కరీంనగర్

నిధులకు ఢోకా లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.కరీంనగర్, మార్చి 19: కరీంనగర్ నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ నేరుగా అమలు చేస్తున్న సీఎం అష్యూరెన్స్ పథకంలో నిధులు వస్తాయని, నిధులకు ఢోకా లేదని, కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పనుల పురోగతిపై నగరపాలక సంస్థ, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, సాంఘీక సంక్షేమ శాఖ తదితర విభాగాల ఇంజనీరింగ్ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గతేడాది మంజూరైన రూ.19కోట్లు ఖర్చు చేయకుండా ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, పనులు చేపట్టినప్పటికీ అధికారులు త్వరితగతిన బిల్లులు నమోదు చేయడం లేదని, మున్సిపల్ కార్పొరేషన్‌లోనైతే కాంట్రాక్టర్లే ఎంబీ బుక్కులు చంకలో పెట్టుకొని తిరిగే దౌర్భాగ్య పరిస్థితి ఉందని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు వివరించారు. అటు అధికారులు ఇటీవల జీఓ.నం.40 ద్వారా పిలిచిన టెండర్లలో ఎవరు పాల్గొనలేకపోయారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సీనియర్ కాంట్రాక్టర్లకు చేతిలో ఉన్న, చేపట్టాల్సిన పనుల కారణంగా వారు వేయలేకపోగా, కొత్త కాంట్రాక్టర్లకు అనర్హతల కారణంగా కోట్లాది రూపాయల టెండర్లలో ఎవరు పాల్గొనలేకపోయారని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే జీవో.నం.40పై సంబంధిత మంత్రి కేటీఆర్‌ను కలిసి వాస్తవాలను వివరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌కు రావాలని కాంట్రాక్టర్లు, మేయర్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, కమీషనర్ శశాంకతోపాటు పలు శాఖల అధికారులు, కార్పోరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కోర్టు కేసులపై నిర్లక్ష్యం వద్దు
* వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలి
* సహచట్టం అమలుకు జిల్లా కమిటీ
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్, మార్చి 19: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో గల కోర్టు కేసులపై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు. కేసులకు సంబంధించి తమ దృష్టికి తీసుకువచ్చి, తగిన చర్యలను తీసుకోవడంతోపాటు వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోర్టు కేసులు, పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు, విఐపీ పిటీషన్లు, ప్రాజెక్టుల భూసేకరణ, సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులకు ధరఖాస్తులు అందజేస్తారని, ఆయా దరఖాస్తులను సంబంధిత ప్రజాప్రతినిధి (వీఐపీ) అధికారులకు పంపిస్తారని, అలాంటి పిటీషన్లకు అధిక ప్రాధాన్యతనిచ్చి సమస్యను పరిష్కరించడంతోపాటు ఆ విషయాన్ని సంబంధిత ప్రజాప్రతినిధికి సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ధరఖాస్తులకు సైతం ప్రాధాన్యతా క్రమంగా పక్షం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బంధీగా అమలు చేసేందుకు వీలుగా జిల్లా రెవెన్యూ అధికారి నోడల్ అధికారిగా, జిల్లా అధికారులు సభ్యులుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటి ప్రతీ మూడు నెలలకొకసారి సమావేశమై సమస్యలను పరిష్కరిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషామస్రత్ ఖానం, ఆర్‌డిఓ రాజాగౌడ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.