Others

ధ్యానం - ఆత్మజ్ఞానం - దివ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్యానం మరి ఆత్మజ్ఞానం ఉన్నవాళ్లే తమతమ జీవితాలలో అద్భుతంగా రాణించగలుగుతారు. చిన్న వయస్సు నుండే ప్రతి ఒక్కరూ.. రాముడు మరి కృష్ణుడిలాగే ధ్యానం చేస్తూ.. ఇతర ప్రాపంచిక విద్యలతోపాటు ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాలి. సరియైన నడవడిక, సత్యశీలత, చక్కని ప్రతిన మరి కర్తవ్య దీక్షలతో విలువైన మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకత (క్రియేటివిటీ) ఉంటుంది. అది కొందరిలో తక్కువగానూ మరి కొందరిలో ఎక్కువగానూ ఉంటుంది. ఆ సృజనాత్మకతను మరింత పదును పెట్టేది ధ్యానం. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికపుడు వినూత్నమైన ఆవిష్కరణలను చేస్తూ ఉండాలి. ఏ మాత్రం ఏమరుపాటు పనికిరాదు. ఏ మాఅతం అలసత్వం చేసినా మనకంటే ముందు మరొకడు దూసుకుపోతాడు. ఎప్పటికపుడు మనలోని దివ్య తత్త్వాన్ని మనకు తెలియజేస్తూ, మనలోని నూతన ఆవిష్కరణలను ధ్యానం వెలుపలికి తెస్తుంది.
శ్వాస మీద ధ్యాస - ధ్యాన యోగం!
చేపట్టిన పని మీద ధ్యాస - కర్మయోగం!
సత్యం మీద ధ్యాస - జ్ఞానయోగం!
సకల ప్రాణికోటితో మిత్రత్వం మీద ధ్యాస - మైత్రీయ - బుద్ధయోగం!
ధ్యానం ద్వారా పొందే జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ ఉంటే క్రమకాలంలో ‘ఆత్మజ్ఞానులం’ అవుతాం. ఆత్మజ్ఞాన చైతన్యాన్ని ఎరుకలో ఉంచుకుని ప్రతిక్షణం జీవిస్తూ ఉంటేనే.. ఆత్మైక సంపదలన్నింటికీ మనం వారసులమవుతాం.
‘నేను క్రిస్టియన్‌ని.. నేను హిందువును.. నేను మహమ్మదీయుడిని! నేను.. జొరాస్ట్రియన్‌ని’ అంటూ ఇలా రకరకాల మతాలు ఏర్పరచుకున్నాం. అలాగే నేను ఫలానా మంత్రిని - మంత్రిణిని, ఫలానా రాష్ట్రానికి అధికారిని, ఫలానా కళాకారుడిని’ అనుకుంటూ రాజకీయం, అధికారం, కీర్తి, గౌరవం, ప్రతిష్ఠలూ కూడదీసుకుంటూ ఉంటాం. అయినా కూడా మనకు మన గురించి సంపూర్ణంగా అర్థంకాదు - ఇలలో మరి కలలో!
నిద్రపోయి లేవగానే లేదా పదవి, అధికారం ఉండగానే భ్రమ, తాత్కాలికం అని అర్థం అవుతుంది. చనిపోయి శరీరం వదిలేయగానే ఇవేవీ మనం కాదు.. ఇదంతా మాయ. మనం కేవలం ఆత్మపదార్థం అని అర్థం అయిపోతుంది.
అదొక డెడ్ ఎండ్ -
‘ఈ శరీరం మరి మనస్సూ అంతా కూడా మాయే... అన్నీ తాత్కాలికాలే; శాశ్వతమైంది ఇంకా ఏదో ఉంది’ అన్న స్పష్టత మాత్రం మనకు ఇక్కడ కచ్చితంగా వస్తుంది.
మనం ఎదుటివారికి ఏది చేస్తే తిరిగి మనం వాటినే పొందుతాం; ఇది కర్మసిద్ధాంతం! కర్మ సిద్ధాంతాన్ని గౌరవిస్తూ అహింసా ధర్మాన్ని పాటిస్తూ జీవించాలి! అందరూ దివ్యాత్మ స్వరూపులే. జంతువులు, పక్షులు, జలచరాలు అన్నీ దివ్యాత్మ స్వరూపాలే! అసలు ఈ సృష్టిలో దివ్యత్వాన్ని కలిగి లేనిదంటూ ఏ లేదు. అయితే జన్మలను బట్టి, కర్మలను బట్టి ఒక్కొక్కరూ ఒక్కొక్క ఉపాధిలో స్థిరపడతారు. అలాగే జన్మజన్మల పరంపరలో ఎవరికి వారు తమతమ ఆత్మ ఎదుగుదలను (ఎవల్యూషన్) బట్టి ఆయా స్థాయిల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటారు. అందరూ అన్నీ గొప్పవారే, గొప్పవే.
మనం ఎంతగా వీటిని ఆచరణలో పెడుతూ ఉంటామో, మన భౌతిక దేహం అంతగా పటిష్ఠపరచబడుతూ ఉంటుంది. ఇతరులకు చిన్నిచిన్ని సహాయాలు చేయడం మొదలుపెట్టి ‘సమస్త ప్రాణికోటిల్ని మిత్రత్వమే దివ్యత్వం’ అనే స్థితికి చేరడమే ప్రతి అంశాత్మ యొక్క జీవన గమ్యం. ‘ఇదే మైత్రేయ బుద్ధయోగం’.
అన్ని వేళలా అలా ఉండడం సాధ్యం కాకపోవచ్చు. భౌతిక ప్రపంచంలోని విషయాలు, పదార్థాలు, వస్తువులు, అందాలు, ఆకర్షణలు, ప్రలోభాలూ, స్వార్థాలూ, పదవులూ, అధికారాలు, కీర్తులూ ఇలాంటివన్నీ మానవ సమూహాలను మితిమీరిన విషయాసక్తిలో పడవేస్తూ, ఎప్పటికపుడు వెనక్కి లాగుతూ ఉంటాయి. జీవితంలోని ప్రతి సందర్భాన్ని చక్కగా గమనిస్తూ, చతురతల్ని, చిరునవ్వుల్ని ప్రవర్తిస్తూ ఎప్పటికపుడు వినూత్న సందర్భ జ్ఞానాన్ని గ్రహిస్తూ, నెమరువేసుకుంటూ, పదిలపరచుకుంటూ జీవించాలి. చెదరిన మనస్సును ‘్ధ్యన యోగం’తో స్థిమితపరచుకుని, జ్ఞాన యోగంతో బుద్ధిని వికసింపజేసుకుని జీవించాలి. అదే వాస్తవికమైన సత్య ప్రయాణం.
ధ్యానం - సరియైన ధ్యాన సాధనను విశేషంగా చేస్తే ప్రతి ఒక్కరికీ అపరిమితమైన శక్తి సామర్థ్యాలు సంక్రమిస్తూ ఉంటాయి. సాధనతో సమకూరు పనులు ధరణిలోన అన్నారు వేమన. సరియైన సులభమైన ధ్యానం ‘శ్వాస మీద ధ్యాస.’

-సశేషం
(బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాల సంకలనం)

-మాఠం శివప్రసాద్