కరీంనగర్

పారితోషికం బదులు కనీస వేతనం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 11: ఆషా వర్కర్లకు ముఖ్య మంత్రి ప్రకటించిన రూ.6 వేల వేతనం జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆషాలు ధర్నా, ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈమేరకు తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆషా) యూనియన్-సీఐటీయూ పిలుపు మేరకు సోమవారం వివిధ మండలాల నుండి ఆషాలు తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. ఆషాలు తమకు పారితోషికం వద్దు, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని 106 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరిగిందన్నారు. స్వయంగా ముఖ్య మంత్రి స్పందించి ప్రగతి భవన్‌లో ఆశాల సమావేశం నిర్వహించి నెలకు రూ.6 వేలు వేతనం కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని ప్రకటించారని, పారితోషికాలు రద్దు చేసి ఎంతో కొంత వేతన రూపంలో ఇస్తామని కూడా ప్రకటించారన్నారు. దీనితో ఆషాలు తృప్తి చెందారని, కానీ అందుకు భఙన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేతన జీవో విడుదల చేయకుండా పారితోషికాలు పెంచుతూ 167 జీవోను విడుదల చేయడం వలన ఆశాలకు నష్టం జరుగుతుందన్నారు. అలాగే ఆశాలకు సంబంధం లేని పనపులను అధికారులు చేయిస్తున్నారని, రోజంతా పీహెచ్‌సీలో ఉండాలని నిబంధనలు విధించారన్నారు. దీని వలన ఆశాలు తీవ్రంగా నష్టపోతున్నారని వీరికి రూ.6 వేల వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ఆశాలకు సంబంధం లేని పనులను వారితో చేయంచడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీ ఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మూషం రమేశ్, ముద్రకోల అంజనేయులు, ఆషాలు జి.జమున, డి.జమున, ఎ.అనురాధ, టీ.కరుణ, కమల, ఎం.పద్మ, పి.సునీత, ఎ.లక్ష్మిలు పాల్గొన్నారు.

దివ్యాంగులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
* ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి వినతి
తిమ్మాపూర్, డిసెంబర్ 11: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు చైర్మన్, సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జనార్దన్ రావు, ఎవో బాలరాజు, ప్రిన్సిపాల్ డి.రోజ, వినయ్, రమేశ్, డి.దుర్గాతో పాటు పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.