కరీంనగర్

తండ్రి ఇంటిఎదుట కూతురు బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, మార్చి 21: కన్న తండ్రి తన బాధ్యతగా చేరదీయడం లేదని తండ్రి ఇంటిఎదుట కూతురు బైఠాయించిన సంఘటన మానకొండూర్ మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన నాంపెల్లి శ్రీనివాస్ అనే ఆర్టీసీ డ్రైవర్‌తో ఇదే గ్రామానికి చెందిన శోభతో వివాహం జరుగా వీరికి అనూష అనే కూతురు జన్మంచింది. అనూష నాలుగు ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే శోభ శ్రీనివాస్ మధ్య విభేదాలు రావడంతో గ్రామ పెద్దమనుషుల సాక్షిగా విడాకులు తీసుకున్నారు. తల్లి శోభ తన కూతురు అనూష బాగోగులను చూసుకుంటూ డిగ్రీవరకు ప్రభుత్వ కళాశాలలో, బిఈడి వశిష్ట కళాశాలలో ఉన్నత చదవులను చదివించింది. ప్రస్తుతం అనూష వయస్సు 23సంవత్సరాలు. అనూష తెలిపిన వివరాల ప్రకారం.. తన తండ్రి శ్రీనివాస్ కరీంనగర్-1 డిపోలో ఆర్టీసి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన తండ్రి శ్రీనివాస్ మొదటి భార్య శోభకు విడాకలు ఇచ్చిన అనంతరం వేరే అమ్మాయితో వివాహం చేసుకున్నాడు వారికి ఇప్పుడు ఒక్క కుమారుడు ఉన్నాడు. తన తల్లి శోభ గత కొన్ని సంవత్సరాలుగా కూలిపని చేసి ఉన్నత చదువులు చదివించిందని ఇక పై చదువులు కాని పెళ్లి చేసే స్థోమతలేదని తల్లి తెల్చి చెప్పిడంతో తండ్రి శ్రీనివాస్ ఇంటి వద్దకు అనూష చేరుకొని తన భాగోగులు చూసుకోవాలని పై చదువులకు ఖర్చులతోపాటు, తనకు మంచి అబ్బాయి చూసి పెళ్లి చేయాలని బాధ్యత తన తండ్రిదేనని అనూష రోదిస్తు తండ్రి ఇంటిఎదుట బైఠాయించింది. తల్లిదండ్రులు విడిపోవడంతోనే నా జీవితం అంధకారంగా మారిందని, దీంతో రొడ్డుపై పడాల్సిన దుస్థతి ఏర్పడిందని యువతి కంటతడి పెట్టింది. తన తండ్రి శ్రీనివాస్ చేరదీసేంతవరకు ఇంటి ఎదుటనే బైఠాయింపు కొనసాగిస్తాన్నాని అనూష ఖరాకండీగా చెప్పింది.

భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్
తిమ్మాపూర్, మార్చి 21: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల, పోలంపల్లి గ్రామాలలో నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పనులను బుధవారం జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పరిశీలించారు. పోరండ్ల గ్రామంలో మిషన్ భగీరథ పనులను, అలాగే పోలంపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ పనులను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే అనుకున్న సమయానికి పనులను పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు, మండల తహశీల్దార్ జగత్ సింగ్, ఆర్‌ఐ రాజు గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

మెరుగైన సేవలే ప్రతిష్ట పెంచుతాయి
* జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్గె
సిరిసిల్ల, మార్చి 21: రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించిన 2018 నూతన బ్యాచ్ 17 మంది కానిస్టేబుల్లు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెడ్గేను విధుల్లో చేరారు. బుధవారం జిల్లాకు వచ్చిన కానిస్టేబుళ్ళలో ఎనిమిది మంది మహిళలు కాగా, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందించారు. జిల్లాలో వారికి కేటాయించిన విధుల్లో క్రమ శిక్షణగా నిర్వహిస్తూ, ప్రాధమిక శిక్షణలో నేర్పిన సాంకేతిక విద్యలు, మెలుకువలు వినియోగిస్తూ శాంతి భద్రతలు పరిరక్షించాలని ఎస్పీ కోరారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలో ఆచరణ పెట్టాలని, పోలీసు శాఖ అంటేనే సేవకు మొదట ఉండేదని గుర్తుంచుకోవాలన్నారు. మారుతున్న కాలానుగుణంగా వస్తున్న నూతనత్వం, సాంకేతికతను అనుసరిస్తూ ముందుకు పోవాలన్నారు. మెరుగైన సేవలే మనలను ప్రజల వద్దకు చేర్చి మన ప్రతిష్టను పెంచుతాయన్నారు. మెరుగైన పోలీసింగ్‌లో మన గౌరవం పతాక స్థాయికి తీసుకపోయేలా మనం అందరం కలిసి పని చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐల రజనీకాంత్, సుబ్రమణ్యం నాయుడులు ఉన్నారు.