ఐడియా

దాల్చిన చెక్కతో మెదడుకు చురుకుదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యపరంగా దాల్చిన చెక్క గొప్ప ఔషధం. ఈ మసాలా దినుసును పరిమితంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. దాల్చిన చెక్కలో సిన్నమాల్దిహైడ్ అనే ఆహార రసాయన ద్రవ్యం ఉంది. ఇది పేగులలో వచ్చే కొన్నిరకాల క్యాన్సర్లను నివారించే గుణం ఉంది. కండరాలలో వాపును తగ్గించే గుణం కూడా ఉంది. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు దీన్ని వాడితే మంచి గుణం కనిపిస్తుంది. సంగీత కచ్చేరీలు చేసేవారు ఈ చెక్కను బుగ్గన పెట్టుకుంటే గొంతు శ్రావ్యంగా ఉంటుంది. నోటి దుర్వాసన అరికడుతుంది. దాల్చినీ చెక్కను, పంచదారను పొడిచేసుకుని తింటే జీర్ణకోశ వ్యాధులు దూరమవుతాయి. దాల్చిన చెక్క పొడి చర్మ సౌందర్యానికి కూడా మంచిదే. ఈ పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవటం ద్వారా వయసును దాచుకోవచ్చు. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. కళ్లకు కాంతిని కూడా అందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ దాల్చిన చెక్కను ఆహారంలో పరిమితంగా తీసుకోవటంలో మంచిదే.