విజయనగరం

సంచారజాతుల వారిని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 5: పట్టణంలో సంచార జాతుల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యంత వెనుకబడిన తరగతుల ఫోరం (ఎంబిసి) జిల్లా కన్వీనర్ మలిచర్ల దుర్గారావు కోరారు. సంచారజాతుల వారికి ఇళ్లు, ఇళ్లస్థలాలు, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు మంజూరు చేయాలని చేయాలని ఎంబిసి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ పట్టణంలో ప్రకాశం పార్కులో 40 ఏళ్లుగా పూసలు అమ్ముకుని 32 కుటుంబాలవారు నివశిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కాలువల పైన, పుత్‌పాట్‌లపైన పూసలు అమ్ముకుని అర్థాలికతో కాలం గడుపుతున్నారని చెప్పారు. ఎండనలో ఉంటూ వానకు తడుస్తూ చలికి వణికుతూ జంతువుల కంటే హీనంగా బతుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్‌కు ఒక వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు పి.షణ్ముఖరావు, ఎంబిసి సభ్యుడు ఆర్.గోపాలరావుతదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
విజయనగరం (్ఫర్టు), జనవరి 5: ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విశ్రాంతి ఉద్యోగుల సంఘం రీజనల్ కార్యదర్శి ఎన్.సంజీవరావుతెలిపారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ డిస్పెన్సరీలో వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాలని, విశ్రాంతి ఉద్యోగులందరికీ నెలకు సరిపడే మందులను ఒకే పర్యాయం ఇవ్వాలని కోరారు. విశ్రాంతి ఉద్యోగులకు మందులు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో చాలామందికి పెన్షన్లు మంజూరు కాలేదని, ఫైనల్ సెటిల్‌మెంట్లు కూడా జరగలేదని తెలిపారు. ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులందరికీ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయాలని, స్వంత ఇల్లులేనివారికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ నేపధ్యంలో విశ్రాంతి ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు విశ్రాంతి ఉద్యోగుల మహాసభను ఈనెల 8వతేదీన ఆమర్‌భవన్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభకు విశ్రాంతి ఉద్యోగులు హాజరు కావాలని ఆయన కోరారు.