజాసేవకై పరితపించి పనిచేస్తుందని అన్నారు. ఎలాంటి అవినీతికి తావివ్వకుండా ప్రజలకు దగ్గరవుతున్నామని చెప్పారు. గ్రామస్థాయిలోని నాయకులు అందరు బూత్ స్థాయిలోని ప్రజలకు చెరువై అందరిని కలుపుకొనిపోయి 2019 నాటికి సర్పంచ్, ఎంపిటిసి, ఎమ్మెల్యే స్థాయి వరకు అన్ని స్థానాలు కైవశం చేసుకునే వరకు నిద్రించరాదని కొండయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రం నుండి వచ్చిన నిధులను ప్రజలకు చెప్పకుండా తను చేస్తున్న గొప్పలు మాత్రమే చెప్పుకుంటున్నారని అన్నారు. జిల్లాలో 99 శాతం ప్రాజెక్టుల పనులు పూర్తి అయినప్పటికి వాటికి కొద్దిపాటి బడ్జెట్‌ను కేటాయించి పూర్తి చేయకుండా పర్సంటేజీలకై కొత్తప్రాజెక్టు అయిన పాలమూరు ఎత్తిపోతలను తెరపైకి తేవడం ఇంతకన్న ధారుణం మరొకటి లేదని అన్నారు. ప్రజలందరు ప్రధానమంత్రి ఇన్స్‌రెన్స్‌ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు, రైతులకు, నిరుపేదలకు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మన ప్రధాని అడుగు ముందుకు వేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చడమే ఆయన ముందున్న లక్షమని తెలిపారు. బిజెపి మైనార్టీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాబోయే 20 సంవత్సరాలలో కూడా బిజెపి అధికారంలో ఉంటుందని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు విద్యాసాగర్, భాస్కర్, సోమశేఖర్‌గౌడ్, కర్నిస్వామి, కల్లూరి నాగప్ప, జయరాంరెడ్డి, చీరాల సత్యనారాయణ, సందాపురం చంద్రశేఖర్, ఎంపిపి కోళ్ల పద్మమ్మ, నాయకులు రఘుపతిగౌడ్, సారాయి హన్మంతు, శంకరయ్య, రాములు , ఆంజమ్మ, బాలమని, ఆంజనేయులు, మోహన్‌గౌడ్, లక్ష్మణ్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా స్వయం ఉపాధి
లబ్ధిదారుల ఎంపిక
అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3: జిల్లాలో స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బుధవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహాంలో జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ కార్పొరేషన్ల రుణాలకై ఎంపిక చేసే లబ్దిదారు విషయంలో అధికారులు నియమ నిబంధనాలు పాటించాలని ఎంపికలో మాత్రం ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని తెలిపారు. వ్యక్తి గత రుణాలు కాబట్టి చాలా పారదర్శకంగా ఉంటేనే మంచి పేరు వస్తుందని లేకపోతే విమర్శలు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, కార్పొరేషన్ రుణాల కోసం ధరఖాస్తులు దాదాపు 1.8 లక్షలు వచ్చాయని తెలిపారు. ఎస్సీలకు దాదాపు 5800, ఎస్టీలకు 2200, మైనారిటీలకు 600, బిసిలకు 6800 మందిని లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని ఇంకా కొన్ని కార్పొరేషన్ల దరఖాస్తుల గడువు ఇంకా సమయం ఉన్నందున మరన్ని ధరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి ఈ సందర్భంగా తెలిపారు. భూమిలేని నిరుపేదలకు వ్యక్తి గత రుణాలలో అవకాశం కల్పించాలని తెలిపారు. అయితే ఎప్పటిలాగా పాత పద్దతికే కాకుండా కొత్తకొత్త వాటిని లబ్ధిదారులకు ఎంపిక చేయాలని రుణం తీసుకుంటే ఆ లబ్ధిదారుడు బాగుపడేలా ఉండాలని దాంతో కుటుంబం అభివృద్ధి చెందాలని తెలిపారు. పరిశ్రమలు, సెట్మా తదితర శాఖలను కూడా భాగస్వామ్యం చేస్తే లబ్ధిదారుల లాభం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంటేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా ఆసుప్రతిలో ఐసియు వార్డు
ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 3: గత ఎన్నో సంవత్సరాల నుండి జిల్లా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగం (ఐసీయూ) ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజానికం ఎన్నోసార్లు అధికారులను కోరుతూనే ఉన్నారు. బుధవారం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ వార్డును ఏర్పాటు చేసింది. మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు. ఐసీయూ వార్డును ప్రారంభించిన అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుప్రతుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటునామని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని ఎన్నడు లేని విధంగా తొలిసారిగా ప్రతి ఆసుపత్రి కెపాసిటి బట్టి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను గత పాలకులు విస్మరించారని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో అన్ని మార్పులు తీసుకువస్తుందని అన్నారు. వైద్య రంగమే కాకుండా అన్ని రంగాలలో పేదలకు లబ్ధిచేకూరేలా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. పేదలకు ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని అన్నారు. మెడికల్ కళశాల మంజూరి చేయడడమే కాకుండా ఈ సంవత్సరం అకాడమిక్ నుండి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. బాధ్యతయుతంగా జవాబుదారితనంతో తామంత పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యశాఖ ప్రన్సిపల్ సెక్రెటరి వీణా, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ మినాక్షి, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

సిసి కెమెరా కంట్రోల్ రూం ప్రారంభం
ఎస్పీ విశ్వప్రసాద్
నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 3: నారాయణపేట పోలీసు సబ్ డివిజన్ కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కంట్రోల్ రూంను ఎస్పీ విశ్వప్రసాద్ ప్రారంబించారు. బుధవారం నారాయణపేట పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్, దాతల సహాకారంతో ఎనిమిది లక్షల వ్యయంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కంట్రోల్ రూంను ఎస్పీ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భధ్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. ఆధునిక పరిజ్ఞానంతో కేసులను సత్వరం పరిష్కరించే ఏర్పాట్లు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేయాలని డిఐజి సూచించిన నేపథ్యంలో జిల్లాలోని అన్నీ సబ్ డివిజన్ కేంద్రాల్లో సిసి కెమెరాలను పట్ణణాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, గద్వాల్, షాద్‌నగర్, వనపర్తి తదితర పట్టణాల్లో ఇప్పటికే సిసి కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్‌రూంల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఎలాంటి అలజడిలు రేగకుండా ఉండే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాజాగా నారాయపేటలో సైతం ఏర్పాటు చేసి ప్రారంబించామన్నారు. గత ఆరు నెలలుగా జిల్లాలో నేరాలు తగ్గాయని, ఇందుకు కారణం అత్యాధునిక సిసి కెమెరాలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసి వాటిని పరిశీలిస్తూ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కాగా నారాయణపేట కౌన్సిల్ సభ్యులు అందించనున్న లక్ష రూపాయల విరాళంతో పట్టణంలో మరిన్ని సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాహన చోదకులు రోడ్డు నిభంధనలను పాటించాలని, హెల్మెట్లను ధరించి ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం డిఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, వైస్ చైర్మన్ నందునామాజీ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వామన్‌గారి కృష్ణ, బిజెపి జిల్లా ఉపాధ్యాక్షుడు ప్రభాకర్‌వర్దన్, చాంబర్ ఆఫ్ కామర్స్ నారాయణపేట అధ్యక్షుడు హరినారాయణ్‌భట్టడ్, సభ్యులు, డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సిఐ రవీంద్రప్రసాద్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, నవీన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

గద్వాల జిల్లా కాంక్ష ఫలించాలని...
కార్యసిది ధహోమం విజయవంతం
గద్వాల, ఫిబ్రవరి 3: నడిగడ్డ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈ ప్రాంతంలో వర్షాలు సకాలంలో కురిసి సిరిసంపదలు కలగాలని, గద్వాల జిల్లా ఆకాంక్షిస్తూ చేపట్టిన కార్యసిద్దిహోమం రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కార్యసిద్దిహోమంతో గద్వాలలో అధ్యాత్మిక వాతావరణంలో భక్తులు తన్మయత్వం చెందారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు చెందిన ఋత్వికుల వేదమంత్రోచ్చరణల మధ్య సాగిన కార్యసిద్దిహోమం ఆధ్యాంతం భక్తివశమై పర్వసించింది. సంకల్పం సిద్దించాలని మొదటిరోజు దేవతామూర్తులను ప్రతిష్ఠించి వారిని స్తుతిస్తూ పూజా కార్యక్రమాలు చేపట్టారు. రెండవ రోజు సకల దేవతల అనుగ్రహం పొందేవిధంగా ఋత్వికులు కార్యసిద్దిహోమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే తేరుమైదానంకు మహిళలు, విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చి హోమ గుండాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. 40 మంది ఋత్వికులు, 16 హోమగుండాల వద్ద దంపతులచేత హోమ కార్యక్రమాన్ని కన్నులపండువగా జరిపించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను చాటుతూ చేపట్టిన కార్యసిద్దిహోమం ఆధ్యాంతం భక్తులను ఆకట్టుకుంది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఋత్వికుల సూచనల మేరకు హోమ గుండాల వద్ద పూజా పదార్థాలను వదిలారు. ప్రధాన హోమ గుండం వద్ద ఎమ్మెల్యే డికె అరుణ, మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహారెడ్డి, కూతురు స్నిగ్ధారెడ్డి, నందిగోశాల నిర్వాహకురాలు నిర్మలానందభారతి యోగమాతాజీ, మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి వెంకట్రాములు, వైస్ చైర్మన్ శంకర్ దంపతులు, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డంకృష్ణారెడ్డి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఇష్టకార్యం నెరవేరాలని గణపతి హోమంతో ప్రారంభమై విష్ణుయాగం, మణిసూక్తహోమం, శ్రీ సూక్తహోమం, రుద్రసహకార హోమం, నవగ్రహ హోమం, కార్యసిద్ది హోమాలను పూర్ణాహుతితో ముగించారు. గద్వాల ప్రాంతం ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడిగా ఉండి నడిపించినట్లు పురాణాలు చెబుతుండడంతో 108సార్లు పవమాన హోమాలతో పూర్ణాహుతిని ముగించారు. అనంతరం ఈ ప్రాంతానికి చెందిన కళాకారులు భక్తిగీతాలను ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు. అదేవిధంగా కోలాటాలు, భజన కార్యక్రమాలు, పార్చర్ల చెక్క్భజన కార్యక్రమాలు ఎంతగానో భక్తులను అలరించాయి. అనంతరం ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రెండవ రోజు సుమారు ఐదు వేల మంది భక్తులు కార్యక్రమంలో హాజరై హోమగుండాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
భగవంతుడి ఆశీస్సులతో జిల్లా సిద్దిస్తుంది
ఎమ్మెల్యే డికె అరుణ
నడిగడ్డ ప్రజల గద్వాల జిల్లా ఆకాంక్ష నెరవేరాలని కోరుతూ గత రెండు రోజులుగా పట్టణంలోని తేరుమైదానంలో నిర్వహిస్తున్న కార్యసిద్దిహోమం ద్వారా భగవంతుడి ఆశీస్సులు పొంది జిల్లా సిద్దిస్తుందని ఎమ్మెల్యే డికె అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం గద్వాలలో నిర్వహించిన కార్యసిద్దిహోమం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యాగాలు, హోమాల పట్ల ఎంతో గౌరవం ఉందని, అదేవిధంగా రాష్ట్రంలో ఎంతో చరిత్రగల గద్వాల ప్రాంతం గురించి జిల్లా ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, సౌకర్యాల గురించి భాగా తెలుసని, గద్వాలను జిల్లా చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని ఆమె అన్నారు. నడిగడ్డ ప్రాంతం త్యాగాల గడ్డ అని, ఈ ప్రాంత ప్రజలు భూములు, ఇండ్లు కోల్పోయి జూరాల ద్వారా జిల్లాకు తాగు, సాగునీటిని అందిస్తున్నారని, ఈ త్యాగ పురుషుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. గద్వాల రాజుల చరిత్రతో పాటు ఈ ప్రాంత విశేషాలను తెలుసుకొని జిల్లా ఏర్పాటుకు అందరు ముందుకు రావాలని కోరారు. రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యసిద్దిహోమానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన ఋత్వికులకు, పట్టణ ప్రజలను ఎప్పటికి మర్చిపోనని ఆమె ఉద్వేగంగా అన్నారు. 16 హోమ గుండాల్లో ఒక్కోక్క హోమ గుండానికి ఐదు, ఆరు జంటలు కూర్చోని పూజలు నిర్వహించి వారి ఆకాంక్షను చాటారన్నారు. గద్వాల జిల్లా సాధనతో పాటు ఈ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు తనవంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు.
జములమ్మ, సుంకులమ్మ ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
కార్యసిద్దిహోమం రెండవ రోజు కార్యక్రమ ప్రారంభంలో గద్వాల ప్రాంతానికి చెందిన జములమ్మ, ఈదమ్మ, సుంకులమ్మ గ్రామదేవతల ఆలయాల్లో ఉదయం ఎమ్మెల్యే డికె అరుణ, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యసిద్దిహోమం విజయవంతం కావడంతో పాటు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరాలని అమ్మవార్లను వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

మార్చి చివరి నాటికి
ఉపాధి హామీలో రూ.150 కోట్లు వ్యయం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3: జిల్లాలో మార్చి చివరి నాటికి ఉపాధిహామీ పథకంలో రూ.150 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని అందుకుగాను జిల్లా యంత్రాంగాన్ని పనులు వేగవంతం చేసేలా ఆదేశించడం జరిగిందని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అథితి గృహాంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్యా తాగునీటి సమస్యను అదిగమించేందుకు తాత్యాలిక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తాగునీటికై నిధుల కొరత లేదని గ్రామాల వారిగా నివేదికలు అందయాని వారం రోజుల్లో తాగునీటికి మరిన్ని నిధులు రానున్నాయని మంత్రి వెల్లడించారు. గ్రామాలలో అవసరాన్ని బట్టి నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో శాశ్వత కరువు పోవాలంటే ప్రాజెక్టులు పూర్తి కావల్సిన అవసరం ఉందని అన్నారు. అన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని అందులో భాగంగా కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను పూర్తి వచ్చే ఖరీఫ్ నాటికి జిల్లాలో అధనంగా ఆయనకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయిందని, ఫిబ్రవరి నెలాఖరు వరకు పనులు ప్రారంభింస్తామని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో పని దినాలను కూడా పెంచడానికి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి పనులు చేపట్టడానికి టార్గెంట్ ఇవ్వడం జరిగిందని పనులపై, లక్ష్యాన్ని చేదించని అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. గత ప్రభుత్వాలు జిల్లాను పూర్తిగా విస్మరించడంతో జిల్లాలో ఇంకా ప్రజలు వలసలు వెళ్తున్నారని ఇది బాధకరమైన విషయమని అన్నారు. అందుకే ఉపాధిపనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మరో మూడేళ్లలోపు 65 ఏళ్లలో చూడలేని అభివృద్ధిని జిల్లా ప్రజానికం చూడబోతుందని అన్నారు. జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయని మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని అందులో జిల్లాలో యువతకు ఉపాధి లబించనుందని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని అందుకే జిల్లాకు అన్ని జిల్లాల కన్నా అధిక నిధులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో తాగరునీటికి శాశ్వత పరిష్కారం కోసమే వాటర్ గ్రిడ్ పథకం తేవడం జరిగిందని రెండున్నరేళ్లలో వేలాది గ్రామాలకు నల్లాల ద్వారా తాగునీటి అందించి తీరుతామని జిల్లాలో కూడా వాటర్‌గ్రిడ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.