ఐడియా

నిమ్మలో సుగుణాలు ఎనె్నన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరూరించే నిమ్మను ఇష్టపడనివారు ఉండరు. లెమన్ టీ, నిమ్మ పచ్చడి, నిమ్మ పులిహోర.. ఒకటేమిటి ఎన్నో రకాలు చేసుకుంటాం. అందుకే ప్రతి ఇం ట్లో ఇది నిత్యావసరంగా మారిపోయింది. చౌకగా దొరికే నిమ్మలో ఆరోగ్యానికి మేలుచేసే విశేషాలు అధికంగా ఉన్నాయి. ఉదయానే్న గోరువెచ్చని నీటి లో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం తగ్గుముఖం పడుతుంది. ఇది కాలేయానికీ మంచి టానిక్.
వెక్కిళ్లు వచ్చినపుప్పుడు నీళ్లలో కాస్త నిమ్మరసం వేసుకుని తాగితే వెంటనే తగ్గుతాయట.
నిమ్మరసం వృద్ధాప్యాన్ని దరిచేరనీయదు. ముడతల్నీ, నల్లమచ్చల్నీ తొలగిస్తుంది. కాలిన మచ్చల మీద రోజూ నిమ్మరసం పూయడం వల్ల క్రమంగా తొలగిపోతాయి.
నిమ్మ చెక్కలకు కాస్త ఉప్పు జోడించి రాగి, ఇత్తడి పాత్రలు రుద్దితే అవి తళతళలాడతాయన్నది తెలిసిందే. ఎలాంటి వాసనా, జిడ్డూ లేకుండా చేతుల్ని శుభ్రంగా కడిగేందుకు నిమ్మచెక్కల్నే వాడతారు. అంట్లు కడిగే లోషన్లు నిమ్మరసంతో తయారుచేసినవే వస్తున్నాయి.
నిమ్మ నుంచి శానిటరీ కిచెన్ డియోడరైజర్, గ్రీజు, మరకలు వంటివి నిమ్మరసంతో ఇట్టే పోతాయి.
నిమ్మవాసన వల్ల తలతిరగడం తగ్గుతుంది.
నిమ్మకాయలు ఎక్కువగా దొరికే సీజన్‌లో వీటి రసం పిండి వాటిని ఫ్రీజ్ చేసి అవసరమైనపుడు కాసిని నీళ్లల్లో ఓ క్యూబ్ వేసి, కాస్త పంచదార వేసుకుంటే సెకన్లలో లెమనేడ్ రెడీ.
మటన్, చికెన్‌లకు నిమ్మరసం పట్టించటం వల్ల అందులోని సంక్షిప్తమైన పీచును కొంతవరకు కరిగేలా చేస్తుంది. దాంతో త్వరగా జీర్ణమవుతుంది.